Guntur

News December 1, 2024

ధాన్యం కొనుగోలుపై అపోహలు వద్దు: నాదెండ్ల

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు వరకు ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి పట్టణ పరిధిలోని ఐతానగర్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి ధాన్యం విక్రయించవద్దని, ప్రభుత్వానికి ధాన్యం విక్రయించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు మీద ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని భరోసా కల్పించారు.

News December 1, 2024

రేపు మంగళగిరిలో ప్రజా వేదిక నిర్వహణ

image

మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో సోమవారం ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కార్యాలయ నిర్వాహకులు ఆదివారం తెలిపారు. రేపు జరిగే ప్రజా వేదికలో గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, APTDC ఛైర్మన్ నూకసాని బాలాజీ, ఏపీ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్ కేకే చౌదరి పాల్గొంటారని చెప్పారు. ఈ ప్రజా వేదికలో వారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారన్నారు. అందరూ ఈ ప్రజా వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

News December 1, 2024

పీఠాధిపతిగా చిన్న వయసు నుంచే మన్ననలు పొందారు

image

పల్నాటి ఉత్సవాలలో భాగంగా ప్రస్తుతం వీరాచారాన్ని చేస్తున్నది పిడుగు వంశీకులలోని పిడుగు తరుణ్‌ చెన్నకేశవ అయ్యవారు. ఆయన తండ్రి విజయ్, తల్లి సరస్వతి. చిరుప్రాయంలోనే పల్నాటి వీరాచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక పక్క చదువుతూ తండ్రి బొగ్గరం విజయ్‌ నేతృత్వంలో ఆచారాన్ని కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందారు. గ్రామంలో నేటికి అలనాటి చారిత్రక చిహ్నాలు ఉన్నప్పటికి ఆదరించే అధికారులు కానరాక శిథిలావస్థకు చేరాయి. 

News December 1, 2024

కారంపూడి వీరుల తిరుణాల్లో రెండోరోజు రాయబారం..

image

కారంపూడి వీరుల తిరుణాల్ల సందర్భంగా రెండోరోజు రాయబారం.. అలరాజు కోడిపోరులో ఓడిన మాచర్ల రాజ్యాన్ని తిరిగి మలిదేవులకు అప్పగించాలని గురజాల రాజు నలగాముని వద్దకు సంధికి వెళతాడు. ఈ క్రమంలో నాగమ్మ ప్రభావంతో తంబళ్ల జీయర్‌ ద్వారా చర్లగుడిపాడు వద్ద హత్యకు గురవుతాడు. ఆనాటి హత్యాకాండను వీరవిద్యావంతులు ఆలపిస్తుంటారు. ఈ క్రమంలో ఆచారవంతులు అవేశపూరితంగా కత్తిసేవ చేస్తుండటం నేటికి దర్శనీయమే.

News December 1, 2024

మోదీ, చంద్రబాబుపై అభిమానం వెయ్యి రెట్లు పెరిగింది: పెమ్మసాని

image

దేశాన్ని, రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణలో నడిపిస్తున్న పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుపై అభిమానం వెయ్యి రెట్లు పెరిగిందని చెప్పడానికి గర్వంగా ఉందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో ఏపీ టాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెన్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆడిటర్లు, అకౌంటెంట్లకు అభినందనలు తెలిపారు.

News November 30, 2024

GNT: ‘పవన్‌కి ఎక్కడికైనా వెళ్లి విచారణచేసే అర్హత ఉంది’

image

బియ్యం అక్రమ రవాణాపై పవన్‌ చొరవ సంతోషకరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌కి.. ఎక్కడికైనా వెళ్లి విచారణచేసే అర్హత ఉందన్నారు. మేం కూడా బియ్యం అక్రమ రవాణాపై ప్రశ్నించామన్నారు. జగన్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అదానీతో జగన్ ఒప్పందంపై విచారణ జరపాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.

News November 30, 2024

అది మహాభారతం అయితే.. ఇది ఆంధ్రభారతం

image

పల్నాటి యుద్ధం, ఆంధ్రాలోని పల్నాడు ప్రాంతములో 1176-1182 మధ్యకాలంలో జరిగింది. మహాభారతానికి, పల్నాటి వీరుల చరిత్రకు దగ్గరి పోలికలు ఉండటంతో దీనిని ‘ఆంధ్ర భారతం’ అనికూడా అంటారు. పల్నాటి యుద్ధంలో జరిగిన అపారమైన జన, ఆస్తి నష్టం వల్ల ఆంధ్ర రాజులందరూ బలహీనులయ్యారు. ఈ పరిస్థితిలో కాకతీయులు ఇక్కడున్న రాజులందరినీ ఓడించారు. కాగా కారంపూడిలో యుద్ధం జరిగిన స్థలాన్ని గుర్తించారు.

News November 30, 2024

2015లో ‘రిషితేశ్వరి’ రాసిన కన్నీటి లేఖ ఇదే.!

image

ANU విద్యార్థిని రిషితేశ్వరి చివరి క్షణాల్లో రాసిన లేఖ క్రూరమృగాలను సైతం కన్నీళ్లు పెట్టిస్తుంది. కనికరం లేకుండా కన్నీళ్లు పెట్టించిన సీనియర్‌లకు ఏం కుళ్లుపుట్టిందో ఏమో రిషితేశ్వరి చిరునవ్వును శాశ్వతంగా దూరం చేశారు. తండ్రితో పాటూ చదువంటే తనకెంతో ఇష్టమని, చదువు కోసం ANUకి వస్తే ప్రేమ పేరుతో సీనియర్లు వేధించారని అప్పట్లో రిషితేశ్వరి లేఖ రాసింది. కాగా ఈ కేసును కోర్టు కొట్టేయడంతో ఆమె లేఖ వైరలైంది. 

News November 30, 2024

రిషితేశ్వరి ఆ రోజుల్లో ఎందుకు చనిపోయిందంటే.!

image

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ANU ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకొని 9 ఏళ్లు గడిచింది. సీనియర్స్ చరణ్ నాయక్, శ్రీనివాస్ రిషితేశ్వరిని ప్రేమిస్తున్నాని వెంటపడటంతో అనీషా నాగసాయి లక్ష్మీవారికి సహకరించింది. ఈ క్రమంలోనే 2015 మే 18న ఆ యువకులు ఇద్దరూ రిషితేశ్వరి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అందుకోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని 2015 జులై 14న రిషితేశ్వరి డైరీ రాసి చనిపోయింది. 

News November 29, 2024

గుంటూరు: బోరుగడ్డ అనిల్‌కు 14 రోజుల రిమాండ్

image

బోరుగడ్డ అనిల్‌కు మరో 14 రోజులు రిమాండ్‌ను  గుంటూరు జిల్లా కోర్టు పొడిగించింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర దూషణలపై కేసులో బోరుగడ్డ అనిల్‌కు ఉత్తర్వులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆయనను మళ్లీ రాజమండ్రి జైలుకు పట్టాభిపురం పోలీసులు తరలించారు. కాగా ఇప్పటికే అనిల్ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు.