India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, స్కిల్ హబ్లో డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నాయి. ఈ శిక్షణ కోసం ఆసక్తిగల యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీదేవి తెలిపారు. మరిన్ని వివరాల కోసం కళాశాలలో సంప్రదించాలని కోరారు.
జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల మూల కారణాలను తెలుసుకొని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ రూపొందించిన ఐ-ఆర్ఏడీ యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాల్లో నివారణకు తీసుకున్న చర్యలపై నివేదికలు అందజేయాలన్నారు.
తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగా, రాజకీయ విశ్లేషకుడుగా రాణించిన గుత్తికొండ నరహరి ఆగస్టు 10, 1918న ఉమ్మడి గుంటూరు జిల్లా అమృతలూరు మండలం యలవర్రులో జన్మించారు. రాడికల్ రాజకీయాలలో అటు కమ్మూనిస్ట్లను, ఇటు కాంగ్రెస్ వారిని ఎదురుకొని, తన ధారాళ ఉపన్యాసాలతో జనాన్ని ఆకట్టుకున్నారు. ములుకోల, ప్రజామిత్ర, సమీక్ష పత్రికలలో వ్యాసాలు రాశారు. విహారి, ఆంధ్రా లేబరు పత్రికలకు సంపాదకత్వం వహించారు.
ముదిగొండ లింగమూర్తి (అక్టోబర్ 10, 1908-జనవరి 24,1980) గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన పాతతరం నటుడు. నాటకరంగం మీద అన్ని రకాల పాత్రలూ ధరించి, పేరుతెచ్చుకుని, సినిమా రంగంలో ప్రవేశించారు. వాహిని సంస్థ నిర్మించిన తొలి చిత్రం వందేమాతరం సినిమాతో పేరు తెచ్చుకున్నారు. క్రూరపాత్ర ధరించినా, అక్రూరపాత్ర ధరించినా, హాస్యపాత్ర ధరించినా నటనలో దేనికదే భిన్నంగా ఉండేది.
గుంటూరు మిర్చి యార్డుకు గురువారం 54,252 మిర్చి టిక్కీలు విక్రయానికి రాగా ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 53,371 అమ్మకం జరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ఇంకా యార్డులో 10,401 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు సంబంధించిన ధరలు పలు విధాలుగా నమోదయ్యాయి.
GNT SP వకుల్ జిందాల్ గురువారం SP కార్యాలయంలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలో నైపుణ్యం కలిగి, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించే సిబ్బందిని అందుబాటులో ఉంచాలని SP సూచించారు. PGRS ఫిర్యాదులను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా, శక్తి కాల్స్ వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సత్వరమే స్పందించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
నిబంధనలకు విరుద్ధంగా కరెంటు వినియోగిస్తున్న 53 కనెక్షన్లకు విద్యుత్ శాఖ అధికారులు గురువారం రూ. 4.86 లక్షల అపరాధ రుసుం విధించారు. విద్యుత్ శాఖలోని విజిలెన్స్, ఆపరేషన్స్ విభాగాలు సంయుక్తంగా గురువారం చమల్లమూడి, కాట్రపాడు, ముట్లూరు, పల్లాడు, సౌపాడు, వింజనంపాడు ప్రాంతాల్లో 1,965 సర్వీసులను తనిఖీ చేశాయి. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా కరెంటు వాడుతున్న కనెక్షన్లను గుర్తించి, వాటికి జరిమానా విధించారు.
రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. నవంబర్ 1వ తేదీ నుంచి పత్తి దిగుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎస్ గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఇ-పంటలో నమోదు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ధాన్యం, పత్తి కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
GNT జిల్లాలో ధాన్యం సేకరణపై నేడు కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో JC ఆశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను పూర్తిగా కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 50 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ధాన్యం కనీస మద్దతు ధరను సాధారణ రకం క్వింటాలుకు రూ. 2,369/గా, ‘A’ గ్రేడ్ రకం క్వింటాలుకు రూ. 2,389/గా నిర్ణయించామన్నారు.
కాలువల్లో చేపల వేటకు ఉపయోగించే వెదురు ‘చేపల మావుల’ తయారీలో తెనాలి సమీప ఆలపాడు ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపలు పట్టుకొని వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి చేపల మావులు అనగానే ముందుగా గుర్తొచ్చేది చుండూరు మండలం ఆలపాడు గ్రామమే. నాణ్యమైన మన్నికైన చేపల మావులు కోసం అనేక మంది ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసుకు వెళుతుంటారు. ఇక్కడ చాలా కుటుంబాలు వ్యవసాయ పనులతో పాటు వీటి తయారీ వృత్తిపైనే ఆధారపడ్డాయి.
Sorry, no posts matched your criteria.