Guntur

News August 5, 2024

ఈ నెల 7న బాపట్లకు సీఎం చంద్రబాబు

image

ఈ నెల 7న సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగే చేనేత దినోత్సవాల్లో చంద్రబాబు పాల్గొననున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సోమవారం చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో హెలిపాడ్‌ను బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బారావు పరిశీలించారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని జేసీ సూచించారు.

News August 5, 2024

ఈ నెల 7న బాపట్లకు సీఎం చంద్రబాబు

image

ఈ నెల 7న సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగే చేనేత దినోత్సవ వేడుకలలో చంద్రబాబు పాల్గొననున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సోమవారం చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో హెలిపాడ్‌ను బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బారావు పరిశీలించారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని జేసీ సూచించారు.

News August 5, 2024

అమరావతిలో భూమి సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం

image

రాజధాని పరిధిలో ప్రతి సెంటు భూమి సమీకరణ లేదా సేకరణ విధానంలో తీసుకోవాలని నిర్ణయించింది. గ్రామాలు, గ్రామకంఠాల కిందనున్న భూమి తప్ప మిగిలినదంతా తీసుకోనుంది. దీనిలో ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఉండదని CRDA వర్గాలు స్పష్టంచేశాయి. భవనాలను CRDA స్వాధీనం చేసుకునే అవకాశముంది. భూములపై కోర్టు స్టేలు ఉంటే వాటిని వెకేట్ చేయించి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో ఇంకా 4,181 ఎకరాలు తీసుకోవాల్సి ఉంది. 

News August 5, 2024

మాచర్ల: బీటెక్ విద్యార్థిని సూసైడ్

image

మాచర్ల మండలం అలుగురాజుపల్లిలోని న్యూటన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా డోన్ కు చెందిన విద్యార్థిని జక్కి రేణుక ఎల్లమ్మ మాచర్లలోని హాస్టల్ రూమ్‌లో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News August 5, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో లక్ష సభ్యత్వాలు

image

జనసేన పార్టీ తలపెట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో లక్ష సభ్యత్వాలు పూర్తి చేసుకున్నట్లు జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు చెప్పారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో లక్ష సభ్యత్వాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐటి టీంకు స్వీట్లు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలలో జనసేన పార్టీ నానాటికి ఆదరణ పెరుగుతుందని తెలిపారు.

News August 4, 2024

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

✎ పిడుగురాళ్లలో పురుగుల మందు తాగి ఆత్మహత్య
✎ షరతులకు కట్టుబడి ఉంటా బెయిలివ్వండి: హైకోర్టులో పిన్నెల్లి
✎ ప్రభుత్వ ITIలో మూడో విడత ప్రవేశాలు
✎ బాపట్ల: పాత గొడవల నేపథ్యంలో హత్య
✎ గుంటూరులో నర్సుపై ఉన్మాది బ్లేడుతో దాడి
✎ 100 రోజుల్లో అన్నీ సెట్ చేస్తాం: సీఎం చంద్రబాబు
✎ నరసరావుపేట: రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్య
✎ రొంపిచర్ల: స్నేహితుల దినోత్సవం రోజున విషాదం
✎ పల్నాడు కలెక్టర్ సీసీపై SC, ST కేసు నమోదు

News August 4, 2024

మార్చి నాటికి దేశవ్యాప్తంగా BSNL 4G సేవలు : పెమ్మసాని

image

దేశవ్యాప్తంగా వీలైనంత వేగంగా BSNL 4G సేవలు విస్తరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం తాడికొండలో 4G టవర్‌ను స్థానిక MLA శ్రవణ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బేస్ బ్యాండ్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. పెమ్మసాని మాట్లాడుతూ.. సెప్టెంబర్ కల్లా 70%, మార్చి లోపు 100% 4G సేవలను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నామన్నారు.

News August 4, 2024

రొంపిచర్ల: స్నేహితుల దినోత్సవం రోజున విషాదం

image

రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో స్నేహితుల దినోత్సవం రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రోహిత్ హైదరాబాదులో ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శనివారం వీకెండ్ కావడంతో అదే గ్రామానికి చెందిన బాల అనే స్నేహితుడితో బైకుపై హైదరాబాదుకు వెళ్లాడు. కేబుల్ బ్రిడ్జిపై నుంచి వస్తున్న క్రమంలో రాత్రి సమయంలో బ్రిడ్జి పైన డివైడర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు.

News August 4, 2024

గుంటూరులో నర్సుపై ఉన్మాది బ్లేడుతో దాడి

image

వడ్డేశ్వరంలోని వసతి గృహం వద్ద యువతిపై ఓ ఉన్మాది బ్లేడుతో దాడి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తాడేపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో యువతి నర్సుగా పనిచేస్తూ వడ్డేశ్వరంలోని వసతి గృహంలో ఉంటుంది. పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో దాడి చేసినట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన నిందితుడు క్రాంతిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 

News August 4, 2024

ప్రభుత్వ ITIలో మూడో విడత ప్రవేశాలు

image

గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐల్లో మూడో విడత ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లాస్థాయి పారిశ్రామిక శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ సాయి వరప్రసాద్ తెలిపారు. టెన్త్ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ, టీసీ, విద్యార్థితో పాటు తల్లిదండ్రులు ఆధార్ జిరాక్స్ తీసుకువెళ్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.