India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి గుంటూరు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, తోటపల్లి ఎత్తిపోతల పథకం కాలువ పనులు, యువతకు ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.
ప్రత్తిపాడులోని ఓ పేకాట శిబిరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. CI శ్రీనివాసరావు వివరాల మేరకు.. రాబడిన సమాచారం మేరకు పేకాట స్థావరాలపై దాడి చేసి 38మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.96,300 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ANU దూరవిద్య కేంద్రంలో MBA, MCA కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 9 నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కో ఆర్డినేటర్ రామచంద్రన్ ఆదివారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 201 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 188 మంది పరీక్షకు హాజరయ్యారని, 184 మంది అర్హత సాధించారని చెప్పారు. అర్హత సాధించిన వారికి ఈ నెల 15లోగా ప్రవేశాలు కల్పిస్తామని అన్నారు.
ఐదేళ్లపాటు శాంతిభద్రతలను రౌడీ మూకల చేతుల్లో పెట్టిన ఫ్యాక్షన్ నాయకుడు జగన్ అని వినుకొండ MLA జీవీ ఆంజనేయులు ఆరోపించారు. కేసులు, అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి జగన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడన్నారు. సోషల్ మీడియాలో ఉన్మాదం, విషం నింపి ఒక తరం భవిష్యత్తునే జగన్ నాశనం చేశారని దుయ్యబట్టారు. తల్లి, చెల్లిపై కూడా తప్పుడు పోస్టులు పెట్టించిన ఘనుడు జగన్ అని తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశారు.
➤ చెన్నంశెట్టి రమేశ్ (SA లెక్కలు, మామిళ్లపల్లి, MPUPS) ➤ పి.మృత్యం జయరావు (SGT. కొల్లిపర MPPS) ➤ గోనేళ్ళ శేష వరలక్ష్మి (SA. ఇంగ్లీష్, ఈపూరు పాలెం ZPHS) ➤ పవని భాను చంద్ర మూర్తి (SA. భౌతిక శాస్త్రం, పేరాల చీరాల మండలం) ➤ కర్పూరపు బిజిలి కుమార్ (SGT. బలుసుపాలెం చెరుకుపల్లి మండలం) ➤ కె. వెంకట శ్రీనివాసరావు (HM. గ్రేడ్ – 2 చక్రాయ పాలెం అద్దంకి(M)
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం గుంటూరుకు రానున్నారు. నగరంలోని అరణ్య భవన్లో ఉదయం 11 గంటలకు అటవీ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొని అటవీ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు డిప్యూటీ సీఎం రాక కోసం ఏర్పాట్లు చేపట్టారు. తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ గుంటూరు నగరానికి రానున్నారు.
బోరుగడ్డ అనిల్‌కి అరండల్‌పేట స్టేషన్‌లో రాచమర్యాదలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఐ కె.శ్రీనివాసరావును వీఆర్‌కు పంపుతూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ సిబ్బంది నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో క్రమ శిక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని త్రిపాఠి హెచ్చరించారు.
విజయవాడలోని ఓ హాస్పిటల్లో ఆపరేషన్ సమయంలో ఓ పేషెంట్‌కు రక్తం తక్కువగా ఉండటంతో 0+ బ్లడ్ కావాలని డాక్టర్ సూచించారు. కుటుంబసభ్యులు వెంటనే పొన్నూరుకు చెందిన ‘పొన్నూరు బ్లడ్వెల్ఫేర్ అసోసియేషన్’ సంస్థను సంప్రదించారు. దీంతో సంస్థ సభ్యుడు శ్రీనివాస్ స్పందించి 5వ సారి రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో ఆదుకున్న శ్రీనివాసుకు పేషంట్ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు-2024లో నిర్వహించిన బీఈడీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను పక్కదారి పట్టించడానికి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని మాజీమంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని పార్టీ నాయకులతో కలిసి శనివారం ఎస్పీకి అంబటి వినతిపత్రాన్ని సమర్పించారు. పోలీసులకు ఇదే ధర్మమైతే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.