Guntur

News February 9, 2026

గుంటూరులో ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు

image

గుంటూరు వేంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా జరుగుతున్న “భారత రంగ్ మహోత్సవ్-అంతర్జాతీయ నాటకోత్సవాలు” సోమవారంతో 4వ రోజుకు చేరాయి. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. తెలుగు నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, తదితరులు పాల్గొని సీనియర్ కళాకారులను ప్రత్యేకంగా సత్కరించారు.

News February 9, 2026

రైతుల కోసం ఉబర్ తరహాలో డ్రోన్ సేవలు: కలెక్టర్

image

ఉబర్ తరహాలో డ్రోన్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రైతుల అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉబర్‌ క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలు పొందవచ్చన్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ అంతటా సేవలు లభిస్తాయని చెప్పారు. పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు డ్రోన్ ద్వారా చల్లడం వంటి ప్రయోజనాలు పొందవచ్చన్నారు.

News February 9, 2026

మాదకద్రవ్యాలతో జీవితం చిత్తు: కలెక్టర్

image

మాదక ద్రవ్యాలు నివారించి, యువత జీవితాలను కాపాడాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాలు ప్రవేశించకుండా నిఘా పెట్టాలన్నారు. యువత మత్తులో పడితే జీవితం చిత్తవుతుందని, కుటుంబాలు ఆర్థికంగా నష్ట పోతాయని, ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు.

News February 9, 2026

GNT: ప్రపంచ కప్ విజేత అనురాధకు శాప్ ఛైర్మన్ సత్కారం

image

షూటింగ్ బాల్ ప్రపంచ కప్ విజేత పి.అనురాధ రెడ్డిని శాప్ SAAP ఛైర్మన్ రవీనాయుడు సోమవారం సత్కరించారు. ఢిల్లీలో జరిగిన 2వ ప్రపంచ కప్ పోటీల్లో ఆమె భారత్ తరపున బంగారు పతకం సాధించారు. బాపట్ల జిల్లాకు చెందిన అనురాధ.. ఛైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచినందుకు రవినాయుడు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.

News February 9, 2026

సీఎం సమీక్షలో పాల్గొన్న గుంటూరు ఎస్పీ

image

వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర పరిపాలనపై సోమవారం కీలక సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి గుంటూరు నుంచి ఎస్పీ వకుల్ జిందాల్ వర్చువల్ విధానంలో హాజరయ్యారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ తమీమ్ అన్సారీయా, జాయింట్ కలెక్టర్ అషుతోశ్ శ్రీవాత్సవ కూడా పాల్గొన్నారు. మంత్రులు, కార్యదర్శులతో కలిసి సీఎం పలు అంశాలపై చర్చించారు.

News February 9, 2026

‘ట్రీస్కేప్స్ 2026’లో ANU ప్రతినిధుల సందడి

image

న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ‘ట్రీస్కేప్స్2026’ అంతర్జాతీయ సదస్సులో ANUబృందం పాల్గొంది. ‘సౌత్ ఏషియన్ ఆగ్రోఫారెస్టీ&ట్రీస్ అవుట్‌సైడ్ ఫారెస్ట్స్’ అంశంపై నిర్వహించిన సదస్సులో ANU అధ్యాపకులు మనోజ్ రెడ్డి, తన్విక, విద్యార్థుల బృందం హాజరైంది. అటవీసంరక్షణ, వ్యవసాయ రంగాల్లో వస్తున్న నూతన సాంకేతిక మార్పులు, పర్యావరణ పరిరక్షణపై ప్రపంచస్థాయి నిపుణులతో కలిసి చర్చలు జరిపారు.

News February 9, 2026

GNT: నులిపురుగుల నిర్మూలన దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

image

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (డీ వార్మింగ్ డే)ను ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పోస్టర్ ను కలెక్టరేట్‌లో సోమవారం తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. అన్నీ అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో 17వ తేదీన ఉచితంగా ఇవ్వబడే అల్బెండజోల్ 400 మిల్లీ గ్రాముల మాత్ర ద్వారా నులిపురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించవచ్చన్నారు.

News February 9, 2026

స్వల్ప వృద్ధితోనే గుంటూరు జిల్లా ఆదాయ వసూళ్లు

image

గుంటూరు జిల్లా మున్సిపల్ ఆదాయ వసూళ్లలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా మొత్తం వసూలు చేయాల్సింది ₹452.15 కోట్లుగా నమోదైంది. ఫిబ్రవరి 9 వరకు వసులుచేసింది ₹152.35 కోట్లు మాత్రమే అది 33.70%గా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ₹152.29 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది స్వల్పంగా 3.90% వృద్ధి నమోదైంది. లక్ష్య సాధనలో ఇంకా వేగం పెంచాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.

News February 8, 2026

GNT: వెహికల్ చెకింగ్.. రూ.5లక్షల జరిమానా, 72 సీజ్

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం పోలీసులు రహదారి భద్రతా డ్రైవ్ చేపట్టారు. మొత్తం 2,436 వాహనాలను ప్రధాన కూడళ్లల్లో తనిఖీ చేశారు. త్రిపుల్ రైడింగ్, అతివేగం, హెల్మెట్ లేకుండా ప్రయాణం‌, మైనర్ల డ్రైవింగ్‌ని గుర్తించి
933 వాహనాలపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలకు రూ.5,67,590 జరిమానా విధించారు. ధృవపత్రాలు సక్రమంగా లేని 72 వాహనాలను సీజ్ చేశారు.

News February 8, 2026

GNT: రేపు ఎస్పీ ఆఫీసులో PGRS రద్దు

image

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నాటి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో పీజీఆర్ఎస్‌ను రద్దు చేశామని చెప్పారు. ప్రజలు గమనించాలని చెప్పారు.