Guntur

News July 12, 2024

పల్నాడు ప్రథమ కలెక్టర్ జిల్లాకు రాక

image

పల్నాడు జిల్లా ప్రథమ కలెక్టర్‌గా పని చేసిన లోతేటి శివశంకర్ ఈనెల 13న నరసరావుపేట రానున్నారు. పల్నాడు జిల్లా ఏర్పడ్డాక ఆయనను ప్రభుత్వం ప్రథమ కలెక్టర్‌గా నియమించింది. ఈ సందర్భంగా ఆయన జిల్లాకు చేసిన సేవలకు గుర్తింపుగా “లోతేటి శివశంకర్ ఐఏఎస్”అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎంపీ లావు, ఎమ్మెల్యే చదలవాడ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నట్లు తెలిపారు.

News July 12, 2024

ANU: డిగ్రీ 7వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో బీఎస్సీ కెమిస్ట్రీ కోర్స్ చదువుతున్న విద్యార్థులు, రాయాల్సిన 7వ సెమిస్టర్ (Y20 బ్యాచ్) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఆగస్టు 1, 2, 3, 5, 6 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News July 12, 2024

చంద్రబాబు పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు

image

ఈనెల 13వ తేదీన తాడేపల్లి మండలం కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. దీంతో అక్కడ పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఎస్పీ తుషార్, సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్‌లతో కలిసి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. గట్టి భద్రత ఏర్పాట్లతోపాటు వాహనాల పార్కింగ్, బారికేట్లు ఏర్పాటు చేయాలన్నారు.

News July 12, 2024

మంగళగిరిలోని కొలనుకొండకు వెళ్లనున్న చంద్రబాబు

image

మంగళగిరిలోని కొలనుకొండకు సీఎం చంద్రబాబు శనివారం రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష నిర్వహిస్తారని వివరించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు మంగళగిరి చేరుకోనున్నారు. దీంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.

News July 12, 2024

మంగళగిరిలోని కొలనుకొండకు వెళ్లనున్న చంద్రబాబు

image

మంగళగిరిలోని కొలనుకొండకు సీఎం చంద్రబాబు శనివారం రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష నిర్వహిస్తారని వివరించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు మంగళగిరి చేరుకోనున్నారు. దీంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.

News July 12, 2024

అనంత్ అంబానీ పెళ్లికి మంత్రి నారా లోకేశ్

image

ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ- రాధిక వివాహ వేడుకకు మంత్రి నారా లోకేశ్ హాజరు కానున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ పెళ్లి వేడుకకు పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే.

News July 12, 2024

పిడుగురాళ్ల: పెరుగుతున్న అతిసార బాధితులు

image

పిడుగురాళ్లలోని లెనిన్‌నగర్, మారుతీనగర్‌ ప్రజలు అతిసార లక్షణాలతో 10రోజులుగా ఆస్పత్రుల్లో చేరుతున్నారు. తొలిరోజు 25మంది ఆస్పత్రుల్లో చేరగా..బాధితుల సంఖ్య పెరుగుతోంది. కాగా, దీనికి మూలకారణమేంటో తెలియరాలేదు. గురువారం పట్టణంలో పర్యటించిన మంత్రి నారాయణకూ అధికారులు కారణాలు చెప్పలేకపోయారని తెలుస్తోంది. కుళాయి నీరు కలుషితం అయిందని, నీటిని పరీక్ష కోసం విజయవాడకు పంపినట్లు అధికారులు చెబుతున్నారు.

News July 12, 2024

గుంటూరు: ఆ స్టేషన్‌కు 5రోజుల్లో నలుగురు సీఐలు

image

గడిచిన 5రోజుల్లో నల్లపాడు పీఎస్‌కు నలుగురు CIలు మారారు. నల్లపాడు CIగా పనిచేస్తున్న నరేశ్ కుమార్ తొలుత సెలవుపై వెళ్లడంతో CI వెంకన్నచౌదరికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. మరుసటి రోజు నరేశ్ సెలవుల నుంచి వచ్చి విధుల్లో చేరగా, సాయంత్రానికి ఆయన్ను VRకి పంపారు. ఎస్సై సత్యనారాయణకు గురువారం ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. సాయంత్రానికి ఒంగోలు SEBలో చేస్తున్న వంశీధర్‌కు CIగా పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు.

News July 12, 2024

గుంటూరు మిర్చి యార్డులో 27,246 బస్తాల మిర్చి విక్రయం

image

గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 26,349 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 27,246 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334. సూపర్ 5, 273, 341, 4884, ఆర్-10 రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి రూ.17,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి రూ.18,500 వరకు లభించింది.

News July 12, 2024

గుంటూరులో కారు ఢీ.. వ్యక్తి మృతి

image

గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనపై గురువారం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 10వ తేదీ రాత్రి నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్‌లో నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టి వెళ్ళిపోయింది. ఈ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తి తలకు, కంటికి తీవ్ర గాయాలై మృతి చెందారని పోలీసులు తెలిపారు.