India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని, కల్పించిన ప్రతి ఉద్యోగాన్ని విధిగా ట్రాక్ చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 6.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న 787 కంపెనీల పురోగతిని కూడా పర్యవేక్షిస్తామన్నారు. అన్నింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు పలు చోట్ల జరిపిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. 750 గ్రా. బంగారం, 3 కేజీల వెండి, ఆస్తి పత్రాలు, కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్లు నిర్ధారించిన ఏసీబీ బృందం, ఆమెను విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించింది.

రహదారులు, భవనాల శాఖా మంత్రి బి.సి జనార్దన్ రెడ్డి బుధవారం గుంటూరు నగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6.30ని.ల వరకు శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణ పనులను స్వయంగా ప్రభుత్వ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించనున్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తాడేపల్లికి తిరుగు పయనం అవుతారు.

అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. CM చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయబట్టే NFDB ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. APలో దేశంలో ప్రముఖ ఆక్వాకల్చర్ రాష్ట్రంగా ఉండటంతో అమరావతిలో పూర్తి స్థాయి ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు.

గుంటూరు జెడ్పీ కార్యాలయంలో బుధవారం రేవుల వేలం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సీల్ టెండర్లు స్వీకరిస్తారు. అనంతరం 2.30 గంటలకు బహిరంగ వేలం జరుగుతుంది. పాల్గొనేవారు ముందుగా టెండర్ సమర్పించాలి. రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరి. టెండర్ ఇచ్చినవారికే వేలంలో అవకాశం ఉంటుంది. వివాదాలపై అధికారుల నిర్ణయం తుది అని అధికారులు వెల్లడించారు.

మాజీమంత్రి అంబటి రాంబాబు సోమవారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. CM నారా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు తనను అరెస్ట్ చేసినప్పుడు తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని పిటిషన్‌లో కోరారు. ప్రధానంగా తనను ఇబ్బంది పెట్టిన నల్లపాడు పోలీసులపై చర్యలకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

ముందు బుక్ చేసిన వారికి సిలిండర్ డెలివరీ చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. గుంటూరు జిల్లాలో LPG సేల్స్ ఆఫీసర్స్, గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లుతో జాయింట్ కలెక్టర్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కువ పెండింగ్ ఉన్న ఏజెన్సీలు అదనపు లోడ్స్ తెప్పించాలని సేల్స్ ఆఫీసర్స్‌ను ఆదేశించారు. గ్యాస్ ఏజెన్సీలు ఖచ్చితంగా డోర్ డెలివరీ మాత్రమే చెయ్యాలన్నారు.

Sorry, no posts matched your criteria.