Guntur

News April 30, 2024

గుంటూరు: ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం

image

జిల్లాలో సోమవారం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయి గుంటూరు తూర్పులో 1.26 లీటర్ల మద్యం, రూ.54,700 నగదు జప్తి చేశామన్నారు. తెనాలిలో 4.4 లీటర్ల మద్యం, 1,04,000 నగదు, ప్రత్తిపాడులో రూ. 54,700 నగదు సీజ్ చేశామన్నారు. జిల్లాలో ఏప్రిల్ 29వ తేది వరకు రూ.2,55,60,603 ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు.

News April 30, 2024

గుంటూరు: బరిలో 162 మంది అభ్యర్థులు

image

నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో సోమవారం గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. పార్లమెంట్ పోటీలో 30, అసెంబ్లీ స్థానాలైన తాడికొండ 10, మంగళగిరి 40, తెనాలి 13, పొన్నూరు 14, పత్తిపాడు 13, గుంటూరు ఈస్ట్ 14, గుంటూరు వెస్ట్ 28 అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 162 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారని చెప్పారు.

News April 29, 2024

పల్నాడు జిల్లాలో 14 నామినేషన్లు ఉపసంహరణ

image

జిల్లాలో ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలు గానూ 14 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. సోమవారం జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరిగిందన్నారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి నలుగురు, చిలకలూరిపేట ఒకరు, నరసరావుపేట అసెంబ్లీకి ఇద్దరు, సత్తెనపల్లి ఐదుగురు, వినుకొండ ఇద్దరు అభ్యర్థులు వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారన్నారు.

News April 29, 2024

బాపట్ల జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య ఇదే..

image

బాపట్ల జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కలిపి 151 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా, చివరగా 104 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా వెల్లడించారు. బాపట్ల పార్లమెంటు నుంచి 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. అసెంబ్లీల వారీగా వేమూరు 15, రేపల్లె 14, బాపట్ల 15, పర్చూరు 15, అద్దంకి 15, చీరాల 15 మంది అభ్యర్థులు రానున్న ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

News April 29, 2024

నరసరావుపేట: పోటీలో 122 మంది అభ్యర్థులు

image

నరసరావుపేట పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు 122 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు కలెక్టర్ శివ శంకర్ సోమవారం తెలిపారు. పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు, అసెంబ్లీ స్థానాలకు 107 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. పెదకూరపాడు 11, చిలకలూరిపేట 25, నరసరావుపేట 14, సత్తెనపల్లి 15, వినుకొండ 14, గురజాల 13, మాచర్ల 15 మంది అభ్యర్థుల పోటీలో ఉన్నట్లు తెలిపారు.

News April 29, 2024

గుంటూరులో మే 1న చంద్రబాబు ప్రచారం

image

గుంటూరు నగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని జిల్లా పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌లు తెలిపారు. గుంటూరులో వారు మాట్లాడుతూ.. మే 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్‌షో నిర్వహిస్తారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

News April 29, 2024

నడికుడి వద్ద ఆర్టీసీ బస్సు.. బొలెరో ఢీ

image

మాచర్ల నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న బొలెరోను సోమవారం ఉదయం ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం పల్టీ కొడుతూ ముందుకు దూసుకెళ్లింది. ఆ సమయంతో బొలెరోలో డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తి ఉండగా.. వారికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని 108లో గురజాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.

News April 29, 2024

గుంటూరు: నేడు బరిలో నిలిచేది ఎవరో తేలిపోతుంది

image

సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్లు ఉపసంహరణ ఘట్టం సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ముగియనున్నది. పార్లమెంటు అసెంబ్లీ పరిధిలో ఎంతమంది నామినేషన్లు ఉప సంహరించుకుంటారో సర్వత్ర ఆసక్తిగా మారింది. తమ పేరును పోలి ఉన్న అభ్యర్థులతో ప్రధాన రాజకీయ పార్టీలు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని చర్చలు జరుపుతున్నారు. ఉపసంహరించుకున్న అభ్యర్థులకు భారీ ఎత్తున నగదు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

News April 29, 2024

పల్నాడు: గురువుకు కార్‌ను గిఫ్ట్ ఇచ్చిన పూర్వ విద్యార్థులు

image

తమను ఉన్నత స్థానాలకు చేరేలా విద్యను అందించిన ఉపాద్యాయులకు విద్యార్థులు అనేక రకాలుగా కృతజ్ఞతలు తెలుపుతుంటారు. అయితే పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయలో, చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బండి జేమ్స్ అనే ఉపాధ్యాయుడికి పూర్వ విద్యార్థులు ఏకంగా రూ.12 లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నరసింహారావు, అధ్యాపకులు ఉన్నారు.

News April 29, 2024

సీఎం జగన్ నేటి పొన్నూరు పర్యటన వివరాలు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు పొన్నూరుకు వస్తున్నారు. పి. గన్నవరం నుంచి హెలికాఫ్టర్‌లో మధ్నాహ్నం 3 గంటలకు స్థానిక జీబీసీ రహదారిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ఎన్నికల ప్రసంగం ముగించుకుని సాయంత్రం 5.30 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని తాడేపల్లికి వెళ్తారు.