India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంతర్జాతీయ స్కేటింగ్ వేదికపై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన మంగళగిరికి చెందిన క్రీడాకారిణి జెస్సీరాజ్‌ను ప్రధానమంత్రి రాష్ట్రీబాల పురస్కార్–2025 వరించింది. 14 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ పతకం సాధించి ప్రపంచ క్రీడావనిపై మువ్వెన్నల జెండాను ఎగురవేసిన జెస్సీని అత్యున్నత పురస్కారంతో ప్రభుత్వం గౌరవించనుంది. ఈ నెల 26న ఢిల్లీలోని రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనుంది.
పాత నేరస్తులు, జైలు నుంచి విడుదలైన వారిపై పోలీసులు నిరంతరం నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చైన్ స్నాచింగ్‌కు పాల్పడే వారిపై సాంకేతిక పరమైన నిఘా పెట్టి త్వరగా పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దొంగతనాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
పట్టణంలోని శంకర్ విలాస్ సెంటరులో నూతనంగా నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వల్ల కలిగే ట్రాఫిక్ రద్దీ నివారణకు అనుగుణంగా, ఐకానిక్ ఆర్కిటెక్చర్ ప్రతిబింబించేలా డిజైన్లు రూపొందించాలని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పిల్లర్లపై జిల్లా బ్రాండ్‌ను ప్రతిబింబించేలా డిజైన్లు రూపొందించాలని సూచించారు.
డబ్బే లోకంగా మారిపోయిన రోజులివి. ఆస్తి, ఉద్యోగం దక్కితే చాలు.. తమ జీవితాలు ఇక స్థిరపడిపోతాయనే ఆలోచన బలంగా నాటుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు. తల్లి, తండ్రి, అన్నాచెల్లి అనే పేగు బంధాలకు పాతర వేసి హంతకులవుతున్నారు. నకరికల్లులో జరిగిన <<14929205>>డబుల్ మర్డర్ <<>>కేసే ఇందుకు ఉదాహరణ. ఆస్తి, తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కోెసం అన్నదమ్ములను ప్రియుడితో కలిసి దారుణంగా చంపిన కృష్ణవేణి క్రూరమైన ఆలోచన మానవత్వానికే మాయని మచ్చ.
చేబ్రోలు(M) కొత్తరెడ్డి పాలెంలో వీఆర్ఏ అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ మృతిచెందడంతో దహనం చేసేందుకు VRA పెదఏబు, మరో మహిళ VRA హేమలత, ఏసుదాసు అనే వ్యక్తి శ్మశాన వాటికకు వచ్చారు. దహనం అనంతరం వచ్చిన రూ.3,500 నగదు పంపకంలో వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళ VRA హేమలత ఏబు తలపై బండ రాయితో కొట్టగా మరణించాడు.
పల్నాడు జిల్లా నకరికల్లులో అన్నదమ్ములను సోదరి హతమార్చిన విషయం తెలిసిందే. కాగా ఈ డబుల్ మర్డర్ కేసు మిస్టరీ వీడింది. పోలీసుల వివరాల మేరకు.. ప్రియుడుతో కలిసి కృష్ణవేణి పథకం ప్రకారం వారిని చంపివేసింది. నిందితురాలు కృష్ణవేణితో పాటు ప్రియుడు దానయ్య, మరో నలుగురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 26న రామకృష్ణను ఇంట్లో చున్నీ బిగించి హత్య చేసి గొరంట్ల కాలువలో పడేశారు.
పాతగుంటూరు బాలాజీనగర్‌లో మద్యం మత్తులో స్నేహితులు దాడి చేయడంతో మరణించిన తెనాలి యువకుడు దీపక్ కేసును పాతగుంటూరు పోలీసులు ఛేదించారు. ఈ మేరకు నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. మృతిచెందిన దీపక్ తన స్నేహితుడు కిరణ్ కుమార్‌కు తెలియకుండా ఫోన్ పే నుంచి రూ.53వేలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడన్నారు. డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో మద్యం తాగించి దాడి చేయడంతో దీపక్ మృతిచెందాడని సీఐ సోమయ్య తెలిపారు.
విద్యుచ్ఛక్తిని పొదుపుగా వాడి భావితరాల వారికి ఇంధన వనరులను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ అన్నారు. గురువారం, కలెక్టరేట్లో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 14 నుంచి 20వ తేది వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. విద్యుచ్ఛక్తి ఆదాలో ప్రజలందరూ భాగ్యస్వామ్యం కావాల్సి ఉందన్నారు.
పరీక్షా పే చర్చ-2025 కార్యక్రమంలో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అధిక సంఖ్యలో నమోదు చేయించాలని గుంటూరు DEO సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. డైట్ లెక్చరర్ కె.ప్రసాద్ (బోయపాలెం)ని జిల్లాకు నోడల్ అధికారిగా నియమించామని చెప్పారు. https://innovativeindia.mygov.inలోకి వెళ్లి పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపల్స్ నమోదు చేయించి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు.
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 9703622022కు వాట్సాప్ చేయండి.
Sorry, no posts matched your criteria.