Guntur

News April 7, 2026

ముందుగా బుక్ చేసుకున్న వారికే సిలిండర్: GNT జేసీ

image

ముందు బుక్ చేసిన వారికి సిలిండర్ డెలివరీ చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. గుంటూరు జిల్లాలో LPG సేల్స్ ఆఫీసర్స్, గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లుతో జాయింట్ కలెక్టర్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కువ పెండింగ్ ఉన్న ఏజెన్సీలు అదనపు లోడ్స్ తెప్పించాలని సేల్స్ ఆఫీసర్స్‌ను ఆదేశించారు. గ్యాస్ ఏజెన్సీలు ఖచ్చితంగా డోర్ డెలివరీ మాత్రమే చెయ్యాలన్నారు.

News April 7, 2026

ఉమ్మడి గుంటూరు జిల్లాలో అదనపు కోర్టులు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరులో ఒక ఫ్యామిలీ కోర్టు ఇప్పటికే కొనసాగుతుండగా, మరో జిల్లా స్థాయి ఫ్యామిలీ కోర్టు ఏర్పాటు కానుంది. సత్తెనపల్లి, మంగళగిరిలో ఒక్కొక్క సబ్ కోర్టు, వినుకొండలో అదనంగా మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకానుంది. కొత్తగా అమరావతిలో మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

News April 6, 2026

కొండపాటూరు తిరునాళ్లు.. భక్తులకు శుభవార్త

image

కాకుమాను (M) కొండపాటూరు పోలేరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజారవాణా అధికారి డి. సాంబ్రాజ్యం తెలిపారు. గుంటూరు-1, పొన్నూరు డిపోల నుంచి 20 బస్సులు తిరుగుతాయన్నారు. గుంటూరులో ఉదయం 5.30ని.ల నుంచి ప్రతీ అరగంటకు ఒక బస్సు, పెదనందిపాడు-కొండపాటూరు మధ్య 10ని.లకు ఒక బస్సు, పొన్నూరు- కొండపాటూరుకు ప్రతీ 20 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందని తెలిపారు.

News April 6, 2026

GNT: రూ.1.10 కోట్ల బీమా పరిహారం

image

గుంటూరు చంద్రమౌళి నగర్‌లో ఉన్న SBI శాఖలో పోలీస్ కానిస్టేబుల్ మరణ బీమా క్లెయిమ్ కింద రూ.1.10 కోట్ల చెక్కును లబ్ధిదారు అందజేశారు. లబ్ధిదారురాలైన కె. ప్రవీణకు ప్రాంతీయ మేనేజర్ కిశోర్ కుమార్ సోమవారం అందజేశారు. క్లెయిమ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంలో శాఖ మేనేజర్ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీత ఖాతాలను ఎస్‌బీఐలో నిర్వహిస్తే ఇలాంటి బీమా ప్రయోజనాలు పొందవచ్చని సూచించారు.

News April 6, 2026

సీఎం పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్

image

CM చంద్రబాబు మంగళవారం రాయపూడి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఏర్పాట్లను సమీక్షించారు. సోమవారం జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, కమిషనర్ మయూర్ అశోక్, ఎస్పీ వకుల్ జిందాల్‌తో కలిసి పెరేడ్ గ్రౌండ్‌ను పరిశీలించారు. భద్రత, ప్రోటోకాల్ విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.

News April 6, 2026

కొండపాటూరు తిరునాళ్ల.. భక్తులకు శుభవార్త

image

కాకుమాను (M) కొండపాటూరు పోలేరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజారవాణా అధికారి డి. సాంబ్రాజ్యం తెలిపారు. గుంటూరు-1, పొన్నూరు డిపోల నుంచి 20 బస్సులు తిరుగుతాయన్నారు. గుంటూరులో ఉదయం 5.30ని.ల నుంచి ప్రతీ అరగంటకు ఒక బస్సు, పెదనందిపాడు-కొండపాటూరు మధ్య 10ని.లకు ఒక బస్సు, పొన్నూరు- కొండపాటూరుకు ప్రతీ 20 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందని తెలిపారు.

News April 6, 2026

GNT: పోలీస్ గ్రివెన్స్‌కి 161 అర్జీలు

image

గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం జరిగింది. ఎస్పీ వకుల్ జిందాల్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, సైబర్ నేరాల పై మొత్తం 161 ఫిర్యాదులు అందాయని ఎస్పీ తెలిపారు. PGRSకి అందిన ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ద చూపించి పరిష్కరించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.

News April 6, 2026

దుగ్గిరాలలో అనాథలా మిగిలిన అమ్మ..!

image

ఎవరో తెలియదు.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వారం రోజులుగా కదల లేని స్థితిలో ఓ అనాథ అమ్మ దుగ్గిరాలలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం ఆవరణలో నిస్సత్తువగా పడి ఉంది. అటుగా వెళ్తున్న వారు చూసి అయ్యో పాపం అని వెళుతున్నవారే తప్పా ఎవ్వరూ ఆదుకోవడం లేదు. అస్పష్టంగా ఉన్న ఆమె మాటలు విన్న వారు సంపన్న కుటుంబానీకి చెందినదై ఉండవచ్చని భావిస్తున్నారు. మరి ఆ అమ్మను అక్కున చేర్చి ఆదరించేదెవరో..?

News April 6, 2026

శాంతి భద్రతల పరిరక్షణే కార్డన్ సెర్చ్ లక్ష్యం: SP

image

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు
గుంటూరు SP వకుల్ జిందాల్ తెలిపారు. తాడేపల్లి పరిధి సలాం సెంటర్ పరిధిలో సోమవారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలు సీజ్ చేశారు. అనంతరం స్థానిక యువకులతో డ్రగ్స్ వద్ద బ్రో ప్రతిజ్ఞ చేయించారు. ఎస్పీతో పాటు, డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ వీరేంద్ర సిబ్బంది ఉన్నారు.

News April 6, 2026

గుంటూరులో 5 రైల్వే గేట్ల వద్ద వంతెనల నిర్మాణానికి ప్రణాళిక

image

గుంటూరు జిల్లాలో 5 రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ROB నిర్మాణానికి రైల్వే శాఖ ముందడుగు వేసింది. శ్యామలనగర్, సంజీవయ్యనగర్, నెహ్రూనగర్ ప్రాంతాలతో పాటు అమరావతి ఈ-13 రోడ్, నంబూరు-మంగళగిరి మార్గాల్లో అధ్యయనం చేపడతారు. ఈ నెలలోనే కన్సల్టెన్సీ ఎంపిక చేసి DPR సిద్ధం చేయనున్నారు. ట్రాఫిక్ సమస్యల కారణంగా నెహ్రూనగర్, సంజీవయ్యనగర్ గేట్లకు ప్రాధాన్యం ఇచ్చారు. 2 సంవత్సరాల్లో దశలవారీగా పనులు పూర్తి చేయనున్నారు.