Guntur

News April 19, 2026

గుంటూరు: CRDAకు ముగ్గురు అడిషనల్ కమిషనర్ల కేటాయింపు

image

AP CRDAకు ప్రభుత్వం మరో ముగ్గురు అడిషనల్ కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్ కలెక్టర్ కార్తీక్, ట్రాన్స్‌కో JMD సూర్యసాయి ప్రవీణ్ చంద్, ఇన్నోవేషన్ హబ్ CEO ధాత్రిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అమరావతి అభివృద్ధి పనులు వేగవంతం చేయడం, 2వ ఫేస్ ల్యాండ్ పూలింగ్ ముమ్మరం కోసం ఈ నియామకాలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మొత్తం CRDAకు నలుగురు అడిషనల్ కమిషనర్లు ఉన్నారు.

News April 18, 2026

చిన్నారి పునర్విక చికిత్సపై TDP స్పష్టత

image

అరుదైన SMA టైప్-1 వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక చికిత్సకు మంత్రి నారా లోకేశ్ రూ.6 కోట్లు స్వయంగా అందించిన విషయంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని టీడీపీ Xలో ట్వీట్ చేసింది. మొత్తం రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం దాతలు రూ.10 కోట్లు సమకూర్చగా, మిగతా మొత్తాన్ని లోకేశ్ భరించారని రాసుకొచ్చింది. CMRF నిధులు ఉపయోగించలేదని స్పష్టం చేస్తూ తప్పుడు ప్రచారాన్ని Xలో ఖండించింది.

News April 18, 2026

GNT: ఎండలు బాబోయ్.. ఉక్కబోతతో జనం ఉక్కిరి బిక్కిరి

image

గుంటూరు జిల్లాలో ఎండ‌లు మండిపోతున్నాయి. రోజు రోజుకీ సూర్య‌ప్ర‌తాపం పెరిగిపోతూ రికార్డు స్ధాయి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. వారం రోజులుగా ఎండ‌ల తీవ్ర‌త అధికంగా ఉంటోంది. శనివారం 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. ఎండ‌ల ధాటికి ప్రజలు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయటకు రావడానికే భయపడి పోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రాత్రి వేళల్లోనూ కొనసాగుతున్నాయి.

News April 18, 2026

GNT: CRDA గ్రీవెన్స్ డే మార్పు

image

రాజధాని అమరావతి రైతులు, కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడి APCRDA కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ డే ఇకపై ప్రతి సోమవారం జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కమిషనర్, ఇతర అధికారులు అర్జీలు స్వీకరిస్తారు. గతంలో శనివారం నిర్వహించగా మార్పు చేశారు. రాయపూడి CRDAలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న సిటిజన్ గ్రీవెన్స్ సెంటర్ వద్ద రోజువారీగా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.

News April 18, 2026

GNT: వైసీపీలో ‘ఆధిపత్య’ రగడ.. అంబటి VS అప్పిరెడ్డి!

image

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా అంబటి బాధ్యతలు చేపట్టగా, స్థానికంగా అప్పిరెడ్డికి ఉన్న బలమైన అనుచరగణం ఇద్దరి మధ్య చిచ్చుకు కారణమవుతోంది. నియోజకవర్గ రహస్యాలు ప్రత్యర్థి వర్గానికి చేరుతున్నాయనే అనుమానంతో నేతల మధ్య గ్యాప్ పెరగడం, క్యాడర్‌లో గందరగోళానికి దారితీస్తోంది.

News April 18, 2026

గుంటూరులో NHM పోస్టుల భర్తీ.. దరఖాస్తు చేసుకోండి!

image

గుంటూరు జిల్లా వైద్యారోగ్య శాఖలో 7 ఎన్‌హెచ్‌ఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ తదితర ఖాళీలున్నాయి. ఆసక్తి గలవారు www.guntur.nic.in లో దరఖాస్తులు పొందవచ్చని DMHO విజయలక్ష్మి తెలిపారు. ఓసీ, బీసీలు రూ.800, ఇతరులు రూ.500 ఫీజు బ్యాంకులో చెల్లించాలి. నింపిన దరఖాస్తులను ఈ నెల 18 నుంచి 30 లోగా నేరుగా లేదా రిజిస్టర్ పోస్టులో డీఎంహెచ్‌వో ఆఫీసులో అందజేయాలి.

News April 18, 2026

GNT: తీర్పు నేడే.. మళ్లీ కస్టడీ దొరుకుతుందా?

image

అక్రమాస్తుల కేసులో అరెస్టైన దేవదాయ శాఖ అధికారిణి శాంతిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతంలో రెండు రోజుల పాటు విచారించినా కీలక సమాచారం రాబట్టలేకపోయామని, ఆమె ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరింత విచారణ కోసం 10 రోజుల కస్టడీ కోరగా, కోర్టు శనివారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. “వాటర్ – పాజిటివ్ ఆంధ్రా” థీమ్ తో అన్ని గ్రామ పంచాయతీలలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.