Guntur

News March 23, 2026

గుంటూరులో ‘నాబార్డ్’ సంఘాల మేళా

image

గుంటూరు అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో ‘నాబార్డ్ స్వయం సహాయక సంఘాల మేళా-2026’ జరగనుంది. ఈ మేళాను నేటి నుంచి 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వాహకులు రమణయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు. నగర ప్రజలు ఈ మేళాను సందర్శించి, మహిళా సంఘాల ఉత్పత్తులను ఆదరించాలని ఆయన కోరారు.

News March 23, 2026

గుంటూరులో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి

image

గుంటూరులో ప్రముఖ సామాజిక సంస్కర్త, శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను శంకరన్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వెంకటరెడ్డి వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

News March 23, 2026

గుంటూరులో పబ్లిక్ సర్వే గణాంకాలపై అనుమానాలు

image

గుంటూరు జిల్లాలో పబ్లిక్ పర్సెప్షన్ సర్వే గణాంకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విభాగాలు చూపిస్తున్న సంఖ్యలు క్షేత్రస్థాయిలో సరిపోవడం లేదని అధికారులు గుర్తించారు. మార్గదర్శకుల సంఖ్య, రైతు సేవలు వంటి అంశాల్లో వాస్తవ పురోగతి తక్కువగా ఉందని తేలింది. కొన్ని పథకాల అమలు గణాంకాలు అతిశయంగా చూపించినట్లు వెల్లడైంది. రైతుల ఫిర్యాదుల నమోదు కూడా తక్కువగా ఉండటం గమనార్హం.

News March 23, 2026

GNT: ఇంటర్ విద్యలో కొత్త మార్పులు.. ఏప్రిల్ నుంచే అమలు

image

గుంటూరులో ఇంటర్ విద్యలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త విద్యా సంవత్సరంలో ఇవి అమల్లోకి రానున్నాయి. ద్వితీయ సంవత్సరం తరగతులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలంటూ బోర్డు ఆదేశించింది. అకడమిక్ క్యాలెండర్‌లో 232 పని దినాలు, 82 సెలవులు ఉండనున్నాయి. గతేడాది అమలు చేసిన కొత్త సిలబస్ కొనసాగించనున్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెంచడం, పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం లక్ష్యంగా మార్పులు తీసుకొచ్చారు.

News March 23, 2026

GNT: ఇంటర్ విద్యలో కొత్త మార్పులు.. ఏప్రిల్ నుంచే అమలు

image

గుంటూరులో ఇంటర్ విద్యలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త విద్యా సంవత్సరంలో ఇవి అమల్లోకి రానున్నాయి. ద్వితీయ సంవత్సరం తరగతులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలంటూ బోర్డు ఆదేశించింది. అకడమిక్ క్యాలెండర్‌లో 232 పని దినాలు, 82 సెలవులు ఉండనున్నాయి. గతేడాది అమలు చేసిన కొత్త సిలబస్ కొనసాగించనున్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెంచడం, పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం లక్ష్యంగా మార్పులు తీసుకొచ్చారు.

News March 23, 2026

గుంటూరు రైల్వే డబ్లింగ్ పనులు త్వరలో ప్రారంభం

image

బీబీనగర్-గుంటూరు రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులో కీలక పనులు ప్రారంభం కానున్నాయి. నల్లపాడు-బెల్లంకొండ మధ్య నిర్మాణం త్వరలో మొదలవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ పనులు ఈపీసీ విధానంలో చేపడతారు. ఏప్రిల్ 16న టెండర్లు తెరిచి ఏజెన్సీ ఎంపిక చేయనున్నారు. మొత్తం రూ. 724 కోట్లతో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. పనులు పూర్తికి సుమారు 30 నెలలు పడనున్నాయి. 2029 నాటికి ఈ మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

News March 23, 2026

GNT: పదోతరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

గుంటూరు హిందూ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును ఆమె గమనించారు. పరీక్షా కేంద్రంలో కనీస అవసరాలైన తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి బస్ సౌకర్యం, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

News March 22, 2026

ఆన్‌లైన్‌లోనూ అర్జీల నమోదు: కలెక్టర్

image

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం PGRS, రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమాలు జరుగుతాయని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్‌లో సమర్పించిన అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు తమ సమస్యలను మీకోసం వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చన్నారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News March 22, 2026

తెనాలిలో అష్ట దిగ్గజాలకు ‘కీర్తి కిరీటం’ పురస్కారాలు

image

తెనాలిలోని రత్నా కళ్యాణ మండపంలో ఈ నెల 31న ‘మా-ఏపీ’ ఆధ్వర్యంలో ‘అష్ట దిగ్గజాలకు కీర్తి కిరీటం’ పేరిట ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమ వివరాలను దర్శకుడు దిలీప్ రాజ వెల్లడించారు. కలెక్టర్ అన్సారియా ముఖ్య అతిథిగా విచ్చేసి SP వకుల్ జిందాల్, కత్తెర సురేశ్ కుమార్, కుర్ర శ్రీను, డాక్టర్ శారద, వజ్రాల రామలింగాచారి సహా పలువురు ప్రముఖులకు పురస్కారాలను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News March 22, 2026

గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే!

image

గుంటూరులో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ. 320, విత్ స్కిన్ రూ. 300కి విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 960 వద్ద స్థిరంగా ఉంది. చేపలలో కొరమేను రూ. 430, రాగండి రూ. 180, బొచ్చెలు రూ. 230. చికెన్ ధరలు పెరగడంతో చేపలను కొనుగోలు చేయడానికి నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి..