India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ధరల నియంత్రణపై పటిష్ఠ పర్యవేక్షణ జరగాలని జేసీ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటీ సమావేశం ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితిని పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటిని ప్రభుత్వం నియమించడం జరిగిందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ చెత్త సేకరణపై నిర్వహించిన సర్వేలో గుంటూరు (D) రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. పాజిటివ్ పబ్లిక్ పెర్సెప్షన్‌లో భాగంగా IVRS ద్వారా మీ ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతుందా? అని ప్రశ్నించగా 78.7 శాతం అవును అని, వారానికి కనీసం 2 సార్లైనా మీ ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నారా? అని ప్రశ్నించగా 79.7 శాతం అని ప్రజలు ఫీడ్ బ్యాక్‌ను అందించారు. 79.2%తో ప్రథమస్థానంలో నిలిచింది.

బంగారం, వెండి ధరల్లో ఆకస్మిక మార్పులతో వ్యాపారానికి పేరొందిన గుంటూరు, తెనాలి మార్కెట్‌లలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇటీవల వెండి ధర ₹ 4 లక్షలకు చేరడంతో విక్రయాలు జరగగా, నేడు అదే ధర ₹ 2.5 లక్షలకు పడిపోవడంతో వ్యాపారులు భారీ నష్టాలు చవిచూస్తున్నారు. లావాదేవీలు నిలిచిపోవడంతో పనులు లేక కార్మికులు దినసరి కూలీలుగా మారాల్సి వస్తోందని వ్యాపారవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మీ COMMENT?

గుంటూరు(D) పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా మంగళగిరికి చెందిన వెంకట సాంబశివరావు నియమితులయ్యారు. AP పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, జిల్లావ్యాప్తంగా పద్మశాలి సోదరులను ఏకం చేసి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని సాంబశివరావు ధీమా వ్యక్తం చేశారు.

మాజీ సీఎం YS జగన్ ఆదేశాల మేరకు YCP కేంద్ర కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. గుంటూరు, NTR జిల్లాల కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు. పార్టీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ సమావేశంలో పాల్గొంటారు. అదే కార్యాలయంలో బ్రాహ్మణ నాయకులతో మరో సమావేశం జరగనుంది. 33 మంది బ్రాహ్మణ నేతలు హాజరుకానున్నారు.

నేడు ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవం.1970 ఫిబ్రవరి 2న గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి ఒంగోలు జిల్లాను ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్థం 1972లో దీనికి ప్రకాశం జిల్లాగా పేరు మార్చారు. ఒంగోలు గిత్త, పొగాకు, చేనేతకు ఈ జిల్లా ప్రసిద్ధి. జిల్లా ఏర్పడి 56 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుపై ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు సోమవారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్షాన్ని జైల్లో పెట్టాలని ఎద్దేవా చేశారు. కాపు కులాన్ని టార్గెట్ చేసి.. అంబటి కుటుంబాన్ని వేధిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వల్లే మీకు అధికారం వచ్చిందని, లడ్డూ కల్తీపై అబద్ధాలు చెప్పారని లేఖలో ధ్వజమెత్తారు.

తెలుగు చలనచిత్ర ఖ్యాతిని దశదిశలా చాటిన దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ వర్ధంతి నేడు. ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పెదపులివర్రులో జన్మించారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం వంటి చిత్రాలతో సంస్కృతికి పెద్దపీట వేశారు. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మశ్రీ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (PGRS) నిర్వహించనున్నట్లు కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తామన్నారు. నగర సమస్యల సత్వర పరిష్కారానికి విభాగాధిపతులు హాజరవుతారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (PGRS) నిర్వహించనున్నట్లు కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తామన్నారు. నగర సమస్యల సత్వర పరిష్కారానికి విభాగాధిపతులు హాజరవుతారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Sorry, no posts matched your criteria.