Guntur

News March 25, 2026

ఉండవల్లి: మంత్రి లోకేశ్‌ను కలిసిన ఏపీ ఎన్జీవో నేతలు

image

ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్‌ను ఏపీ జేఏసీ ఛైర్మన్, ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ బుధవారం కలిశారు. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకులాల ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం పట్ల మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రుల బృందం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జేఏసీ నేతలు స్వాగతించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు.

News March 25, 2026

వెలగపూడి: వ్యవసాయంపై సింగపూర్‌తో మంత్రి అచ్చెన్న చర్చలు

image

వ్యవసాయ రంగంపై సింగపూర్ ప్రతినిధులతో మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆహార భద్రత, సరఫరా వ్యవస్థలు, ఎగుమతులపై ప్రధానంగా చర్చించారు. సింగపూర్ అమలు చేస్తున్న డేటా ఆధారిత పాలసీలు, కోల్డ్ స్టోరేజ్ విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో మత్స్య, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. ఈ చర్చలతో వ్యవసాయంలో సాంకేతిక సహకారం మరింత పెరుగుతుందన్నారు.

News March 25, 2026

సింగపూర్ బృందంతో మంత్రి నాదెండ్ల భేటీ

image

అమరావతి సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌తో సింగపూర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధిని మంత్రి వారికి వివరించారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై ఇరువర్గాలు చర్చించాయి. భేటీలో సివిల్ సప్లైస్ డైరెక్టర్ నుపూర్, సింగపూర్ అధికారులు పాల్గొన్నారు. ఈ చర్చలతో రాష్ట్ర అభివృద్ధికి అంతర్జాతీయ సహకారం మరింత పెరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

News March 25, 2026

GNT: చంద్రబాబుకు స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ, కమిషనర్

image

సీఎం చంద్రబాబును కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, జీఎంసీ కమిషనర్ మయూర్ మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు నగరంలో జరిగిన ఎమ్మెల్యే ధూళ్ళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి బుధవారం చంద్రబాబు విచ్చేశారు. ఈ క్రమంలో కలెక్టర్, ఎస్పీ, కమిషనర్ పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

News March 25, 2026

GNT: రేపు పోలీస్ కండెమినేషన్ వస్తువుల బహిరంగ వేలం

image

గుంటూరు (D) పోలీస్ శాఖకు చెందిన పాత వస్తువుల బహిరంగ వేలం మార్చి 26న నిర్వహించనున్నారు. SP వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం 4 గ. RI స్టోర్‌లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పాత టెంట్లు, కుర్చీలు, సమియానాలు, ప్లాస్టిక్ డ్రమ్ములు, ఫ్యాన్లు, టార్చ్‌లైట్లు, వివిధ రకాల వస్తువులను వేలం వేయనున్నారు. ఆసక్తి గల వారు ఈ వేలంలో పాల్గొని వస్తువులను కొనుగోలు చేయవచ్చని చెప్పారు.

News March 25, 2026

GNT: ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, నారా లోకేశ్

image

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేశ్ ఇరువురు మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరులో బుధవారం జరిగిన ఎమ్మెల్యే నరేంద్ర కుమార్తె వివాహ వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి, లోకేశ్ ఆత్మీయ ఆలింగనం చేసుకొని కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం నూతన వధూవరులను వారిద్దరూ ఆశీర్వదించారు.

ANUలో ఏప్రిల్ 1న క్యాంపస్ డ్రైవ్

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1న ప్రముఖ ఔషధ సంస్థ లారస్ ల్యాబ్స్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు HOD దిట్టకవి రామచంద్రన్ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా ఈ క్యాంపస్ నియామకాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ, ఎం ఫార్మసీ, బీ ఫార్మసీ అర్హతలన్నారు.