India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాఠశాల విద్యాశాఖ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అన్సారియాను గుంటూరు (D) STU నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బిల్లుల గురించి వివరించారు. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆమె వారికి హామీ ఇచ్చారు.

గుంటూరు జిల్లా పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ఎస్పీ వకుల్ జిందాల్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. “ఎస్పీ సంపర్క్” పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా కానిస్టేబులరీ స్థాయి సిబ్బంది తమ సమస్యలను నేరుగా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లవచ్చు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు 8688831470 నంబర్ ద్వారా అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.

కాకినాడకు సంబంధించిన ఓ చర్చి ట్రస్ట్ రెన్యూవల్ కోసం మాజీ MP నందిగం సురేశ్ ఓ వ్యక్తి నుంచి రూ. 25 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ విజయవాడకు చెందిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సురేశ్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు.

రాష్ట్ర క్యాబినెట్ భేటీలో పారిశ్రామికాభివృద్ధి, సాంకేతిక రంగాలకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో 200 మెగావాట్ల బయోమాస్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు SAEL సంస్థకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్వాంటమ్ టెక్నాలజీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వ్యాలిడేషన్ హబ్ కోసం భారీగా నిధులు కేటాయించడంతో పాటు, QAIG సంస్థకు 2.5 ఎకరాల భూమి, రూ.108 కోట్ల పెట్టుబడికి ఆమోదం తెలిపారు.

హైదరాబాద్-అమరావతి-మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే కోసం మూడు మార్గాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అమరావతి ఓఆర్ఆర్ మీదుగా 303.7 కి.మీ, విజయవాడ బైపాస్, ఓఆర్ఆర్ మీదుగా 293.19 కి.మీ, రాజధాని గుండా వెళ్లే 288.33 కి.మీ మార్గాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ మూడింటిలో అనువైన ఒక మార్గాన్ని త్వరలో అధికారికంగా ఖరారు చేయనున్నారు.

పీజీఆర్ఎస్ ఫిర్యాదులను 12 గంటల్లో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ సి.ఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పై కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జనాభా గణన పై జిల్లా వ్యాప్తంగా 3 రోజుల శిక్షణ కార్యక్రమం మండలాల్లో గురువారం నుంచి ప్రారంభమైందని, శిక్షణా కార్యక్రమానికి హాజరు కాని వారి పై చర్యలు చేపట్టడతామన్నారు. రాబోయే రోజుల్లో డయేరియా ప్రబలకుండా చూడాలన్నారు.

జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిర్దిష్టమైన అంశాలతో సమగ్ర ప్రణాళికలను సమర్పించాలని అధికారులను కలెక్టర్ CM సాయికాంత్ వర్మ ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ హాలులో ముఖ్యమంత్రి జిల్లా సమీక్షా సమావేశానికి సంబంధించి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, శాఖల వారీగా పూర్తి నివేదిక అందించాలన్నారు.
Sorry, no posts matched your criteria.