India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చాలా రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధానికి తెరపడింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గుంటూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ (AMC) ఏర్పాటు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. టీడీపీ నుంచి ఛైర్మన్‌గా కర్రా అప్పారావు, జనసేన నుంచి వైస్ ఛైర్మన్‌గా బిట్రగుంట మల్లికను నియమించారు. అదనంగా 13 మంది కమిటీ సభ్యుల నియామకాన్ని ఖరారు చేశారు.

మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు గుంటూరు మెడికల్ కాలేజీని సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన భారీ మెడికల్ ఎక్స్‌పోను ప్రారంభించనున్నారు. అనంతరం ఆసుపత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం (MCH) పనితీరును, కొత్తగా అందుబాటులోకి రానున్న ఆన్‌లైన్ OP స్లాట్ బుకింగ్ విధానాన్ని ఆయన పరిశీలించనున్నారు.

గుంటూరు జిల్లాలో ప్రస్తుతం పోలీస్ యాక్ట్-30 అమలులో ఉన్నందున ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి ముందుగానే రైతులకు ఈ-కేవైసీ పూర్తి చేయాలని గుంటూరు కలెక్టర్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఈనెల 9వ తేదీలోపు
ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ-కేవైసీ, ఇతర పనులను పూర్తి చేసి పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో DRO ఖాజావలి, జేసీ శ్రీవాత్సవ పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బందికి నిర్వహిస్తున్న మొబిలైజేషన్ శిక్షణలో భాగంగా పోలీస్ పరేడ్ మైదానంలో యోగా అభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అదనపు ఎస్పీ (ఏఆర్) హనుమంతు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మంగళవారం జరిగింది. యోగా, ధ్యానం వల్ల శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం, ఆలోచనా సామర్థ్యం పెరుగుతాయని తెలిపారు. పోలీస్ విధుల్లో వచ్చే ఒత్తిడిని ఎదుర్కొనేందుకు యోగా ఎంతో ఉపయుక్తమని అన్నారు.

జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 94,689 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీని తెనాలి నియోజకవర్గంలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్‌లో ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఆహార శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 6-18 ఏళ్ల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి రూ.2.52 కోట్లతో అద్దాలు అందిస్తున్నామన్నారు.

మాజీ సీఎం YS.జగన్ ఫిబ్రవరి 4న గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి రోడ్డుమార్గాన 11 గంటలకు గుంటూరు సిద్ధార్థనగర్‌లోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంటారు. అక్కడ ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి బయలుదేరి వెళ్తారు.
Sorry, no posts matched your criteria.