India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1న ప్రముఖ ఔషధ సంస్థ లారస్ ల్యాబ్స్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు HOD దిట్టకవి రామచంద్రన్ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా ఈ క్యాంపస్ నియామకాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ, ఎం ఫార్మసీ, బీ ఫార్మసీ అర్హతలన్నారు.

గుంటూరు వైపు వెళ్లే న్యూ వెస్ట్ బైపాస్ రెండో రోడ్డును అధికారులు బుధవారం ఉదయం నుంచి ప్రారంభించారు. ట్రాఫిక్‌ను మంగళగిరి, విజయవాడ వైపుకు హైలాండ్ రోడ్ అండర్‌పాస్ ద్వారా మళ్లిస్తున్నారు. ఇక గొల్లపూడి, గన్నవరం, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లే వాహనాలను హైవే రోడ్డుకే మళ్లించే ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సౌకర్యం మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. మంగళగిరి రూరల్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

గుంటూరు జిల్లాలోని మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో వార్డులు, డివిజన్ల సంఖ్య పెరగనుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పునర్విభజన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుందని సమాచారం. వార్డుల సంఖ్య పెరిగితే ప్రజలకు మరింత చేరువగా పాలన అందుతుందని, మౌలిక వసతులు మెరుగుపడతాయని అధికారులు అంచనా, దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం తాడికొండ, ప్రత్తిపాడు, వేమూరు SC నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.

క్రేన్ వక్కపొడి సంస్థల అధినేత గ్రంధి సుబ్బారావు వ్యాపారవేత్త. వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో 1930లో ఆయన జన్మించారు. కేవలం 100 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. 1952లో ‘క్రేన్’ సంస్థను స్థాపించి, దానిని వందల కోట్ల స్థాయికి చేర్చారు. వ్యాపారంతో పాటు ఎన్నో సామాజిక సేవలు కూడా చేశారు. అనేక దేవాలయాలు, అన్నదాన సత్రాలను నిర్మించారు. గుంటూరులో అయ్యప్ప ఆలయం కట్టించి వేలాది మందికి అన్నదానం చేశారు.

రాష్ట్రంలో వంటగ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సీఎంతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సరఫరా అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇండక్షన్ స్టవ్స్, పైప్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పంటనష్టం అంచనాలు 26లోగా పూర్తి చేసి 31లోగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.

ప్రపంచ నీటి దినోత్సవం పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జల వనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. భావితరాలకు శుద్ధ జలాలను అందించడం, కాలుష్యం లేని పర్యావరణం, మంచి వాతావరణం అందించడం అవసరం అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ MD నజీనా బేగం తదితరులు పాల్గొన్నారు.

అమెరికాలోని డల్లాస్ సమీపంలో గుంటూరు పేరుతో గ్రామం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. అక్కడ అధికారికంగా అలాంటి గ్రామమేదీ లేదు. అయితే ఆ ప్రాంతంలో గుంటూరు జిల్లా వాసులు అధికంగా నివసిస్తుండటంతో సరదాగా అలా పిలుచుకుంటున్నారు. కేవలం అనధికారిక నామకరణమే వైరల్ కావడంతో నెటిజన్లు క్లారిటీ ఇస్తున్నారు.
Sorry, no posts matched your criteria.