Guntur

News April 6, 2026

గుంటూరు జిల్లాలో మండిపోతున్న ఎండలు

image

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. అత్యధికంగా రెంటచింతలలో గరిష్ఠం 42, కనిష్ఠం 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నరసరావుపేటలో 40-27 డిగ్రీలుగా రికార్డయ్యాయి. అలాగే గుంటూరులో 38-25, తెనాలిలో 37-25 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీర ప్రాంతాలైన బాపట్ల, చీరాలలో గరిష్ఠం 35, కనిష్ఠం 26 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

News April 5, 2026

PGRS అర్జీల స్థితిని తెలుసుకోండిలా: GNT కలెక్టర్

image

గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూక్లీనిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు.  మీకోసం వెబ్ సైట్‌లో ప్రజలు అర్జీలు సమర్పించవచ్చని, సమర్పించిన అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చేసుకోవచ్చని చెప్పారు.

News April 5, 2026

గుంటూరులో ఓపెన్ డ్రింకింగ్‌.. 179 మందిపై కేసులు

image

గుంటూరు జిల్లాలో బహిరంగ మద్యం తాగే వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. SP వకుల్ జిందాల్ ఆదేశాలతో నిన్న సాయంత్రం 5:30 నుంచి 9గంటల వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 178 కేసులు నమోదు చేసి, 179 మందిపై చర్యలు తీసుకున్నారు. ఇందులో 8 FIR కేసులు, 170 పెట్టి కేసులు ఉన్నాయి. ప్రధాన రహదారులు, కాలనీలు, గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు చట్టాలను పాటించాలని పోలీసులు సూచించారు.

News April 5, 2026

యువ అధికారుల పాలనలో గుంటూరు జిల్లా..!

image

గుంటూరు జిల్లాలో పాలన బాధ్యతలు యువ ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ, జేసీ ఆశుతోష్ శ్రీవాస్తవ, కమిషనర్ మయూర్ అశోక్ బాధ్యతలు చేపట్టారు. గతంలో సమన్వయం లోపంతో పురోగతి మందగించిందని భావించిన ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు సమాచారం. వీరు భూ వివాదాలు, రేషన్ అక్రమాలపై దృష్టి పెట్టనున్నారు. నగరంలో డ్రెయినేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు అవసరమని ప్రజలు ఆశిస్తున్నారు.

News April 4, 2026

18వ స్థానంలో గుంటూరు జిల్లా

image

ఫిబ్రవరి 2026కు సంబంధించిన పీహెచ్‌సీ పనితీరు ర్యాంకింగ్స్‌లో గుంటూరు జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 24 పీహెచ్‌సీలలో 1 A గ్రేడ్, 13 B, 8 C, 2 D గ్రేడ్‌లు సాధించాయి. మొత్తం 120 మార్కుల్లో 85 మార్కులు పొందింది. వెనుకబడిన ప్రాంతాల్లో సేవల మెరుగుదల అవసరం ఉన్నప్పటికీ, మొత్తం ఆరోగ్య సేవల నాణ్యత క్రమంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు.

News April 4, 2026

యువతకు పీఎం ఇంటర్న్‌షిప్‌: కలెక్టర్

image

నిరుద్యోగులకు పీఎం ఇంటర్న్‌షిప్ మంచి అవకాశమని గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. 18-25 ఏళ్ల లోపు టెన్త్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ చదివిన వారు అర్హులు. వీరికి 6-9 నెలల పాటు నెలకు రూ.9 వేల స్టైపెండ్‌, అదనంగా రూ.6 వేలు, బీమా ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు, రూ.12 లక్షలు దాటిన ఆదాయం ఉన్నవారు అనర్హులు. ఏప్రిల్ 21లోపు pminternship.mca.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి.

News April 4, 2026

యువతకు పీఎం ఇంటర్న్‌షిప్‌: కలెక్టర్

image

నిరుద్యోగులకు పీఎం ఇంటర్న్‌షిప్ మంచి అవకాశమని గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. 18-25 ఏళ్ల లోపు టెన్త్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ చదివిన వారు అర్హులు. వీరికి 6-9 నెలల పాటు నెలకు రూ.9 వేల స్టైపెండ్‌, అదనంగా రూ.6 వేలు, బీమా ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు, రూ.12 లక్షలు దాటిన ఆదాయం ఉన్నవారు అనర్హులు. ఏప్రిల్ 21లోపు pminternship.mca.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి.

News April 4, 2026

అమరావతికి కొత్త రైల్వే లైన్లు

image

హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు అమరావతి మీదుగా వెళ్లనుంది. పశ్చిమ బైపాస్, ఎన్-6 రోడ్డు గుండా దీని డ్రాఫ్ట్ సిద్ధమైంది. మరో వైపు ఎర్రుపాలెం-నంబూరు మధ్య రూ.2245 కోట్లతో 57 కి.మీ మేర కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఇందులో కృష్ణా నదిపై 3 కి.మీ వంతెన ఉంటుంది. ఈ లైన్ ద్వారా ప్రధాన నగరాలకు అమరావతి అనుసంధానం అవుతుంది. దీనికి సంబంధించి 4 నెలల్లో భూసమీకరణ పూర్తి చేయనున్నారు.

News April 3, 2026

గుంటూరు డివిజన్‌లో ఇక రెగ్యులర్‌గా ప్రత్యేక రైళ్లు

image

గుంటూరు రైల్వే డివిజన్ మీదుగా నడిచే పలు ప్రత్యేక రైళ్లకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా మార్చేందుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైళ్లు ఎప్పటి నుంచి రెగ్యులర్‌గా నడుస్తాయనే తేదీలను త్వరలో వెల్లడించనున్నారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు త్వరలో ప్రకటన చేయనున్నారు.

News April 2, 2026

గుంటూరులో మండిపోనున్న ఎండలు

image

పసిఫిక్ మహాసముద్రంలో మే నెలలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీనివల్ల 2026 వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. కోస్తా ఆంధ్రాలోని గుంటూరులో సాధారణం కంటే ఎండలు దంచికొట్టనున్నాయి. వేడి వాతావరణం మరింత పెరగనుంది. ఈ ఎల్‌నినో ప్రభావం ప్రారంభ రుతుపవనాలపై పడనుంది. అయితే అడపాదడపా ప్రీ-మాన్సూన్ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.