India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ పరీక్షా పత్రం లీకేజి అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోందని మంత్రి లోకేశ్ చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 2.గంటలకు జరగాల్సిన ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఛైల్డ్ డెవలప్మెంట్ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం నిర్ణీత సమయానికి ముందే లీక్ కావడంపై విచారణ నిర్వహించాల్సిందిగా ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. ప్రజలు గుంటూరు నుంచి చిలకలూరిపేట, బాపట్ల, విజయవాడ ప్రాంతాలకు ప్రయాణాలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు ఆ ప్రాంతాలకు వెళ్లాలంటే మహిళలు టికెట్ కొనాల్సి ఉంటుంది. ఇలా జిల్లా బార్డర్లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్‌కి రాష్ట్ర హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనిల్ తల్లి ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అనిల్‌కి ఈ నెల 10 వరకు బెయిల్ దక్కింది. 11వ తేదీన తిరిగి అనిల్ జైలుకు వస్తారని జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజకుమార్ తెలిపారు.
32 ఏళ్ల క్రితం ఇదే రోజున పల్నాడులో 23 మందిని చంపేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. వివరాల్లోకెళ్తే.. 1993 మార్చి 7న HYD-CH.పేట వస్తున్న బస్సులో నరసరావుపేట రైల్వే క్రాసింగ్ వద్ద చలపతిరావు, విజయవర్ధన్‌రావు అనే ఇద్దరు ఎక్కారు. ప్రయాణికులను బెదిరించి నగదు దోచుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది పారిపోయేందుకు ప్రయత్నించగా బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు.
భూ యజమానుల సమక్షంలో రీ సర్వే సక్రమంగా చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం, సిరిపురం గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలను, మందపాడు గ్రామంలో పంట పొలాల రీ సర్వేను, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి నిర్వహిస్తున్న సర్వేలను ఫీల్డ్కి వెళ్లి పరిశీలించారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీనివాసు పాల్గొన్నారు.
శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పనులకు సంబంధించిన ల్యాండ్ అక్విజెషన్ పనులు టైమ్ లైన్ ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులకు సంబంధించిన స్టేక్ హోల్డర్లతో గురువారం కలక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఆర్.అండ్.బి ఎస్.ఈ శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ.. నిర్మాణానికి సంబంధించి టెండర్‌ను శుక్రవారం నాడు విడుదల చేయడం జరుగుతుందన్నారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్టీయూసీ క్యాలెండర్, డైరీ 2025ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి, వైఎస్సార్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ వై.శ్రీనివాస్, విశాఖ జిల్లా అధ్యక్షుడు అనీల్‌కుమార్, రాజారెడ్డి ఉన్నారు.
తెనాలి రైల్వేస్టేషన్లో బుధవారం సుమారు 60 ఏళ్ల మహిళ ప్లాట్ఫారం చివర పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొట్టడంతో మరణించింది. ఆమె వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు భావిస్తున్నారు. మరో ఘటనలో తిరుమల ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సుమారు 50ఏళ్ల వ్యక్తి తెనాలి శివారు యడ్ల లింగయ్య కాలనీ రైల్వే గేటు సమీపంలో రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. జీఆర్పీ పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సూచించారు. బుధవారం మంత్రి సంధ్యారాణి మహిళా దినోత్సవ వేడుకలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించిన అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మహిళా రక్షణ, అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాల వివరాలను స్టాల్స్ రూపంలో అన్ని శాఖల వారు ఏర్పాటు చేయాలన్నారు.
గుంటూరు గుడారాల పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు గుంటూరు డివిజన్ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యే గుడారాల పండుగకు ఈనెల 5వ తేదీన ప్రత్యేక రైళ్లు గుంతకల్, రేణిగుంట, విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు చేరుకుంటాయి. తిరిగి 9న బయలు దేరుతుయని రైల్వే అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.