India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మే- మాసానికి సంబంధించి కలెక్టర్ శివ శంకర్ ఆదివారం స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలో గల 2,83,665 మంది పింఛన్ దారులకు రెండు విధాలుగా.. మే ఒకటో తేదీ నుంచి పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. డీబీటీ ద్వారా వారి ఖాతాలోకి ఒక పద్దతి, రాలేని వారికి ఇంటి వద్ద సచివాలయ సిబ్బంది ఇవ్వడం మరో పద్దతి అన్నారు.

జిల్లాలో ఆదివారం ప్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరు పశ్చిమలో 1.62 లీటర్ల మద్యం, పొన్నూరులో 7.2 లీటర్ల మద్యం, రూ.2,70 లక్షలు నగదు సీజ్ చేశామన్నారు. తెనాలి పరిధిలో రూ.2,21,100/-ల నగదు, తాడికొండ పరిధిలో రూ.1,20 లక్షలు, ప్రత్తిపాడు పరిధిలో రూ. లక్ష నగదు పట్టుకున్నామన్నారు. జిల్లాలో ఏప్రిల్ 28వ తేదీ వరకు రూ.2,53,42,262/- విలువ గల మద్యం, నగదు సీజ్ చేశామన్నారు.

తాను రూ.2వేల కోట్లు సంపాదించానని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అబద్ధాలు చెబుతున్నారని, దమ్ముంటే నిరూపించాలని వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య సవాల్ విసిరారు. ఆదివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. నిరూపించకపోతే పెమ్మసానికి ఉన్న రూ.5,700 కోట్లు తనకు ఇవ్వాలన్నారు. చంద్రబాబుకు గుంటూరు MP అభ్యర్థి దొరక్క అమెరికా నుంచి డబ్బుల సంచులతో పెమ్మసానిని దిగుమతి చేసుకున్నాడని ఎద్దేవా చేశారు.

తాడేపల్లి నుంచి సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి వస్తుండగా కేసరపల్లి వద్ద సీఎం కాన్వాయ్‌కి కుక్క అడ్డం పడింది. ఈ ఘటనలో కుక్కకు గాయాలు కాగా సీఎం పర్సనల్ సెక్యూరిటీ కుక్కని హాస్పిటల్‌కి తీసుకెళ్లమని గన్నవరం పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించి అనంతరం గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద భద్రంగా ఉంచారు. పూర్తిగా నయం అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోమని సీఎం సెక్యూరిటీ ఆదేశించారు.

బాపట్ల మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి ఆదివారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. బాపట్ల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఆదివారం చంద్రబాబును కలిసి తెలుగుదేశంలో చేరారు. ఆయనను చంద్రబాబు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేస్తానని చీరాల గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదలైనట్లు ఆ శాఖ జిల్లా సమన్వయకర్త కేఎంఏ హుస్సేన్ శనివారం తెలిపారు. సత్తెనపల్లిలో ఆయన మాట్లాడుతూ.. అపరాధ రుసుము లేకుండా ఈ నెల 29 నుంచి మే 4 వరకు ఆన్‌లైన్‌లో చెల్లించాలని ఆయన సూచించారు. జూన్ 1 నుంచి 8 వరకు పరీక్షలు జరగనున్నాయని తెలిపారు.

నామినేషన్ అఫిడవిట్‌లో పోలీసు కేసుల వివరాలు నమోదు చేయకపోవడంపై స్వతంత్ర అభ్యర్థి బొర్రా వెంకట అప్పారావుకు నోటీసు అందజేసినట్లు ఎన్నికల అధికారి వి.మురళీకృష్ణ తెలిపారు. ఆయన నామినేషన్ అఫిడవిట్‌లో సత్తెనపల్లి పట్టణం, నకరికల్లు పోలీసు స్టేషన్లలో గతేడాది నమోదైన 2కేసుల వివరాలు నమోదు చేయలేదని అన్నారు. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ..లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని RO నోటీసులో పేర్కొన్నారు.

బాపట్ల పట్టణంలోని ప్యాడిసన్ పేట జగనన్న కాలనీ హైవే వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళుతున్న కారు ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారు వెంగళ విహర్‌కు చెందిన వారుగా గుర్తించారు.

గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో 17,91,543 మందికి ఎన్నికల సంఘం ఓటు హక్కు కల్పించింది. జిల్లాలో పురుష ఓటర్లు 8,65,377 మంది, మహిళలు 9,26,007 మంది, మూడో వర్గం 159 మంది కలిపి మొత్తం 17,91,543 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 60,630 మంది ఎక్కువ. తుది జాబితాలో ఓటు పొందిన వారు మే 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

జగన్ రెడ్డి తనకు తగిలిన గులకరాయి గాయంపై బ్యాండేజ్ తీసేస్తే ఎలాంటి మచ్చాలేదని, దీంతో ఆయన నటన ప్రజలకు అర్థమైందని నారా లోకేశ్ పేర్కొన్నారు. శనివారం రాత్రి మంగళగిరి పట్టణం ఇందిరానగర్‌లో నిర్వహించిన రచ్చబండ సభలో లోకేశ్ మాట్లాడుతూ.. ఇందిరా నగర్‌లో నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. స్టేడియం పనులు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపడతామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.