Guntur

News March 6, 2026

గుంటూరు: ఈ నెల 13 నుంచి HPV వ్యాక్సినేషన్

image

గుంటూరు జిల్లాలో 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సినేషన్‌ను మార్చి 13 నుంచి ప్రారంభించనున్నట్లు DMHO విజయలక్ష్మి తెలిపారు. జిల్లాలో 14,167 మంది అర్హులను గుర్తించామని, PHCలు, CHCలు, GGHలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు. 90 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో బాలికలందరికీ టీకా వేయించాలని ఆమె కోరారు.

News March 6, 2026

పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం: GNT కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు RAMP ద్వారా నైపుణ్యాభివృద్ధి వర్క్‌షాప్‌లు నిర్వహించాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో ద్వారా వచ్చే దరఖాస్తులకు నిర్ణీత గడువు (SLA) లోపే అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు.

News March 6, 2026

GNT: ‘రైతుల యోగక్షేమాలు చూడనప్పుడు భూసేకరణ ఎందుకు ?’

image

ల్యాండ్ పూలింగ్ 2వ దశకు వ్యతిరేకంగా శుక్రవారం బ్రాడీపేట UTF కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం అన్నీ కోణాల్లో ఆలోచన చేయలన్నారు. 34 వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతుల యోగక్షేమాల బాధ్యత చంద్రబాబుపై ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయలేదని, అటువంటప్పుడు 2వ విడత సేకరణ ఎందుకని ప్రశ్నించారు.

News March 6, 2026

శాసనమండలిలో వైయస్‌ఆర్‌సీపీ మరో వాయిదా తీర్మానం

image

ఏపీ శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చారు. విశాఖలో గీతం యూనివర్సిటీకి సంబంధించిన రూ.5 వేల కోట్ల విలువైన భూదోపిడీ అంశంపై మండలిలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. నిన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం చర్చకు అనుమతించలేదని విమర్శించారు. విశాఖ భూముల వ్యవహారంపై చర్చించే ధైర్యం ఉందా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు

News March 6, 2026

తెనాలిలో ఉగాది పురస్కారాల సంబరాలు..!

image

పరాభవనామ తెలుగు సంవత్సరo ఉగాది పురస్కారాల సంబరాలను మా-ఎపి భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారిని ఎంపిక చేసి అవార్డులను ప్రధానోత్సవం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఆహ్వానించబోతున్నట్లు వివరించారు. తేదీ,వేదిక త్వరలో ప్రకటిస్తామన్నారు.

News March 6, 2026

అమరావతిలో ‘నైలిట్’ కేంద్రం ఏర్పాటు

image

అమరావతిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (నైలిట్) కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపింది. నైలిట్ ప్రతినిధులు డా.జయరాజ్, డా.లక్ష్మణ్ కొర్రా ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ముందుగా తాత్కాలిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా యువతకు ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో డిజిటల్ నైపుణ్యాలు, మెరుగైన శిక్షణ అందుబాటులోకి రానున్నాయి

News March 6, 2026

GNT: రైల్వే గేట్ మూసినా ముందుకెళ్తే.. ప్రమాదం తప్పదు..!

image

ప్రజలు రైల్వే క్రాసింగ్‌లు దాటేటప్పుడు అధికారుల సూచనలు పాటించి నిబంధనలకు లోబడి ప్రవర్తిస్తే ప్రమాదాలను నివారించవచ్చని గుంటూరు డివిజన్ DSO కీర్తి తెలిపారు. గేట్ మూసిన తర్వాత కూడా కొందరు నిర్లక్ష్యంగా దాటేందుకు ప్రయత్నించడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విజయవాడ–గుంటూరు–తెనాలి మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో జిల్లాల్లో ప్రతి ఏడాది 30–60 రైల్వే సంబంధిత మరణాలు నమోదవుతున్నాయి.

News March 6, 2026

GNT: రైల్వే గేట్ మూసినా ముందుకెళ్తే.. ప్రమాదం తప్పదు..!

image

ప్రజలు రైల్వే క్రాసింగ్‌లు దాటేటప్పుడు అధికారుల సూచనలు పాటించి నిబంధనలకు లోబడి ప్రవర్తిస్తే ప్రమాదాలను నివారించవచ్చని గుంటూరు డివిజన్ DSO కీర్తి తెలిపారు. గేట్ మూసిన తర్వాత కూడా కొందరు నిర్లక్ష్యంగా దాటేందుకు ప్రయత్నించడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విజయవాడ–గుంటూరు–తెనాలి మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో జిల్లాల్లో ప్రతి ఏడాది 30–60 రైల్వే సంబంధిత మరణాలు నమోదవుతున్నాయి.

News March 5, 2026

ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత

image

ఉద్యోగులతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని BC సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్, డైరీని గురువారం సచివాలయంలో ఆమె ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రాగానే ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

News March 5, 2026

GNT: ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్

image

ఈ నెల 14న జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్నీ న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ బెంచెస్ ఏర్పాటు చేశామని‌, సివిల్ కేసులు, క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ వాహన ప్రమాద భీమా కేసులు, చెక్ బౌన్స్, LOAP కేసులు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు, స్టేక్హోల్డర్స్, పోలీసులు కేసుల పరిష్కారానికి సహకరించాలన్నారు.