India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త కొడవటిగంటి రోహిణీప్రసాద్ తెనాలిలో జన్మించారు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు, వరూధినిలకు జన్మించారు. రోహిణీప్రసాద్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో శాస్త్రవేత్తగా పనిచేసారు. సంగీతం, సాహిత్యం, సైన్స్ మొదలైన అంశాలపై సరళమైన తెలుగులో ఆయన రాసిన వ్యాసాలు, పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. సెప్టెంబరు 8, 2012 న ముంబైలో మరణించారు.

చక్రవర్తిగా సుపరిచితుడైన సంగీత దర్శక గాయకుడు చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు,ఆయన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో 1936 సెప్టెంబరు 8న జన్మించారు. అతను 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు. చక్రవర్తి 959 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. భారత తపాలశాఖ వారు గుంటూరులో 2014 సెప్టెంబర్ 9న చక్రవర్తి గారిపై ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేశారు.

గుంటూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం PGRS కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో తమ సిబ్బంది అర్జీలను స్వీకరిస్తారన్నారు. https://meekosam.ap.gov.in వెబ్‌సైట్లో ప్రజలు తమ అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 1100కి ఫోన్ చేసి కూడా తమ అర్జీ సమాచారం తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్ల భర్తీకి గుంటూరులో ఆదివారం పరీక్షలు జరిగాయి. FBA, ABF పోస్టులకు 7,655 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 5,988 మంది హాజరయ్యారు. సెక్షన్ ఆఫీసర్ పరీక్షకు 1,492 మంది హాజరుళకావాల్సి ఉండగా.. 1,133 మంది హాజరయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారి పరీక్షా కేంద్రాలతో పాటూ ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను పరిశీలించారు.

తెలుగు సినిమా సంగీత దర్శకులు భీమవరపు నరసింహరావు (బి.ఎన్.ఆర్.) గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొలకలూరులో జన్మించారు. జనవరి 24, 1905న జన్మించిన ఆయనకు 8 ఏళ్ల వయసు నుంచే సంగీతంపై ఆసక్తి కలిగింది. ఆయన మొదటి సినిమా సతీ తులసి (1936), ఆఖరి చిత్రం అర్ధాంగి (1955). సెప్టెంబర్ 7, 1976న ఆయన మరణించారు. ఆయన తెలుగు సినిమా సంగీతానికి ఎనలేని సేవలు అందించారు.

కేంద్ర విద్యాశాఖ జాతీయ సంస్థల ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ప్రకటించిన ర్యాంకుల్లో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 31వ స్థానానికి పడిపోయింది. 2024లో 26వ ర్యాంకు సాధించిన ఈ యూనివర్సిటీ పాలకమండలి లేకపోవడం, శాస్త్రవేత్తల పోస్టుల భర్తీ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో యూనివర్సిటీ ప్రతిష్ఠకు గండి పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరులో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ.240, స్కిన్‌తో అయితే రూ.220కి లభిస్తోంది. కొన్ని చోట్ల డిమాండ్‌ను బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నాయి. మటన్ ధర యథావిధిగా రూ.950 – 1020 మధ్య కొనసాగుతుంది. చేపల్లో బొచ్చ రూ.200, రాగండి రూ.180గా విక్రయిస్తున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఏపీ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీఈడ్‌సెట్-2025 బీఈడీ కోర్సుల ప్రవేశాల కోసం సెప్టెంబర్ 7న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఆచార్య ఏవీవీఎస్ స్వామి శనివారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది చోట్ల అరకు కాఫీ ఔట్ లెట్లు ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తుళ్లూరు గ్రామంలో, హైకోర్టు, అసెంబ్లీ ప్రాంగణాలతో పాటు గుంటూరు నగరంలో రెండు చోట్ల, తెనాలి, పొన్నూరు, మరో ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి వెలుగు అధికారులు కసరత్తు చేస్తున్నారు. డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా లబ్ధి చేకూరేలా అవుట్లెట్లు ఏర్పాటు కానున్నాయని అధికారులు అంటున్నారు.

పరిశోధనలు, మేధస్సుతో తోలు ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తెచ్చిన శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ. ఈ నెల 10న ఆయన జయంతి. తెనాలి సమీపంలోని యలవర్రు ఆయన స్వగ్రామం. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ప్రజలకు చేరువ కావాలని ఆయన తపించారు. అందుకే ఆయనను ‘ప్రజల శాస్త్రవేత్త’గా కీర్తించారు. ఆయన సేవలకు 1971లో కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
Sorry, no posts matched your criteria.