India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీఈడీ ప్రాక్టికల్ పరీక్షలు ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా పారదర్శకంగా, పటిష్ఠంగా నిర్వహించామని కోఆర్డినేటర్ సుబ్బారావు గురువారం తెలిపారు. అసత్య కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థుల నుంచి డబ్బులు వసూలుపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. దళారులు బెదిరించినట్లుగా కళాశాలల నుంచి ఫిర్యాదు రాలేదన్నారు. మార్కుల వేయటం ఎగ్జామినర్ల ఇష్టం అన్నారు.

అమరావతిలో ఈ నెల 23న పైపులకు నిప్పు పెట్టిన ఘటనలో వాచ్‌మెన్ తిప్పెగుడిసె రామును పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో అతణ్ని SIT బృందం రెండు గంటలకుపైగా విచారించింది. ఎస్పీ వకుల్ జిందాల్ కూడా విచారణను పరిశీలించారు. ఘటనా స్థలానికి రామును తీసుకెళ్లి సీన్ రీక్రియేట్ చేశారు. అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం ఇప్పటికే SIT ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది.

మార్చి 27 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉండనుందన్నారు. దక్షిణ, మధ్య కోస్తాతో పాటు రాయలసీమలోనూ ఎండలు దంచికొడతాయి. ఉత్తరాంధ్రలో ఉక్కపోత తప్పదు. గుంటూరులో రానున్న 4 రోజులు వేడిగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.

రాష్ట్రంలో పైప్డ్ గ్యాస్ (PNG) వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖ నగరాల్లో ఈ విధానాన్ని విస్తరిస్తామని, దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే కనెక్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. PNG వాడే వారికి కూడా ‘దీపం’ పథకం కింద రూ. 2,400 సబ్సిడీ వర్తిస్తుందని ప్రకటించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని, వదంతులు నమ్మవొద్దని ఆయన స్పష్టం చేశారు.

యువత ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగులకు దూరంగా ఉండాలని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. జూదం వల్ల ఆర్థిక నష్టాలతో పాటు కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత తమ విలువైన సమయాన్ని విద్య, ఉపాధి లక్ష్యాల కోసం కేటాయించాలని పిలుపునిచ్చారు. ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని, నిందితులపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు.

రాజధాని అమరావతిని రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే ప్రాజెక్టులో కీలక అడుగు పడింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మార్గంలో కృష్ణా నదిపై 5.3 కి.మీ. మేర భారీ రైల్వే వంతెన నిర్మించనున్నారు. రూ. 565.83 కోట్లతో చేపట్టే ఈ వంతెన నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే టెండర్లు ఆహ్వానించింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును 33 నెలల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

గుంటూరు, ఫిరంగిపురంలోని ఈవీఎం గోడౌన్‌లను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గురువారం తనిఖీ చేశారు. గోడౌన్లలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులను, గార్డ్ రూమ్‌ల పరిస్థితి, సీసీటీవీ పనితీరు, ఇన్వర్టర్ స్థితి క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 59.36 శాతం పూర్తి అయిందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలీ, తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు కలెక్టర్‌గా కొనసాగుతున్న తమీమ్ అన్సారియాను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌గా నియమించే అవకాశముందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2015 బ్యాచ్ అధికారిణిగా శ్రీకాకుళం, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమె పరిపాలనలో మంచి గుర్తింపు పొందారు. సామాజిక సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించారు. అయితే ఈ నియామకంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని అన్నారు. జిల్లా అధికారులతో మాట్లాడిన ఆయన, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో నెల్లూరు జిల్లా వాసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన ముగ్గురు వ్యక్తులకు హన్మకొండ న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. లక్ష్మణరావు(పేరేచర్ల) చైతన్య కుమార్ (పిడుగురాళ్ల), సైదులు(కారంపూడి) ముగ్గురు స్నేహితులు. వీరంతా ఆల్ప్రాజోలం మాత్రలతో కేజీ పొడిని తయారు చేసి న్యూఇయర్ వేడుకల్లో విక్రయించేందుకు 2023లో హైదరాబాద్ బయల్దేరగా అప్పట్లో హన్మకొండ పోలీసులు వారిని పట్టుకున్నారు. ఆ కేసుకు సంబంధించి తీర్పు వెలువడింది.
Sorry, no posts matched your criteria.