Guntur

News March 11, 2026

పెదకాకాని మర్డర్ కేసు ఛేదించిన GRP పోలీసులు

image

పెదకాకాని రైల్వే స్టేషన్‌లో మార్చి 4న జరిగిన హత్య కేసును గుంటూరు GRP పోలీసులు, RPF సిబ్బంది ఛేదించారు. మృతుడు పరమడం అనీశ్ బ్లేడ్‌గా గుర్తించారు. దొంగతనాల వాటా విషయంలో జరిగిన వివాదంతో అతని సహచరులే హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఎఫ్. కుమార్ ఎంతోని కుమార్, దీపేశ్ MS మెంటల్, కొప్పుల వెంకటేశ్ వెంగీలను మార్చి 9న గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

News March 11, 2026

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం

image

గుంటూరు జిల్లాలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. గత నెలలో ఉమ్మడి జిల్లాలో 17.5 మిలియన్ యూనిట్లు వినియోగించగా ప్రస్తుతం 20.1 మిలియన్ యూనిట్లకు పెరిగింది. గుంటూరు సర్కిల్ పరిధిలో గత నెలలో 7.3 మిలియన్ యూనిట్లు ఉండగా ఇప్పుడు 8.5 మిలియన్ యూనిట్లకు డిమాండ్ చేరింది. వేసవి వేడి కారణంగా ఎసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరగడం దీనికి కారణమని అధికారులు తెలిపారు. విద్యుత్‌ను పొదుపుగా వాడాలన్నారు.

News March 11, 2026

కలెక్టర్ల సదస్సులో గుంటూరు ప్రతిపాదనలు

image

అమరావతి సచివాలయంలో బుధ, గురువారాల్లో కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఈసారి గుంటూరు జిల్లా నుంచి ప్రత్యేక ప్రజంటేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా విద్యార్థుల కోసం కొత్త ప్రతిపాదనలు రూపొందించారు. 9వ తరగతి నుంచే 10వ తరగతి సిలబస్ బోధన ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఉదయం ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులకు భోజనం కూడా అందించాలనే ప్రణాళిక ఉంది.

News March 10, 2026

గుంటూరు: మరి కాసేపట్లో ముగియనున్న గడువు

image

గుంటూరు జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణకు మరికొన్ని గంటలే మిగిలాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయిస్తున్నారు. అర్హులైన తల్లిదండ్రులు మంగళవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వార్షిక ఆదాయం రూ.1.44 లక్షల్లోపు ఉండాలి. ఎంపిక కోసం లాటరీ విధానం అమలు చేస్తారు. ఎంపికైన వారు మార్చి 26 నుంచి ఏప్రిల్ 7 వరకు ప్రవేశాలను నిర్ధారించాలి.

News March 10, 2026

గుంటూరు ‘పుర’ అధికారుల నియామకం

image

గుంటూరు జిల్లాలో పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో GMCకు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా, తెనాలికి గుంటూరు JC అశుతోష్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. మార్చి 17న ప్రస్తుత పాలకవర్గం బాధ్యతల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో కొత్త పాలకవర్గం కొలువు తీరే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది.

News March 10, 2026

వేసవి కార్యాచరణకు సిద్ధం: GNT కలెక్టర్

image

రానున్న వేసవి దృష్ట్యా ముందస్తు చర్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుంటూరు జిల్లాలో వేసవి కార్యాచరణకు తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఈ సందర్భంగా తెలిపారు. తాగునీటి సరఫరా, వైద్యం, అగ్నిమాపక సేవలపై రెవెన్యూ, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు వివరించారు.

News March 10, 2026

ఉండవల్లి: ప్రమాదంలో వృద్ధురాలు స్పాట్‌డెడ్

image

తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి సాయిబాబా గుడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన నల్లమట్టి టిప్పర్ ఢీకొనడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. అనుమతులు లేకుండా, అతివేగంతో మట్టి లారీలు తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News March 10, 2026

అమరావతిలో డబుల్ ట్రీ హిల్టన్ హోటల్‌కు భూమిపూజ

image

అమరావతి ప్రాంతంలోని మందడంలో 200 గదులతో ఫైవ్ స్టార్ డబుల్ ట్రీ (హిల్టన్) హోటల్, 10,000 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ జరిగింది. రూ.330 కోట్ల పెట్టుబడితో 4 ఎకరాల్లో హోటల్, 2.5 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నారు. కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ కె. కన్నబాబు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News March 10, 2026

తెనాలి: YCP సోషల్ మీడియా కన్వీనర్‌కు రిమాండ్

image

సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెడుతున్న అనంతపురం జిల్లాకు చెందిన YCP సోషల్ మీడియా కన్వీనర్ అశోక్‌ను తెనాలి రూరల్ పోలీసులు సోమవారం రాత్రి కోర్టులో హాజరపరిచారు. అంగలకుదురుకు చెందిన ITDP నాయకురాలు జెట్టి రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు అరెస్ట్ చేశామని, అతడికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ నాయబ్ రసూల్ చెప్పారు. నిందితుడిని గుంటూరు జిల్లా జైలుకు తరలించినట్లు తెలిపారు.

News March 9, 2026

ప్రజా సమస్యలపై 112 ఫిర్యాదులు స్వీకరించిన గుంటూరు ఎస్పీ

image

గుంటూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ వకుల్ జిందాల్ 112 ఫిర్యాదులను స్వీకరించారు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు, ఆర్థిక సమస్యలకు సంబంధించిన అర్జీలను పరిశీలించి సంబంధిత పోలీస్ స్టేషన్లకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను చట్టపరంగా వేగంగా పరిష్కరిస్తామని ఎస్పీ తెలిపారు.