India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘X’ వేదికగా పోస్టు చేశారు. మహోజ్వల చరిత్ర గల మన దేశ సమగ్రతను కాపాడటం అందరి కర్తవ్యం అని, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు వరుసగా మూడో సంవత్సరం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.
దేశభక్తిని సమైక్యతను చాటి చెప్పెలా ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండా ఎగరవేయాలని కలెక్టర్ అరుణ్ బాబు కోరారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన కలెక్టరేట్‌లో మాట్లాడుతూ ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామంలోని పాఠశాలలో జాతీయ సమైక్యతపై పోటీలు నిర్వహించాలన్నారు. అనంతరం ప్రతి మండల కేంద్రం, జిల్లాలోనున్న ఇంజినీరింగ్ కళాశాలలో హర్ ఘర్ తిరంగా నిర్వహించాలన్నారు. సెల్ఫీ తీసుకున్న ఫోటోలు వెబ్సైట్‌సైట్‌లో అప్లోడ్ చేయాలన్నారు.
గుంటూరు నగర కమిషనర్‌గా భాద్యతలు తీసుకున్న పులి శ్రీనివాసులు బుధవారం కలెక్టర్ నాగలక్ష్మీను కలిశారు. ఈ మేరకు కమిషనర్ పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు విషయాలపై చర్చించారు. నగరంలో ప్రజా సమస్యలపై నాణ్యమైన శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని కమిషనర్‌కు కలెక్టర్ సూచించారు.
ర్యాగింగ్‌కు పాల్పడితే కళాశాల నుంచి సస్పెన్షన్‌తో పాటు తొలగింపుకు గురి అవుతారని ఎస్పీ సతీశ్ హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ఆయన తుళ్లూరు మండల పరిధిలోని ఓ యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత తరం విద్యార్థులు సరైన విషయాల కోసం సమయాన్ని వెచ్చిస్తే మరింత సామర్థ్యం కలిగి ఉంటారని, నైపుణ్యాలను మెరుగైన రీతిలో ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు చంద్రబాబు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ శాఖ, ఆర్టీజీ శాఖపై సమీక్ష చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం యధావిధిగా పోలీసులు సచివాలయం పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు.. బాంబ్ స్క్వార్డ్ తనిఖీలు చేసింది.
చెల్లని చెక్కు కేసులో ఓ వైద్యురాలికి 6 నెలల జైలు శిక్ష విధించారు. ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ పద్మజ, మంగళగిరికి చెందిన కుమార్ వద్ద రూ.10లక్షల అప్పు తీసుకొని 2019లో రూ.6లక్షలు చెక్కు ఇవ్వగా, నగదు లేక ఆ చెక్కు చెల్లలేదు. కుమార్ చెక్కు బౌన్స్ కేసు వేయగా న్యాయమూర్తి సురేశ్ బాబు వైద్యురాలికి 6 నెలలు జైలు శిక్ష, రూ.6లక్షలు చెల్లించాలని తీర్పు వెల్లడించారు.
రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లకు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ రూ.1 కోటి విరాళం అందించింది. గుంటూరుకు చెందిన ఎస్.ఎల్.వీ డెవలపర్స్ అధినేత పి.శ్రీనివాసరాజు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి రూ.1 కోటి చెక్కును అందించారు. రాబోయే ఐదేళ్ల పాటు అన్న క్యాంటీన్‌కు కోటి రూపాయల చొప్పున విరాళం అందిస్తానని శ్రీనివాసరాజు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖపై మంగళవారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇంటికి వచ్చిన ఓ అల్లుడికి అత్తాగారి కుటుంబం ఘన స్వాగతం పలికింది. అన్ని రకాల వంటలు చూసిన ఆ అల్లుడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆషాఢమాసం వెళ్లి శ్రావణమాసం రావడంతో నూతన వధూవరులు అత్తగారి ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో అల్లుడికి స్వాగతం పలుకుతూ భారీ వంటలతో విందు పెట్టారు. వినుకొండలోని కొత్తపేట స్టేట్ బ్యాంకు లైన్‌లో నివాసం ఉన్న తాతా రమేశ్ అల్లుడు రాకతో 250 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.
ఇంటికి వచ్చిన ఓ అల్లుడికి అత్తాగారి కుటుంబం ఘన స్వాగతం పలికింది. అన్ని రకాల వంటలు చూసిన ఆ అల్లుడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆషాఢమాసం వెళ్లి శ్రావణమాసం రావడంతో నూతన వధూవరులు అత్తగారి ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో అల్లుడికి స్వాగతం పలుకుతూ భారీ వంటలతో విందు పెట్టారు. వినుకొండలోని కొత్తపేట స్టేట్ బ్యాంకు లైన్‌లో నివాసం ఉన్న తాతా రమేశ్ అల్లుడు రాకతో 250 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.
Sorry, no posts matched your criteria.