India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరులో డ్రగ్స్ కేసు మరింత కలకలం రేపుతోంది. ఈ కేసులో మొత్తం ముగ్గురు యువకులు అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. ఇందులో ఒకరు మస్తానయ్య దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కొడుకు మస్తాన్ సాయి కాగా గుంటూరు హోటల్ రంగంలో పేరు గాంచిన సుభానీ హోటల్ నిర్వాహకులు ఇద్దరు ఉన్నారు. కరోనా సమయంలో సుభానీ మరణించగా తాజాగా ఆయన కుమారులు నాగూర్ షరీఫ్, ఖాజా మొయినుద్దీన్‌లు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు.
హీరో రాజ్ తరుణ్-లావణ్య డ్రగ్స్ సప్లయర్ విషయంలో గుంటూరు మూలాలు కనిపించాయి. హైదరాబాద్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుడికి డ్రగ్స్ అందించిన రావి సాయి అనే యువకుడిని ఏపీ సెబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు గుర్తించారు.
గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన గుజ్జనగుండ్లలోని కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రఘు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఈ మేరకు రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించింది. గత రెండు రోజులుగా అమరావతిలో పర్యటిస్తున్న ఈ బృందం.. రాజధాని ప్రాంతంలోని భవనాలు, రహదారులను పరిశీలించింది. ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అమరావతి నిర్మిస్తున్నామని ఆ బృందానికి సీఎం వివరించారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి వద్దకే ఈ పిటిషన్ వెళ్లాలని హైకోర్టుకు పోలీసుల తరఫు లాయర్ అశ్వినీకుమార్ సూచించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి నిశితంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి వెల్లడించారు. అనంతరం కేసు తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.
మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు విచారణ వేగంగా జరుగుతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏపీ వ్యాప్తంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులున్నారని ఆరోపించారు. తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో భూములకు సంబంధించిన వందల ఫైళ్లు దొరికాయని అన్నారు. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
మంగళగిరి ప్రజలకు ప్రతి నియోజకవర్గంలో అందుబాటులో ఉండి సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. సోమవారం గౌతమ్ బుద్ధ రోడ్డు వెంబడి గల ఈద్గా మైదానంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక నిర్వహించిన అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ అన్నారు.
తంగలాన్ చిత్ర ప్రమోషన్లలో భాగంగా హీరో విక్రమ్ సోమవారం విజయవాడ రానున్నారు. ఉదయం 11 గంటలకు విక్రమ్‌తో పాటు చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహిస్తారని ఈ మేరకు తాజాగా సమాచారం వెలువడింది. అనంతరం 12 గంటలకు పరిటాలలో MVR కళాశాలకు, మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు VVIT కళాశాలకు తంగలాన్ బృందం వెళ్లనుంది.
డెల్టా ప్రాంత ప్రజలకు వరమైన తెనాలిలో వైద్యశాల్లో మరో నూతన విభాగం అందుబాటులోకి రానుంది. అత్యవసర కేసులను గుంటూరు జిల్లా వైద్యశాలకు తరలిస్తున్న నేపథ్యంలో తెనాలిలోనే ఆ స్థాయిలో వైద్యం అందించేందుకు కసరత్తు జరుగుతోంది. రూ.45కోట్ల అంచనాతో 100 పడకలతో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణం ప్రారంభమైంది. మొత్తంగా 2025 చివరి నాటికి క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం ఎస్సీ కాలనీలోనూ అతిసారం ప్రబలింది. మూడు రోజుల్లో 12 మంది అతిసారం బారిన పడినట్లు స్థానికులు చెబుతున్నారు. వారిలో కొందరు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతుండగా.. కొందరిని సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు కాలనీలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. నేడు గుంటూరు నుంచి వైద్య బృందం రానున్నట్లు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.