Guntur

News April 10, 2026

రూ.4 లక్షలు జరిమానా.. 206 వాహనాల సీజ్: SP

image

జిల్లా వ్యాప్తంగా పోలీసులు గురువారం ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 600కి పైగా వాహనాలను తనిఖీ చేసి, 326 వాహనాలకు రూ.4 లక్షల జరిమానా విధించినట్లు గుంటూరు SP వకుల్ జిందాల్ తెలిపారు. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మోడిఫైడ్ సైలెన్సర్లతో పాటు పత్రాలు లేని 206 వాహనాలను సీజ్ చేశామన్నారు. మైనర్ల డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

News April 10, 2026

గుంటూరు కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్..!

image

గుంటూరు కలెక్టర్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ District Collector Guntur మాత్రమే అని అధికారులు వెల్లడించారు. CM Saikanth Varma las పేరుతో ఉన్నది నకిలీ అకౌంట్‌గా గుర్తించినట్లు తెలిపారు. ప్రజలు గమనించి మోసపోవద్దని, ఆ అకౌంట్‌ను అనుసరించవద్దని సూచించారు. అనుమానాస్పద అకౌంట్లపై వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫేక్ ఐడీలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News April 10, 2026

సీనియర్ T-20 గుంటూరు జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక

image

ఈ నెల 11 నుంచి 14 వరకు మూలపాడులో నిర్వహించనున్న ACA సీనియర్ T-20 మెన్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ పోటీలకు గుంటూరు జిల్లా సీనియర్ జట్టు ఎంపికైంది. క్రీడాకారులు షేక్‌ రషీద్(C), మహీప్, వంశీకృష్ణ(WC), అఖిల్, సిద్దార్థ్, ప్రణయ్ కుమార్, సమన్విత్, షేక్‌ అస్లాం బేగ్, రేవంత్ కుమార్, సిద్దు కార్తీక్ రెడ్డి, ఆకాశ్, షేక్.తౌఫిక్, మనోహర్, జయచంద్రకేశవ్, షేక్.బాజీ ఎంపికయ్యారు. మరో ఆరుగురు స్టాండ్ బైస్ ఉన్నారు.

News April 9, 2026

గుంటూరు: ఎస్పీలుగా పలువురి పేర్లు పరిశీలన

image

గుంటూరు జిల్లాలో పలువురు అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ఎస్పీల ప్యానెల్ జాబితాలో గుంటూరులో పనిచేస్తున్న పలువురు అదనపు ఎస్పీల పేర్లు ఉన్నాయి. గుంటూరు క్రైమ్స్ అదనపు ఎస్పీ కే. సుప్రజ, ఎల్ అండ్ ఓ అదనపు ఎస్పీ ఏ.టీ.వి రవికుమార్, అడ్మిన్ అదనపు ఎస్పీ జీ.వీ. రమణమూర్తి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. వీరికి త్వరలో ఎస్పీలుగా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది.

News April 9, 2026

అమరావతిలో కేంద్ర కామన్ సెంట్రల్ సెక్రటేరియట్‌కు రంగం సిద్ధం

image

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కీలక ప్రాజెక్ట్ అమలుకు ముందడుగు పడింది. రూ.2,534 కోట్ల వ్యయంతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర ప్రజా నిర్మాణ విభాగం డీపీఆర్ సిద్ధం చేసి కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపింది. ఆమోదం లభించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ భవనం పూర్తయితే పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట పనిచేసే అవకాశం ఏర్పడి రాజధాని పరిపాలనా ప్రాధాన్యం మరింత పెరగనుంది.

News April 9, 2026

GNT: బహుముఖ ప్రజ్ఞాశాలి మన్నవ బాలయ్య

image

ప్రముఖ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య గుంటూరు జిల్లా చావపాడులో 1930 ఏప్రిల్ 9న జన్మించారు. ఇంజినీరింగ్ చదివిన ఆయన 1958లో ‘ఎత్తుకు పై ఎత్తు’ చిత్రంతో సినిమాల్లోకి వచ్చారు. తన కెరీర్‌లో 350కి పైగా విభిన్న చిత్రాల్లో నటించారు. అమృతా ఫిలిమ్స్ సంస్థను స్థాపించి ఎన్నో ఉత్తమ చిత్రాలు నిర్మించారు. అనారోగ్యంతో తన 92వ పుట్టినరోజైన 2022 ఏప్రిల్ 9న ఆయన మృతి చెందారు.

News April 9, 2026

GNT: ఎస్ఐ పదోన్నతి పరీక్షలు పూర్తి

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లకు ఎస్ఐ పదోన్నతి పరీక్షలు గురువారంతో ముగిశాయి. రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పర్యవేక్షణలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అభ్యర్థులకు రాత, మౌఖిక పరీక్షలతో పాటు అవుట్‌డోర్ డ్రిల్స్ నిర్వహించారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ప్రక్రియలో అభ్యర్థుల నైపుణ్యాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అంచనా వేశారు.

News April 9, 2026

ప్రజలు జనగణనకు సహకరించాలి: కలెక్టర్

image

జనాభా గణన విజయవంతం కావడానికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ కోరారు. భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 2027 జనాభా గణన (Census-2027) రెండు దశల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి దశగా ఇండ్ల జాబితా, గృహ గణన నిర్వహిస్తారని తెలిపారు. ఇందులో ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులపై సమాచారం సేకరించడం జరుగుతుందన్నారు. పూర్తిగా డిజిటల్ విధానంలో ఉంటుందన్నారు.

News April 9, 2026

మంగళగిరి: అర్ధరాత్రి హైవేపై మంత్రి బస్సుల తనిఖీ

image

మంగళగిరి(M) ఖాజా టోల్ ప్లాజా వద్ద మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం రాత్రి ఆకస్మికంగా ప్రైవేట్ బస్సులను తనిఖీ చేశారు. బస్సుల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలు, డ్రైవర్ల లైసెన్సులు వంటి అంశాలను పరిశీలించారు. 20కి పైగా బస్సులను పరిశీలించి, నిబంధనలు పాటించని ఓ బస్సును సీజ్ చేశారు. మరో 15 బస్సులపై జరిమానా విధించారు. ప్రయాణికుల భద్రత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.

News April 8, 2026

తాడేపల్లి: దేవదాయ శాఖ అధికారిణి నివాసంలో గుర్తించిన ఆస్తులివే!

image

తాడేపల్లిలో దేవదాయ శాఖ అధికారి శాంతి నివాసంలో ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉన్నట్లు ACB అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఎండాడ (విశాఖ)లో లగ్జరీ ఫ్లాట్, కుంచనపల్లిలో జి+2 బిల్డింగ్, 770గ్రా. గోల్డ్, 3కేజీల సిల్వర్, బ్యాంక్ ఖాతాలో రూ. 3 లక్షల క్యాష్, రూ. 1.15 లక్షల క్యాష్, వోక్స్‌వ్యాగన్ కార్, బైక్, ఇతర విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉన్నట్లు అధికారులు తాము చేసిన సుదీర్ఘ సోదాలలో గుర్తించారు.