Guntur

News June 13, 2024

గుంటూరు: అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన లారీ

image

రహదారిపై వెళ్తున్న లారీ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన కాకుమాను మండలం కొమ్మూరు గ్రామంలో జరిగింది. గురువారం కొమ్మూరు గ్రామంలో వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News June 13, 2024

పల్నాడు జిల్లాకు దక్కని మంత్రి పదవి.. కారణం?

image

పల్నాడు జిల్లా లోక్‌సభ స్థానంతోపాటు 7 అసెంబ్లీ స్థానాల్లో TDP ఎన్నడూ లేనివిధంగా మెజారిటీతో విజయం సాధించింది. అయితే ఆశావహులైన సీనియర్లకే ఇక్కడ నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది. వారిలో కన్నా, యరపతినేని, జీవీలకు ఈసారి మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని భావించారు. కాగా ప్రత్తిపాటి, జూలకంటి ఆశావహుల జాబితాలో ఉన్నారు. వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం పల్నాడుకు ప్రాతినిధ్యం కల్పించలేకపోయింది.

News June 13, 2024

గుంటూరు: రైళ్లు రద్దు నిర్ణయం ఉపసంహరణ

image

విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున ఈనెల 21వ తేదీ నుంచి, పలు రైళ్లను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ఉప సంహరించుకున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి బుధవారం తెలిపారు. విజయవాడ- గుంటూరు(07628), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె-తెనాలి (07873), తెనాలి- విజయవాడ (07630), రైళ్లు యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు.

News June 13, 2024

గుంటూరు: నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

image

వేసవి సెలవుల అనంతరం దాదాపు నెలన్నర తరువాత నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే తల్లిదండ్రులు విద్యార్థుల్ని పాఠశాలలకు పంపేందుకు సన్నద్ధం అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యాకానుక కిట్ల సరఫరాను ప్రభుత్వం పూర్తి చేసింది.

News June 13, 2024

ANUలో మరోసారి సెలవులు పొడిగింపు

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వేసవి సెలవులు మరోసారి పొడిగించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా సెలవులను ఈనెల 14 వరకు పొడిగిస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. తాజాగా విశ్వవిద్యాలయంలోని కళాశాలలు ఈనెల 18 నుంచి పునఃప్రారంభమవుతాయని రిజిస్ట్రార్ కరుణ ప్రకటన విడుదల చేశారు.

News June 13, 2024

చంద్రబాబును కలిసిన కలెక్టర్ వేణుగోపాల్

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌తోపాటు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

News June 12, 2024

మాచవరం: పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి

image

పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామస్వామి (35) అనే వ్యక్తి పొలంలో పనులు చేసుకుంటుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News June 12, 2024

ఒకే వాహనంలో ప్రధాని మోదీ, చంద్రబాబు

image

ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వాహనంలో కేసరపల్లికి బయల్దేరారు. కొద్దిసేపటి కిందటే విమానాశ్రయంలో ప్రధానికి చంద్రబాబు, గవర్నర్ స్వాగతం పలికారు. అనంతరం వారు కేసరపల్లిలోని సభా స్థలికి బయల్దేరారు. 11.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

News June 12, 2024

గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ

image

ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా వచ్చిన ఆయనకు గవర్నర్, చంద్రబాబు స్వాగతం పలికారు. కాసేపట్లో ముగ్గురూ గన్నవరం ఐటీ పార్కులోని ప్రమాణస్వీకార సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు.

News June 12, 2024

పల్నాడు టీడీపీ నేతలకు నో ఛాన్స్!

image

చంద్రబాబు సీఎంగా కూటమి ప్రభుత్వం బుధవారం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో 24 మందితో మంత్రివర్గాన్ని చంద్రబాబు ప్రకటించారు. కాగా, ఇందులో పల్నాడులోని ఒక్క నాయకుడికి చోటు దక్కలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, కన్నా లక్ష్మీనారాయణలకు మంత్రి పదవి లభిస్తుందని అభిమానులు ఎదురు చూశారు.