Guntur

News February 5, 2025

బహిరంగంగా మద్యం సేవిస్తే చర్యలు: డీఎస్పీ

image

గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీ కృష్ణ‌ తాడేపల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి సీతానగరం, మహానాడు వరకు నడుచుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులకు డీఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

News February 4, 2025

GNT: భర్తను రెడ్ హ్యాండె‌డ్‌గా పట్టుకున్న భార్య

image

ఉమ్మగి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. కొన్ని రోజులుగా భార్య నవ్యశ్రీని విడిచిపెట్టి తప్పించుకు తిరుగుతున్న భర్త వాసు, ప్రియురాలు గాయత్రితో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో భర్త, ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. నవ్యశ్రీ బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 4, 2025

GNT: నగ్న చిత్రాల పేరుతో రూ.2.53 కోట్లు స్వాహా.. అరెస్ట్

image

అశ్లీల వీడియోల పేరుతో బెదిరించి తూ.గో జిల్లా నిడదవోలుకు చెందిన యువతి నుంచి రూ.2.53 కోట్లు కాజేసిన దేవనాయక్‌‌ను గుంటూరులో అరెస్ట్ చేసినట్లు నిడదవోలు సీఐ తిలక్ సోమవారం తెలిపారు. యువతి HYD విప్రోలో ఉద్యోగం చేస్తోంది. తన వద్ద యువతి నగ్న చిత్రాలు ఉన్నాయని వాటిని ఇంటర్నెట్‌లో పెట్టకుండా ఉండాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. నిందితుడి నుంచి రూ. 1.84 కోట్లు నగదు, ఆస్తులను సీజ్ చేశామన్నారు.

News February 4, 2025

తాడేపల్లి: నందిగం సురేశ్‌కు ధైర్యం చెప్పిన జగన్

image

విదేశీ పర్యటన ముగించుకొని మాజీ సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి సోమవారం రాత్రి చేరుకున్నారు. దీంతో ఆయనను వైసీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జగన్ నందింగం సురేశ్‌ను ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. భయపడవద్దు అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి, పేర్నినాని, వెల్లంపల్లి తదితరులు పాల్గొన్నారు.

News February 4, 2025

నులిపురుగుల నివారణ పోస్టర్లు ఆవిష్కరించిన గుంటూరు కలెక్టర్

image

ఈ నెల 10వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ సోమవారం నులిపురుగుల నిర్మూలన పోస్టర్లను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. 1 నుంచి 19సం.ల పిల్లలకు 400mg ఆల్బెండజోల్ బిళ్ళలను చప్పిరించి మింగించాలని, ఒకటి నుంచి 2 సంవత్సరాల పిల్లలకు అరమాత్ర ఇవ్వాలని సూచించారు. డీఎంహెచ్ఓ విజయలక్ష్మి, మజిదా బేగం, శ్రావణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

News February 3, 2025

నాలుగేళ్లలో అమరావతి రైల్వే లైన్ పూర్తి

image

నాలుగేళ్లలో అమరావతి రైల్వే లైన్ పూర్తి చేస్తామని విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ. పాటిల్ తెలిపారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతికి రైల్వే లైన్‌ను గతేడాది అక్టోబర్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదించినట్టు గుర్తు చేశారు. ఇప్పటికే నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అమరావతి నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై సహా పలు ప్రాంతాలతో లైన్ కలుపనుంది.

News February 3, 2025

గుంటూరు: స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపు

image

గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులూ విజయం సాధించారు. గెలిచిన అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరంటి వర ప్రసాద్(TDP), కొమ్మినేని కోటేశ్వరరావు(TDP), నూకవరపు బాలాజీ(TDP), ముప్పవరపు భారతి(TDP), షేక్ మీరావలి(TDP), దాసరి లక్ష్మి దుర్గ(జనసేన).

News February 3, 2025

GNT: SI అంటూ బెదిరించి రూ.24లక్షలు స్వాహా

image

ఎస్ఐ అంటూ బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.24 లక్షలు దోచేసిన వైనంపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. నెహ్రు నగర్‌కి చెందిన నాగేశ్వరరావుకు ఓ వ్యక్తి ఫోన్ చేసి ఎస్ఐ ప్రసాద్‌ను అని చెప్పాడు. బెంగళూరులో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశామన్నాడు. ఆ కేసుతో సంబంధాలు ఉన్నాయని నాగేశ్వరావుని బెదిరించి విడతల వారీగా రూ.24లక్షలు నకిలీ ఎస్ఐ ఖాతాలోకి జమ చేయించుకున్నాడు. 

News February 3, 2025

గుంటూరు: రైల్వేలో ఉద్యోగం.. ఈరోజే లాస్ట్

image

SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్‌ హెడ్ క్వార్టర్స్‌‌లో 31, సికింద్రాబాద్ డివిజన్‌లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌‌‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 3, 2025.

News February 3, 2025

గుంటూరు: శీలంవారి వీధిలో సప్లయర్ ఆత్మహత్య

image

కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శీలంవారి వీధిలో ఇనుప దులానికి చీరతో ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొన్నూరు రోడ్డులోని ఓ హోటల్లో సప్లయర్‌గా పనిచేస్తున్న శ్రీను(50)రెండేళ్లుగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహానికి సంబంధించిన రక్త సంబంధీకుల వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని గుంటూరు కోవిడ్ ఫైటర్స్ సహాయంతో జీజీహెచ్ మార్చూరీకి తరలించామని సీఐ వీరయ్య తెలిపారు.