India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బకాయిలను త్వరితగతిన చెల్లించేలా కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీంతో పెండింగ్‌లో ఉన్న రూ.7,059 కోట్ల బిల్లులను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిధుల లభ్యత ఆధారంగా ఈ చెల్లింపులు జరిగేలా మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు.

మంగళగిరి APSP 6వ బెటాలియన్ పరిధిలోని ఉండవల్లి ఫైరింగ్ రేంజ్‌ను OCTOPUS విభాగానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. 45 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ రేంజ్ గత ఐదు దశాబ్దాలుగా వినియోగంలో ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పోలీసులు ఇక్కడ శిక్షణ పొందుతుండగా, ఇప్పటివరకు తాడేపల్లి వడ్డేశ్వరం వద్ద ప్రైవేట్ భవనంలో OCTOPUS విభాగం ఉంది.

పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు భారీ స్పందన లభించింది. 150 కాంట్రాక్ట్ పోస్టులకు 7,500 దరఖాస్తులు అందాయి. మార్చి 31తో దరఖాస్తుల గడువు ముగిసింది. ఈ నెలాఖరులోగా స్క్రూటినీ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎంపిక చేపడతారు. ఉద్యోగాల పేరుతో దళారులను నమ్మవద్దని RD శోభరాణి హెచ్చరించారు. కాగా గుంటూరు ఆర్డీ కార్యాలయం గత నెల నోటిఫికేషన్ ఇచ్చింది.

ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించిన ప్రభుత్వం, ఇతర బకాయిలలో జాప్యం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. రవాణా ఖర్చులు, గన్నీ సంచుల కోసం రూ.33 కోట్లకు పైగా రైతులకు చెల్లించాల్సి ఉంది. బాపట్ల జిల్లాకే ఎక్కువ భాగం ఉంది. గుంటూరు, పల్నాడు రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. హమాలీ చార్జీలు ఇప్పటికే ఇచ్చారు. రబీ సీజన్ ప్రారంభం కావడంతో పెండింగ్ మొత్తాలు వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

@తెనాలి ప్రస్తుతం 40 వార్డులు ఉండగా 52కు పెరిగాయి
@రేపల్లె ప్రస్తుతం 28 వార్డులు ఉండగా -36కు పెరిగాయి
@మాచర్ల ప్రస్తుతం 31 వార్డులు ఉండగా 36కు పెరిగాయి
@సత్తెనపల్లి ప్రస్తుతం 31 వార్డులు ఉండగా 36కు పెరిగాయి
@వినుకొండ ప్రస్తుతం 32 వార్డులు ఉండగా 36కు పెరిగాయి
@గురజాల ప్రస్తుతం 20 వార్డులు ఉండగా 23కు పెరిగాయి

రాష్ట్రవ్యాప్తంగా 482 మంది వైద్యులకు నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జిల్లాల వారీగా పంపిణీలో పల్నాడు జిల్లాకు 26 మంది, గుంటూరు జిల్లాకు 14 మంది వైద్యులను కేటాయించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల్లో సేవలందించేందుకు వీరిని నియమించగా, 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని సూచించారు. ఆన్‌లైన్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా పోస్టింగులు ఇచ్చినట్లు వెల్లడించారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పీజీ, ఇంజనీరింగ్ ప్రవేశాల అడ్మిషన్స్ బ్రోచర్‌ను వీసీ గంగాధరరావు విడుదల చేశారు. అడ్మిషన్స్ డైరెక్టర్ బ్రహ్మాజీరావు, తదితరులు పాల్గొన్నారు. అడ్మిషన్ ప్రక్రియ, కోర్సుల వివరాలు, అర్హతలు, ప్రవేశ పరీక్షల సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లైన www.anu.ac.in, www.nagarjunauniversity.ac.inలను సందర్శించాలని తెలిపారు.

Sorry, no posts matched your criteria.