India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంగళగిరిలో అనంత జిల్లాకు చెందిన రైతు DY.CMను కలిసేంత వరకు కదలనని భీష్మించుకున్న విషయం తెలిసిందే. నవీన్ హిందూపురం నుంచి ఎడ్లబండిపై నెలరోజులు ప్రయాణించి సోమవారం మంగళగిరికి చేరుకున్నారు. ఆయన వేడుకోలుకు స్పందించిన పవన్ కళ్యాణ్ రైతుతో మాట్లాడారు. దళారుల బెడద తప్పించాలని, పండించిన ఉత్పత్తులను అమ్ముకోలేక పోతున్నామని రైతు వాపోయాడు. దీంతో సమస్యను విన్న పవన్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించాలని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం చంద్రబాబుతో పవన్ చర్చించారు. కార్యక్రమంలో పలు విషయాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం మంగళవారం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ మధబానందకర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి 49మంది ఎంబీబీఎస్, నలుగురు పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్, సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు పాల్గొంటారన్నారు.
పల్నాడు జిల్లాలో అన్న,తమ్ముడిని సోదరి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి విస్తు పోయే నిజాలు బయటకు వస్తున్నాయి. స్థానికుల సమాచారం మేరకు.. ఉపాధ్యాయుడైన తండ్రి పక్షవాతంతో మృతిచెందగా, ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం గత కొంతకాలంగా ముగ్గురి మధ్య వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే సోదరి కృష్ణవేణి సోదరుడు గోపికృష్ణను చున్నీతో ఉరివేయగా, దుర్గ రామకృష్ణను కాలువలో తోసి చంపినట్లు సమాచారం.
అమెరికాకు అనేక కారణాలతో వెళ్లిన యువకులు వరుసగా మృతిచెందడంతో తెనాలిలో తీవ్ర విషాదం నింపుతోంది. 2024 సంవత్సరంలో తెనాలి నుంచి చదువుకోడానికి వెళ్లిన ఇద్దరిలో ఒకరు యాక్సిడెంట్, మరొకరు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ మృతిచెందారు. ఇది మరువక ముందే తాజాగా తెనాలికి చెందిన మరో యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో తెనాలి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరుగుతోందన్న భయంలో తెనాలి వాసులు ఉంటున్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమం సోమవారం జిల్లాలోని అన్ని మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులు చేయదలచిన ప్రజలు విషయాన్ని గమనించి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువచేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన వివాహానికి రావాలని చంద్రబాబుకు సింధు తండ్రితో కలిసి ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానించారు.
సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన జీవిత చరిత్రను గురించి చంద్రబాబు కొనియాడారు. భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం, తెలుగుజాతి కోసం 56 రోజుల పాటు నిరాహారదీక్ష చేసి ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, మహారాష్ట్ర వంటి భాషా ప్రభుత్వ రాష్ట్రాల ఏర్పాటుకు తోడ్పడ్డారన్నారు.
గుంటూరులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది. పట్టాభిపురం పోలీసుల వివరాల మేరకు.. మద్యానికి బానిసైన రాంబాబు(35)అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలని భార్యను ఒత్తిడి చేస్తున్నాడు. భార్య ఇవ్వకపోవడంతో తన తల్లి నివాసం ఉంటున్న ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సినీ హీరో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కావడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా మరో ట్వీట్ చేశారు. ‘గురువు ఆజ్ఞ.. శిష్యుడు అమలు.. అల్లు అర్జున్ అరెస్టు.. నా మాట కాదు.. ఇది జనం మాట’! అంటూ అంబటి ఏపీ CM చంద్రబాబు, తెలంగాణ CM రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్‌ను ట్యాగ్ చేశారు. కాగా అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో అంబటి వరుస ట్వీట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Sorry, no posts matched your criteria.