Krishna

News March 18, 2026

కృష్ణా: ‘నిలిచిపోయిన యోగా కోర్సును పునఃప్రారంభిస్తాం’

image

కృష్ణా విశ్వవిద్యాలయంలో కరోనా కారణంగా నిలిచిపోయిన యోగా కోర్సును పునరుద్దించాలని వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్, విశ్వ సముదాయ సేవా సంఘం ప్రతినిథులు రిజిస్టార్ ఉషాకు వినతిపత్రం అందజేశారు. విజయవాడ మాంటిస్సోరి కళాశాలలో యోగా కోర్సును పునరుద్దరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కోర్సుకు శిక్షకులుగా పీజీ చేసిన వారిని నియమిస్తామని తెలిపారు.

News March 18, 2026

కృష్ణా: ‘నిలిచిపోయిన యోగా కోర్సును పునఃప్రారంభిస్తాం’

image

కృష్ణా విశ్వవిద్యాలయంలో కరోనా కారణంగా నిలిచిపోయిన యోగా కోర్సును పునరుద్దించాలని వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్, విశ్వ సముదాయ సేవా సంఘం ప్రతినిథులు రిజిస్టార్ ఉషాకు వినతిపత్రం అందజేశారు. విజయవాడ మాంటిస్సోరి కళాశాలలో యోగా కోర్సును పునరుద్దరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కోర్సుకు శిక్షకులుగా పీజీ చేసిన వారిని నియమిస్తామని తెలిపారు.

News March 18, 2026

హాస్టల్స్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేయండి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారం కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం
మచిలీపట్నం కలెక్టరేట్‌లో హాస్టళ్ల సంయుక్త తనిఖీ కమిటీ సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం తదితర సమస్యలపై సమీక్షించారు. వసతి గృహాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.

News March 17, 2026

కృష్ణా: నవోదయ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల

image

వేలేరు జవహర్ నవోదయ విద్యాలయ సమితి నిర్వహించిన 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రోల్ నంబర్, జనన తేదీని నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు https://cbseit.in/cbse/2026/nvsrst/NVS_Cls6.aspx లో ఫలితాలను చూడవచ్చు.

News March 17, 2026

మచిలీపట్నం – విజయవాడ హైవేపై LED లైట్లు: కలెక్టర్

image

మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారిపై లైట్లు (వీధి దీపాలు) సరిగ్గా వెలగకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం కృష్ణా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న సోడియం వ్యాపర్ లైట్ల స్థానంలో LED లైట్లు లేదా సౌర శక్తితో వెలిగే లైట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు.

News March 17, 2026

గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి: కృష్ణా కలెక్టర్

image

జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాలపై సంబంధిత అధికారులతో
మచిలీపట్నంలో ఆయన సమీక్షించారు. జిల్లాలో 20 రోజులుగా గృహ నిర్మాణ పనులు పురోగతి పరిశీలిస్తే 844 గృహాలు దశల వారి మార్పు జరిగాయన్నారు. వాటిలో 306 గృహాలు పైకప్పు స్థాయి నుంచి రూఫ్ క్యాస్ట్ స్థాయికి చేరుకున్నాయన్నారు.

News March 17, 2026

కృష్ణా: ఎండలు హీట్.. బొండాల ధరలు హాట్!

image

జిల్లాలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో శీతల పానీయాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా డిహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగించే కొబ్బరి బొండాలకు ప్రజలు అధికంగా మొగ్గు చూపుతున్నారు. దీంతో స్థానికంగా లభ్యత తగ్గిపోవడంతో పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల నుంచి కొబ్బరి బొండాలను కృష్ణా జిల్లాకు దిగుమతి చేస్తున్నారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా ఖర్చులు కూడా పెరగడంతో ధరలు స్వల్పంగా పెరిగాయి.

News March 17, 2026

సంక్షేమ వసతి గృహాలపై కృష్ణా కలెక్టర్ సమీక్ష

image

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల మరమ్మతుల పురోగతిపై మచిలీపట్నంలో కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో సమీక్షించారు. 61 హాస్టళ్ల అభివృద్ధికి రూ.10.35 కోట్లు మంజూరు కాగా, రూ.5 కోట్లతో 46 హాస్టళ్లలో పనులు పూర్తయ్యాయన్నారు. తాగునీరు, ఆహార నాణ్యతపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

News March 17, 2026

కృష్ణా: 82 అంగన్వాడీ పోస్టులకు నేడే చివరి తేదీ

image

కృష్ణా జిల్లాలోని బందరు, బంటుమిల్లి, పామర్రు, గుడివాడ, కంకిపాడు, మొవ్వ, గన్నవరం, అవనిగడ్డ ప్రాజెక్టులలో మొత్తం 82 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 21-35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులైన వివాహిత మహిళలు అర్హులన్నారు. ఈ నెల 17లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాలను సంప్రదించాలని పేర్కొన్నారు.

News March 17, 2026

కృష్ణా: వారికి నేడే ఆఖరి రోజు!

image

జిల్లాలోని మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు నేడు చివరి రోజు కానుంది. దీంతో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పాలనకు ముగింపు పలుకుతూ, రేపటి నుంచి పట్టణ పరిపాలన పూర్తిగా ప్రభుత్వ నియమిత ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల నియామకానికి మార్గదర్శకాలు జారీ చేసి అధికారులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో పరిపాలన కొనసాగింపు బాధ్యతలు అధికారులు చేపట్టనున్నారు.