Guntur

News February 8, 2026

రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ సేవలు: కలెక్టర్

image

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగే పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ సేవలను ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సూచించారు. https://Meekosam.ap.gov.inవెబ్ సైట్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చని, డయల్ 1100కి ఫోన్ చేసి అర్జీల స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. మండలాల వారీగా రెవెన్యూ క్లీనిక్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. అక్కడ రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చన్నారు.

News February 7, 2026

ANU: పీజీ ఆర్ట్స్, సైన్స్, లా పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్ నెలలో జరిగిన పలు పీజీ కోర్సుల మూడో సెమిస్టర్, లా కోర్సుల పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శనివారం తెలిపారు. రీవాల్యుయేషన్ కు దరఖాస్తులు ఈనెల 16వ తేదీలోగా అందించాలని సూచించారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in సంప్రదించాలన్నారు.

News February 7, 2026

ANU: బీఆర్క్ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్ నెలలో జరిగిన బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శనివారం తెలిపారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు ఈ నెల 16వ తేదీలోగా అందించాలని సూచించారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in సంప్రదించాలన్నారు.

News February 7, 2026

గుంటూరు: అంబటి బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా

image

CMని దూషించిన కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. అంబటిని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్, అలాగే ఆయనకు బెయిల్ ఇవ్వాలని డిఫెన్స్ తరపు న్యాయవాదులు కోరిన పిటిషన్లపై గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. ప్రాసిక్యూషన్ తరపున డీడీ విజయలక్ష్మి, అంబటి తరపున పొన్నవోలు తమ వాదనలు వినిపించారు.

News February 6, 2026

PHCలో మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు.
రోగులతో సిబ్బంది మర్యాదగా ప్రవర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరంతరం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

News February 6, 2026

ఉద్దండరాయునిపాలెం: రేపు క్వాంటం వ్యాలీకి సీఎం భూమిపూజ

image

రాజధాని అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెంలో శనివారం క్వాంటం వ్యాలీ నిర్మాణానికి CM చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులు కార్యక్రమ ప్రదేశాన్ని పర్యవేక్షించి, బందోబస్తుపై సిబ్బందికి కీలక సూచనలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉన్నతాధికారులు స్వయంగా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

News February 6, 2026

ఆరోగ్య సమస్యలపై 1100కు ఫిర్యాదు చేయండి: DMHO

image

ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సేవల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే మీకోసం టోల్‌ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయవచ్చని గుంటూరు DMHO డా. విజయలక్ష్మి తెలిపారు. బాధితులు నమోదు చేసే ఫిర్యాదులను ప్రభుత్వం నేరుగా పర్యవేక్షించి త్వరితగతిన పరిష్కరిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ నంబర్‌ను ప్రజలకు తెలిసేలా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాల్లో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు.

News February 6, 2026

Way2News ఎఫెక్ట్.. ANU అధికారుల చర్యలు

image

దూర విద్యా పరీక్షల నిర్వహణలో ఆంధ్రా విశ్వవిద్యాలయం విధానాన్ని ANUలో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏయూలో అన్ని పరీక్షలు ప్రభుత్వ కళాశాలల్లోనే నిర్వహించగా, అదే విధానానికి అనుమతి కోరుతూ ఉన్నత విద్యా మండలికి లేఖ రాయనున్నట్లు సమన్వయకర్త తెలిపారు. సెల్‌ఫోన్లతో మాస్ కాపీయింగ్ ఘటనపై Way2Newsలో వార్త రావడంతో అధికారులు స్పందించారు. పరీక్షలు సజావుగా జరగాలంటే ప్రభుత్వ కళాశాలలే సరైనవని అభిప్రాయపడ్డారు.

News February 6, 2026

GNT: హైకోర్టులో అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్లు

image

మాజీ మంత్రి అంబటి రాంబాబు AP హైకోర్టులో మొత్తం ఏడు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. పట్టాభిపురం, నగరంపాలెం, మంగళగిరి, నల్లపాడు PSలలో నమోదైన కేసులను రద్దు చేయాలని ఆయన కోరారు. నల్లపాడు కేసు క్వాష్ పిటిషన్ విచారణను ఈ నెల 11కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేసింది. మంగళగిరి కేసులో 35(3) BNSS ప్రక్రియ పాటించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. మంగళగిరి కోర్టులో PT వారెంట్ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేసారు.

News February 6, 2026

గుంటూరులో వైసీపీ నేతలపై కేసులు నమోదు

image

గుంటూరులో జగన్ పర్యటన సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించిన పలువురు YCP నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాడేపల్లిలో వేమారెడ్డిపై, పెదకాకానిలో ఉమామహేశ్వర రెడ్డి, నగరంపాలెంలో నూరిఫాతిమా, నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో బలసాని కిరణ్ కుమార్, పట్టాభిపురం PSలో అంబటి మురళి కృష్ణపై నమోదయినట్లుగా తెలుస్తోంది. 30 యాక్ట్ ఉల్లంఘించి ర్యాలీలు నిర్వహించినందుకు కేసులు నమోదయ్యాయి.