Guntur

News April 19, 2026

ఆన్‌లైన్‌లో PGRS అర్జీలు సమర్పించవచ్చు: కలెక్టర్

image

గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమాలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా సమర్పించవచ్చని అన్నారు. 1100 టోల్ ఫ్రీ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

News April 19, 2026

భవననిర్మాణ కార్మికుల పేర్లు నమోదు చేసుకోవాలి: GNT కలెక్టర్

image

భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లను కార్మికశాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు పునః ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. వివాహ కానుక, ప్రసూతి సహాయంగా రూ.20 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్య క్రియలకు రూ.20 వేలు అందించే సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు.

News April 19, 2026

అమరావతి ఐకానిక్ టవర్లకు టెండర్లు

image

అమరావతిలోని 5 ఐకానిక్ భవనాల్లో కీలక పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టవర్ 1, 2, 3, 4లతో పాటు జీఏడీ టవర్‌కు ఎంఈపీ టెండర్లు జారీ చేసింది. టవర్ 1, 2లకు రూ.743.02 కోట్లు, టవర్ 3, 4లకు రూ.681.47 కోట్లు, జీఏడీ టవర్‌కు రూ.431.59 కోట్లు అంచనా వేశారు. భవనాల్లో విద్యుత్, ప్లంబింగ్, ఏసీ, ఫైర్ సేఫ్టీ పనులను 18 నెలల్లో పూర్తి చేసి, రెండేళ్లు నిర్వహణ చూడాలి.

News April 19, 2026

గుంటూరులో నేడు బంగారం ధర ఎంతంటే?

image

అక్షయ తృతీయ కావడంతో గుంటూరు జిల్లాలో బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. గుంటూరులో ఆదివారం 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ రూ. 1,57,934 పలుకుతోంది. 22 క్యారెట్ 10 గ్రాములు రూ. 1,43,600 చొప్పున విక్రయిస్తున్నారు. వెండి గ్రాము రూ. 263గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.

News April 19, 2026

GNT: వై.ఎస్ విజయమ్మకు లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు

image

వై.ఎస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ‘x’ వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీమతి వై.ఎస్. విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో ఆమె మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాము’. అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

News April 19, 2026

మ్యుటేషన్ కొత్త రూల్స్‌తో గుంటూరు రైతుల అవస్థలు

image

ఆటో మ్యుటేషన్ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. భూమి రిజిస్ట్రేషన్ అయ్యాక అమ్మిన, కొన్న వ్యక్తులిద్దరూ అధికారుల వద్ద బయోమెట్రిక్ వేస్తేనే మ్యుటేషన్ పూర్తవుతుంది. ఒకవేళ అమ్మిన వారు అందుబాటులో లేకున్నా, చనిపోయినా ఏం చేయాలనే దానిపై స్పష్టత లేదు. పారదర్శకత కోసమే ఈ రూల్ తెచ్చినా.. దీనివల్ల గుంటూరు జిల్లా రైతులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News April 19, 2026

గుంటూరు: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఇంటర్ ఫలితాల్లో గుంటూరు (D) రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఫస్ట్ ఇయర్‌లో 33,643 మందికి 29,530 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో 30,551 మందికి 26,856 మంది పాసయ్యారు. మొత్తం 7,808 మంది ఫెయిలయ్యారు. సెకండ్ ఇయర్‌కు సైతం ఇంప్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ నెల 27 లోపు ఫీజు చెల్లించాలి.

News April 19, 2026

గుంటూరు: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఇంటర్ ఫలితాల్లో గుంటూరు (D) రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఫస్ట్ ఇయర్‌లో 33,643 మందికి 29,530 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో 30,551 మందికి 26,856 మంది పాసయ్యారు. మొత్తం 7,808 మంది ఫెయిలయ్యారు. సెకండ్ ఇయర్‌కు సైతం ఇంప్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ నెల 27 లోపు ఫీజు చెల్లించాలి.

News April 19, 2026

గుంటూరు: ఇనాం భూములకు విముక్తి

image

ఇనాం భూములపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో గుంటూరు జిల్లాలో 75.16 ఎకరాలకు విముక్తి లభించింది. ఇకపై సర్వీసుదారులు, వారసుల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఆ భూములను అమ్ముకోవచ్చు. వాటిపై బ్యాంక్ రుణాలు కూడా పొందవచ్చు. జిల్లాలోని పెదనందిపాడు, తాడికొండ, తుళ్లూరు, ఫిరంగిపురంలో ఈ భూములున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News April 19, 2026

GNT: హోమ్‌ స్టేలకు పెరుగుతున్న ఆదరణ

image

శుభకార్యాలు, మీటింగ్స్‌ కోసం జనం ‘హోమ్ స్టే’ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఫంక్షన్ హాళ్లకు లక్షల్లో ఖర్చవుతుండగా.. ఇవి రూ. 25-30 వేలకే లభిస్తున్నాయి. గుంటూరు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏసీ, వైఫై, హోమ్ థియేటర్, స్విమ్మింగ్ పూల్ వంటి లగ్జరీ సదుపాయాలు ఉంటున్నాయి. 100 మంది వరకు పాల్గొనే చిన్న వేడుకలకు ఇవి ఎంతో అనుకూలంగా మారుతున్నాయి.