India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాపట్ల జిల్లాకు చెందిన యువకుడు ఆస్ట్రేలియాలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. బాపట్లకు చెందిన సూర్యతేజ MS కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. సూర్యతేజ, ప్రకాశం జిల్లాకు చెందిన చైతన్యతో పాటు మరో స్నేహితుడు కలిసి ఆస్ట్రేలియాలోని మిల్లామిల్లా జలపాతానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు సూర్యతేజ జలపాతంలోకి జారిపడటంతో అతడిని కాపాడేందుకు చైతన్య దిగగా ఇద్దరూ మునిగి చనిపోయారు.
గుంటూరు జిల్లా నాగార్జున సాగర్‌లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. నాగార్జున సాగర్‌తో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)కు సీఎం చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. కాగా ఇందుకోసం 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి AAI వర్గాలు తెలిపాయి.
గుంటూరు రేంజ్ పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఎక్కువగా పల్నాడు జిల్లాలోని వారికే స్థాన చలనం కలిగింది. మొత్తం 10మందిని ఐజీ బదిలీ చేయగా వారిని వెంటనే విధుల్లో చేరాలని ఉత్తర్వులు పేర్కొన్నారు.
యువకుడి వేధింపులతో బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ వీరేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరంగిపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటివద్దే ఉంటోంది. బాలికను మరో గ్రామ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తుండటంతో బాలిక తండ్రి అతన్ని మందలించాడు. నీలాంబరం, మరి కొందరు బాలిక ఇంటికి వెళ్లి ఆమె తండ్రిపై దాడి చేశారు. మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందింది.
అమరావతి ప్రాంతంలోని రాయపూడి గ్రామంలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించనుంది. సోమవారం రాయపూడి పంచాయితీలో ప్రాథమిక అనుమతుల కోసం రుసుము చెల్లించి దరఖాస్తు చేసింది. ఈ సంస్థకు 2019 ఫిబ్రవరిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని 60 ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయించారు. ఈ సంస్థ దేశంలోని వివిధ జంతు జాతులపై సర్వే చేస్తూ, వాటి మనుగడకు పరిశోధనలు సాగిస్తుంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో RTCకి కొత్త బస్సులు కేటాయించడంతో ఆయా మార్గాల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందనున్నాయి. కొన్నాళ్లుగా డొక్కు బస్సులతో ఇబ్బందిపడిన ప్రయాణికులకు కొత్త బస్సుల రాకతో ఊరట కలగనుంది. ఉమ్మడి జిల్లాకు RTC సొంత బస్సులు, అద్దె బస్సులు కలిసి 130 వరకు కొత్తవి సమకూరనున్నాయి. ఇప్పటికే 30 బస్సులు ఆయా డిపోలకు రాగా మిగిలినవి నెల నుంచి 2 నెలల వ్యవధిలో తీసుకురానున్నట్లు అధికారులు చెబుతున్నారు.
విజయవాడ కిడ్నీ రాకెట్ కేసులో ఒక నిందితుడిని గుంటూరు నగరపాలెం పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు ఇస్తామని ఓ ముఠా గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు వద్ద కిడ్నీ తీసుకున్నారు. చివరికి డబ్బు ఇవ్వకుండా మోసం చేయడంతో మధుబాబు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి బాషా అనే వ్యక్తిని పట్టుకున్నారు.
నరసరావుపేటలో ఓ ఔషధ వ్యాపారి అదృశ్యం కావడం సంచలనం రేకెత్తించింది. రాజాగారికోటలో ఔషధ దుకాణం నిర్వహిస్తున్న వ్యాపారి 2రోజులుగా కనిపించకపోవడంతో, అతనికి అప్పులిచ్చినవారు అతని అచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఇంటికి తాళం వేసి ఉండటం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో దివాళా తీసినట్లు భావిస్తున్నారు. సుమారు రూ.15 కోట్ల అప్పులు ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై తమకు ఫిర్యాదు అందలేదని 2వ పట్టణ సీఐ భాస్కర్ తెలిపారు.
జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు గుంటూరు డీఈవో పి. శైలజ తెలిపారు. జిల్లాలోని ఉపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 21వ తేదీ తుది గడువు అని డీఈవో వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
10వ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గుంటూరు డివిజన్‌లో 29, తెనాలి డివిజన్‌లో 28, నరసరావుపేట డివిజన్‌లో 53 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPM అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ABPM అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. SHARE IT.
Sorry, no posts matched your criteria.