India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరు కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి పింఛన్ పంపిణీ సిబ్బందికి ముఖ్య సూచనలు చేశారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన పంపిణీలో కొన్ని లోపాలు తేలినట్లు పేర్కొంటూ, వృద్ధులను గౌరవంతో చూడాలని, కులమతాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ నగదు ఇవ్వాలని ఆదేశించారు. అవినీతి, అమర్యాదలకు తావులేకుండా విధులు నిర్వహించాలని హెచ్చరించారు.

గుంటూరు ఖ్యాతిని చాటుతూ నలుగురు చిన్నారులు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్నారు. బోరుపాలెంకు చెందిన సంవేద్ కేవలం 50 సెకన్లలో అత్యంత వేగంగా సరళి స్వరాలు ఆలపించి అబ్బురపరిచాడు. తుళ్లూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు ఆధ్య, ఆరాధ్య పియానో విన్యాసంతో మెస్మరైజ్ చేయగా, తెనాలికి చెందిన అభిషేక్ తన మ్యూజిక్ టాలెంట్‌తో గిన్నిస్ ఘనత సాధించాడు. విజయవాడలో శుక్రవారం వీరికి ఆ రికార్డుల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

ఏఈపీఎస్ పద్ధతిలో నకిలీ వేలిముద్రలతో నగదు దోచుకునే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. మోసాల నుంచి రక్షణ కోసం ఎంఆధార్ యాప్ ద్వారా బయోమెట్రిక్ లాక్ చేయాలన్నారు. అవసరమైనప్పుడు మాత్రమే అన్‌లాక్ చేసి, వెంటనే మళ్లీ లాక్ చేయాలని, ఇటీవలి కాలంలో వేలిముద్రలు వినియోగించిన చోట్ల డీలింక్ చేయాలన్నారు. మోసానికి గురైతే 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.

గుంటూరు జిల్లాలో పాకిస్థాన్ వీసాలతో ఉన్న పౌరులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. ఆ విధంగా వెళ్లకుండా ఎవరైనా అక్రమంగా నివసిస్తుంటే అటువంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. అటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చిన వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఉన్న పాత వాహనాల పరికరాలను శనివారం సాయంత్రం 4 గంటల నుంచి వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వాడిన పరికరాలు వేలంలో ఉంచుతున్నామన్నారు.

అమరావతి రాజధాని ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలని అమరావతి ప్రాంత ప్రజలు కోరుతున్నారు. పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఎంతోమంది కార్మికులతో పాటు గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని, వారి కదలికలపై ఇంటిలిజెన్స్, పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పక్కనే ఉన్న విజయవాడలో ఉగ్ర కదలికలపై కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

అమరావతి రాజధాని ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలని అమరావతి ప్రాంత ప్రజలు కోరుతున్నారు. పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఎంతోమంది కార్మికులతో పాటు గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని, వారి కదలికలపై ఇంటిలిజెన్స్, పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పక్కనే ఉన్న విజయవాడలో ఉగ్ర కదలికలపై కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

రాజధాని ప్రాంతంలో శనివారం CPM సీనియర్ నేత బాబురావు ఆయన బృందంతో పర్యటించనున్నారు. అమరావతి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూములను పరిశీలించి ఎంత మేరకు నిర్మాణాలు జరిగాయని మీడియాతో మాట్లాడనున్నట్లు CPM నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా మే నెల 2వ తేదీన అమరావతిలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో CPM ఈ పర్యటన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 28వ తేదీన రాజధాని ప్రాంతంలోని వృత్తి యూనివర్సిటీకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి శుక్రవారం పరిశీలించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు VIT విశ్వవిద్యాలయంలో ప్రారంభోత్సవం చేయనున్న మహాత్మా గాంధీ బ్లాక్‌ను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తేజ, తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మే 2న రాజధాని అమరావతికి రానున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను శుక్రవారం పలువురు అధికారులు పరిశీలించారు. పార్కింగ్, వీఐపీ పార్కింగ్ వద్ద బారీకేట్స్, హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జి.సతీశ్ కుమార్, సెక్రెటరీ బీసీ వెల్ఫేర్ మల్లిఖార్జున, ఎండీ మెప్మా తేజ్ భరత్, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, ఎస్పీ సతీశ్ కుమార్, తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.