Guntur

News February 5, 2026

GNT: 42 బార్ల కోసం 122 దరఖాస్తులు.. మరికొద్దిసేపటల్లో లాటరీ!

image

గుంటూరు జిల్లాలో బార్ల అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను గుంటూరు కలెక్టరేట్‌లో నేడు లాటరీ తీయనున్నారు. మొత్తం 42 బార్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా 122 దరఖాస్తులు వచ్చాయి. జీఎంసీ పరిధిలో 26 బార్లకు 84 దరఖాస్తులు అందాయి. అదేవిధంగా మంగళగిరి, తాడేపల్లి పరిధిలో 6 బార్లకు 24, పొన్నూరులో ఒక బార్ కి 6 దరఖాస్తులు వచ్చాయి. తెనాలిలో 9 బార్ల కోసం 8 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఎవరి భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి.

News February 5, 2026

గుంటూరులో చోరీ.. రూ.3లక్షల అపహరణ

image

గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బారాఇమాం పంజా సెంటర్‌లో చోరీఘటనపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు వెల్లడించారు. బారాఇమాం పంజా సెంటర్‌కి చెందిన పగడాల రాజేశ్వరి ఇంట్లో చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేసింది. ఇంట్లోని రూ.3 లక్షల నగదు అపహరణకు గురైందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు.

News February 5, 2026

సౌరశక్తితో గుంటూరులో 772 గిరిజన గృహాలకు వెలుగు

image

విద్యుత్‌ లేని కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా సరఫరా అందిస్తుందని లోక్‌సభలో వెల్లడైంది. RDSS, PM-JANMAN పథకాల కింద రాష్ట్రంలో వేలాది ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేశారు. కాగా గుంటూరు జిల్లాలో PM-JANMAN కింద 772 PVTG కుటుంబాలకు విద్యుత్‌ కనెక్షన్లు మంజూరయ్యాయి. సౌర వీధి దీపాలు, ఆఫ్‌గ్రిడ్‌ సౌర వ్యవస్థల ఏర్పాటుతో గిరిజన ప్రాంతాలకు లబ్ధి చేకూరిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

News February 4, 2026

GNT: క్వాంటం వ్యాలీ శంకుస్థాపన ఏర్పాట్ల పరిశీలన

image

రాష్ట్రంలో నెలకొల్పనున్న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన ఏర్పాట్లు సాగుతున్నాయి. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రద్యుమ్న, సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉద్దండరాయ పాలెం వద్ద స్థల పరిశీలన చేశారు. ఈనెల 7న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న దృష్ట్యా ఏర్పాట్లు పరిశీలించినట్లు వెల్లడించారు.

News February 4, 2026

పురుష ఆరోగ్య కార్యకర్తల పునఃనియామకానికి దరఖాస్తుల గడువు పెంపు

image

1207 జీఓ ప్రకారం 2024లో విధుల నుంచి తొలగించిన పురుష ఆరోగ్య కార్యకర్తల్లో 40 మందిని సుప్రీంకోర్టు ఆదేశాలు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అనుమతితో తిరిగి విధుల్లోకి తీసుకుంటూ నియామక పత్రాలు అందజేసినట్లు DMHO డా.విజయలక్ష్మి తెలిపారు. గుంటూరు జిల్లాలో పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేయుటకు దరఖాస్తుల స్వీకరణ FEB 10వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు.

News February 4, 2026

‘SDG సూచికల లక్ష్యాలు 100 శాతం అధిగమించాలి’

image

జిల్లాలో స్వర్ణాంధ్ర సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించిన సూచికలు 100 శాతం అధిగమించేలా అన్ని శాఖలు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ అన్సారియా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ వీసీ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అభివృద్ధి లక్ష్యాల సూచికలను 100 శాతం సాధించాలన్నారు. సమావేశంలో ZP CEO జ్యోతిబస్ పాల్గొన్నారు.

News February 4, 2026

GNT: అమరజీవి స్మారకానికి మునిమనవరాలి విరాళం

image

అమరావతిలో 58 అడుగుల ఎత్తైన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహ నిర్మాణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్‌కు 58 లక్షల రూపాయల విరాళాన్ని పొట్టి శ్రీరాములు గారి మునిమనవరాలు కుందా ప్రతిభ ప్రకటించారు. ఈ సందర్భంగా కుందా ప్రతిభ, కుంద ప్రతాప్‌కి ట్రస్ట్ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విరాళం విగ్రహ నిర్మాణానికి కీలకంగా నిలవనుందని పేర్కొన్నారు.