India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘నూజివీడులో కూటమి ప్రభుత్వం బరితెగించిందని, ఇసుక స్మగ్లింగ్ చేయబడునని అక్రమంగా తరలించి మీకు ఇవ్వబడును అంటూ ఏకంగా ఫ్లెక్సీలు కట్టారని వైసీపీ విమర్శించింది. ప్రభుత్వ అధీనంలోని ఇసుక ప్రైవేటు వ్యక్తులు ఎలా అమ్ముతారు.. దీనికి ప్రభుత్వం వత్తాసా ? అంటే తమ నాయకులు ఏం చేసినా ఫర్వాలేదా..? ఇదేనా మీరు చెప్పుకుంటున్న మంచి ప్రభుత్వం? అని ట్వీట్ చేసింది.
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధరరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ అధ్యక్షతన మంగళవారం జిల్లా నేర సమీక్షా సమావేశం జరగ్గా నేరాల నియంత్రణపై సమీక్షించారు. జైలు నుంచి విడుదలైన నేరస్థుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టిసారించాలన్నారు.
విజయవాడ సింగ్ నగర్లో మహిళా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె డాన్సర్ వెంకటలక్ష్మిగా స్థానికులు గుర్తించారు. ఆమె స్వస్థలం కాకినాడ కాగా, సింగినగర్కు వచ్చి అద్దెకు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఒంటిపై గాయాలు ఉండటంతో స్థానికులు హత్యగా భావించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అజిత్ సింగ్ నగర్ సీఐ వెంకటేశ్వరా నాయక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కృష్ణా జిల్లా బ్యాడ్మింటన్ బాలికలు 68వ అంతర్ జిల్లాల అండర్ 14, 17 విభాగంలో ప్రథమ స్థానం సాధించిన్నట్లు జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శులు దాసరి శ్రీనివాస్, సీజర్ రెడ్డిలు మంగళవారం తెలిపారు. వీరికి శిక్షణను ఇచ్చి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దిన కోచ్, మేనేజర్లు ముకుంద, నరసింహారావు, గణేశ్ లను అభినందించారు.
కృష్ణలంకలో గత మూడు రోజుల నుంచి ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్న రాష్ట్రస్థాయి అండర్ 19 బాక్సింగ్ పోటీలు మంగళవారం ముగిసాయని జిల్లా కార్యదర్శి రవికాంత తెలిపారు. రాష్ట్ర బాక్సింగ్ ఓవరాల్ ఛాంపియన్ గా విశాఖపట్నం జిల్లా బాలబాలికలు నిలిచినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన జిల్లా బాక్సింగ్ సంఘ ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజా రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలోని ఓ హోటల్ పైనుంచి పడి సోమవారం ఉదయం బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. సీఐ ప్రకాశ్ వివరాలు..బాలిక అన్నతో దాగుడుమూతలు ఆడుకుంటూ కిటికీ కర్టెన్ వెనుక దాక్కుంది. ప్రమాదవశాత్తు జారిపోయి, 20 సెకన్లు కిటికీని పట్టుకుని వేలాడింది. కింద ఉన్న యువకులు పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. పాపను రోడ్డుపై చూసి తండ్రి కంగుతిన్నాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
విజయవాడకు చెందిన 8వ తరగతి విద్యార్థిని లాస్య గీసిన చంద్రబాబు రేఖాచిత్రాన్ని తీసుకొని సోమవారం అమరావతి సచివాలయానికి వచ్చింది. ‘సంపద సృష్టించి పేదవారికి పంచి ఇచ్చే పెన్నిధికి ఒక పేద విద్యార్థి ఇచ్చే చిరుజ్ఞాపిక’ అంటూ చంద్రబాబు గురించి గీసిన ఆ చిత్రాన్ని చూసి సీఎం ఫిదా అయ్యారు. అనంతరం లాస్యను అభినందించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో మూడేళ్ల LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. నవంబర్ 19, 21, 23, 25, 27వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలంది.
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌలభ్యం కోసం మౌలిక వసతులను విస్తృతంగా అభివృద్ధి చేస్తున్నామని విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర పాటిల్ చెప్పారు. ఈ రెండు స్టేషన్లలో రూ.17కోట్ల వ్యయంతో మౌలిక వసతులను ఏర్పాటు చేయిస్తామన్నారు. విజయవాడ డివిజన్ పరిధిలో 11 స్టేషన్లలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మౌలిక వసతులను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
నూజివీడు వాసి శబరి భవాని, రాజమండ్రికి చెందిన బంధువు వెంకట పద్మకుమారిలు భవాని భర్త చికిత్స పొందుతుండగా చిన్న అవుటపల్లి ఆసుపత్రిలో పరామర్శించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి వేగంగా వస్తున్న ఓ బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన ఇద్దరూ చికిత్స పొందుతూ.. మృతిచెందారు. ఆ ఇద్దరి మరణం అటు నూజివీడు, ఇటు రాజమండ్రిలో తీవ్ర విషాదాన్ని నింపింది. అనంతరం రోడ్డుపై వేగాన్ని నియంత్రించాలని పలువురు కోరారు.
Sorry, no posts matched your criteria.