Guntur

News December 11, 2024

అమరావతికి వెళ్లిన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు

image

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు నాగలక్ష్మీ, అరుణ్ బాబు, వెంటక మురళి అమరావతి వెళ్లారు. నేడు, రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.

News December 11, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అంబటి రాంబాబు

image

కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ సందర్శించారు. పలువురు రైతులతో ధాన్యం కొనుగోలు పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వడ్లు అమ్ముకోవడానికి గిట్టుబాటు ధరలు లేవని, తక్కువ ధరలకు అమ్ముకొని రైతులు నష్టపోవాల్సి వస్తుందని అంబటి విమర్శించారు.

News December 10, 2024

వైసీపీ రైతు ఉద్యమం పోస్టర్ విష్కరణ

image

ఏపీలో రైతుల సమస్యలపై డిసెంబరు 13న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ ఉద్యమం చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ ఉద్యమం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితర నేతలు పిలుపునిచ్చారు.

News December 10, 2024

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి కంచె తొలగింపు

image

తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఇంటికి రక్షణ కోసం నిర్మించిన ఇనుప కంచెలో కొంత భాగాన్ని సోమవారం తొలగించారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో భద్రత కోసం తాడేపల్లిలోని తన ఇంటి ప్రహరీ గోడకు భారీ ఎత్తున ఇనుప కంచెను ఏర్పాటు చేయించుకున్నారు. వాస్తు ప్రకారం తూర్పు ఈశాన్య వైపు కంచె భాగాన్ని తొలగించినట్లు సమాచారం.

News December 10, 2024

తాడేపల్లి: ఫ్రెండ్ తల్లిపైనే అఘాయిత్యం..!

image

తాడేపల్లిలో ఆదివారం రాత్రి మహిళపై లైంగిక దాడికి తెగబడిన దుండగుడిని పోలీసులు 12 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. సీఐ కళ్యాణ రాజు మాట్లాడుతూ.. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు తెంపరల రామారావును సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మహిళ కుమారునితో ఉన్న స్నేహాన్ని అడ్డుపెట్టుకుని.. ఆమె ఇంటికి వచ్చి బలవంతం చేయగా ఆమె భయపడి పరుగులు తీశారు.

News December 10, 2024

గుంటూరు కలెక్టర్ గ్రీవెన్స్‌కు 172 అర్జీలు

image

సుదూర ప్రాంతాల నుండి పి‌జి‌ఆర్‌ఎస్ లో ప్రజలు అందించిన ఫిర్యాదులను పరిష్కరించకుంటే సంబంధిత జిల్లా అధికారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి 172 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు

News December 9, 2024

రెంటచింతల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

image

రెంటచింతల పోలీస్ స్టేషన్‌ను గురజాల డీఎస్పీ జగదీష్ సోమవారం సందర్శించారు. సాధారణ తనిఖీలలో భాగంగా రెంటచింతల స్టేషన్లోని పెండింగ్ కేసుల వివరాలను, రికార్డు మెయిన్టెనెన్స్ తీరును ఆయన పరిశీలించారు. మండలంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు. డీఎస్పీ వెంట కారంపూడి సీఐ శ్రీనివాసరావు ఎస్సై నాగార్జున ఉన్నారు.

News December 9, 2024

తాడేపల్లిలో మహిళపై అత్యాచారయత్నం 

image

తాడేపల్లిలో ఓ మహిళపై ఆదివారం రాత్రి అత్యాచారయత్నం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. తన కుమారుడి స్నేహితుడు రామారావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో సదరు మహిళ భయంతో మాజీ CM జగన్ హెలీప్యాడ్ వైపు పరుగులు తీసింది. స్థానికుల సహాయంతో ఆ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  

News December 9, 2024

పల్నాడు: ఆ నలుగురి చివరి ఫొటో ఇదే..!

image

పల్నాడు జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా కావలి పట్టణ వాసులు నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆంజనేయస్వామి మాల వేసుకున్న వీరంతా తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా కారు చెట్టు ఢీకొని చనిపోయారు. కొండగట్టులో వాళ్లు తీసుకున్న చివరి ఫొటో ఇదే. ఎంతో ఆనందంగా గడిపిన వాళ్లు కన్నుమూయడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు.

News December 9, 2024

ఎన్జీవో కాలనీలో NTR విగ్రహావిష్కరణ చేసిన పెమ్మసాని

image

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎన్జీఓ కాలనీలో ఆదివారం సాయంత్రం టీడీపీ వ్యవస్థాపకుడు NTR విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర సహాయమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గళ్ళా మాధవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.