India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శనివారం ప్లయింగ్ స్క్వాడ్ లు నిర్వహించిన తనిఖీలలో తెనాలి నియోజకవర్గ పరిధిలో రూ.1,00,000/- నగదు పట్టుబడింది. అదేవిధంగా తాడికొండ నియోజకవర్గ పరిధిలో రూ.66,500/- ల నగదు సీజ్ చేశారు. జిల్లాలో జరిగిన తనిఖీలలో ఏప్రిల్ 27వ తేది వరకు రూ.2,46 కోట్ల నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేయటం జరిగిందని అధికారులు వెల్లడించారు.

పెదకూరపాడు మండలం కన్నెగండ్ల గ్రామంలో శనివారం ఇద్దరు చిన్నారులు నీటి గుంతలతో దిగి మృత్యువాత పడ్డారు. వేణుగోపాల్ (11), ధనుష్ (13)లు వేసవి సెలవులు కావడంతో మేనమామ ఊరు కన్నెగండ్లకు వచ్చారు. అయితే శనివారం సాయంత్రం అల్లిపరవు వాగు వద్ద ఉన్న పొలాలకు నీరు నిల్వ చేసుకోవడానికి తవ్విన గుంతలో ఈతకు దిగారు. గుంతలో మట్టి చేరి ఉండడంతో ఇరుక్కుపోయి ఊపిరి ఆడగా మృతి చెందారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులకు ఎన్నికల కమిషన్ గడువు పొడిగించిందని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి శనివారం తెలిపారు. తొలుత ఈనెల 26 వరకు అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్ ప్రస్తుతం ఒకటవ తేదీ వరకు గడువును పొడిగించిందన్నారు. కావున ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో అందజేయాలన్నారు.

శనివారం జగన్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో చూశాక ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా లేఖలా ఉందని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో లోకేశ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3వేల పెన్షన్‌ను రూ.4వేలకు పెంచి, పెన్షన్ సొమ్మును వాలంటీర్ల ద్వారా అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి అందించే బాధ్యత తనదన్నారు.

అంబటి మురళీకృష్ణ సేవ పేరుతో పొన్నూరు ప్రజలను వంచించడానికి రాజకీయాల్లోకి వచ్చాడంటూ టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు. పొన్నూరులో మాట్లాడుతూ.. అంబటి రాంబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత సత్తెనపల్లికి మురళీకృష్ణ షాడో ఎమ్మెల్యేగా మారి రాజ్యాంగ శక్తిగా ఎదిగాడన్నారు. ఒక దొంగను గత ఐదేళ్లుగా భరించామని.. ఇంకో గజదొంగ వచ్చాడంటూ ఎద్దేవా చేశారు. గజదొంగ నిజస్వరూపం బయట పెడతామని చెప్పారు.

మంగళగిరి అసెంబ్లీకి బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఇటీవల నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా.. అధికారుల పరిశీలన అనంతరం ఆమోదం లభించింది. ఈయన మంగళగిరితో పాటు పుంగనూరులో పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో తనపై 28 కేసులున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, మంగళగిరి నియోజకవర్గానికి 76 నామినేషన్లు దాఖలు కాగా, 71 ఆమోదం పొందాయి.

పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించనున్నారు. పాలిసెట్ కోసం జిల్లాలో మొత్తం 14 కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరంలో 11 కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఆయా కేంద్రాలలో 4,628 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది.

మంత్రి విడదల రజిని నామినేషన్ పత్రాల్లో లెక్కలేనన్ని తప్పులు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి రజిని భర్త కుమారస్వామికి అమెరికాలో పౌరసత్వం ఉందన్నారు. మంత్రి నామినేషన్లో వార్షికాదాయం రూ. 3,96,400 ఉందన్నారు. పెదపలకలూరులో రూ.4,55,56,500 విలువ కలిగిన భూమి ఎలా కొన్నారో చెప్పాలన్నారు.

మంగళగిరి అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మురుగుడు లావణ్య నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎదుట ఎన్నికల ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. కాగా లావణ్య నేరుగా కాకుండా తన తరపు వ్యక్తులతో నామినేషన్ దాఖలు చేశారు. దీనితో శుక్రవారం నామినేషన్ పత్రాల పరిశీలనలో అధికారులు తిరస్కరించారు. మంగళగిరిలో ఐదు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ప్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో తాడికొండ నియోజకవర్గ పరిధిలో కారులో తీసుకెళ్తున్న సరైన పత్రాలు చూపని రూ.1.50లక్షల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 26వ తేది సాయంత్రం 6 గంటల వరకు రూ.2,44,57,165ల నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేశామని అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.