Krishna

News March 23, 2026

మొవ్వలో షార్ట్ సర్కూట్.. 3 గృహాలు దగ్ధం

image

మొవ్వ మండలం కాజ శివారు కుళాయి గుంటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 3 గృహాలు దగ్ధమయ్యాయి. విలువైన వస్తు సామగ్రి, నగదు, బంగారు ఆభరణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధితులు చందోలు ఏసు పాదం, కొమ్ముకూరి వరప్రసాద్, వేమూరి ఇజ్రాయేల్‌కు చెందిన గృహాలు అగ్ని ప్రమాదానికి గురవడంతో రూ.లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. ఈ ఘటనను VRO గోపికృష్ణ MRO మస్తాన్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశారు.

News March 23, 2026

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం
మచిలీపట్నం కలెక్టరేట్‌లో PGRS నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్‌కు 112 అర్జీలు రాగా ఎంప్లాయిస్ గ్రీవెన్స్‌కు 9 అర్జీలు వచ్చాయన్నారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ పరిష్కార చర్యలకు ఆదేశించారు.

News March 23, 2026

వాస్తవాలను ప్రతిబింబించేలా జనగణన చేపట్టాలి: కలెక్టర్

image

వాస్తవాలను ప్రతిబింబించే విధంగా జనగణన ఉండాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం
మచిలీపట్నం కలెక్టరేట్ వీసీ హాల్లో జనగణనపై క్షేత్రస్థాయిలో ట్రైనర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. జనాభా లెక్కలు సేకరించే సమయంలో చాలా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. జనగణన ఆధారంగా కేంద్రం రాష్ట్రానికి నిధులు కేటాయిస్తుందన్నారు.

News March 23, 2026

వాస్తవాలను ప్రతిబింబించేలా జనగణన చేపట్టాలి: కలెక్టర్

image

వాస్తవాలను ప్రతిబింబించే విధంగా జనగణన ఉండాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం
మచిలీపట్నం కలెక్టరేట్ వీసీ హాల్లో జనగణనపై క్షేత్రస్థాయిలో ట్రైనర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. జనాభా లెక్కలు సేకరించే సమయంలో చాలా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. జనగణన ఆధారంగా కేంద్రం రాష్ట్రానికి నిధులు కేటాయిస్తుందన్నారు.

News March 23, 2026

కృష్ణా: గణితం పరీక్షకు 97.56% హాజరు

image

కృష్ణా జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సోమవారం గణితం పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 21,797 మంది విద్యార్థులకు గాను 21,484 మంది హాజరయ్యారు. 98.56% హాజరు శాతం నమోదైనట్టు డీఈఓ యూవీ సుబ్బారావు తెలిపారు. DLO-5, DEO-6 పరీక్షా కేంద్రాలను సందర్శించగా ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 41 కేంద్రాలను తనిఖీ చేయగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని DEO తెలిపారు.

News March 23, 2026

కానూరులో డీఆర్డీవో పరీక్షలు.. పోలీసుల పహారా

image

కానూరులోని అయాన్ డిజిటల్ కేంద్రంలో సోమవారం నిర్వహించిన డీఆర్డీవో టెక్నికల్ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ పరీక్షలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తూ, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు ముగిసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అభ్యర్థులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

News March 22, 2026

మీ సమస్యలపై రేపు ఫిర్యాదు చేయవచ్చు: కృష్ణా కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని ఈ నెల 23వ తేదీ సోమవారం మచలీపట్నంలోని కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 11గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. డివిజన్, మండల స్థాయిలో కూడా పీజీఆర్ఎస్ నిర్వహించి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందన్నారు.

News March 22, 2026

కృష్ణా: ప్రారంభమైన ఇంటర్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్

image

మచిలీపట్నంలోని నోబుల్ కాలేజ్‌లో ఇంటర్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ఆదివారం ప్రారంభమైంది. జిల్లాకు 2 లక్షల సమాధాన పత్రాలు వచ్చాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారిణి సరళా కుమారి తెలిపారు. 225 మంది ఎగ్జామినర్‌లను నియమించగా ఒకొక్కరు రోజుకు 30 సమాధాన పత్రాలను వాల్యుయేషన్ చేస్తారన్నారు. వాల్యుయేషన్‌లో పాల్గొనే సిబ్బందికి అన్ని రకాల వసతులు కల్పించినట్లు ఆమె తెలిపారు.

News March 22, 2026

కృష్ణా: అపరాల రైతుల తిప్పలు.. పట్టాల కోసం పరుగులాట!

image

జిల్లాలో మారుతున్న వాతావరణం అపరాల సాగు రైతులను కలవరపెడుతోంది. అకాల వర్షాల ముప్పు నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు టార్ఫాలిన్ పట్టాల కోసం పరుగులు తీస్తున్నారు. డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో మార్కెట్‌లో పట్టాల కొరత ఏర్పడింది. చేసేది లేక అద్దె కేంద్రాల వద్ద లభించే చినిగిన, పాడైన పట్టాలనే తీసుకెళ్తున్నారు. తగినన్ని పట్టాలు అందుబాటులో లేక, ఉన్నవాటికి అద్దెలు పెరగడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.

News March 22, 2026

నాగాయలంక మత్స్యకార బిడ్డ.. అంతర్జాతీయ ఖ్యాతి!

image

కృష్ణా (D) నాగాయలంకకు చెందిన మత్స్యకార బిడ్డ నాగిడి గాయత్రి క్రీడా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కోర్సెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్’ను ఆమె పూర్తి చేసింది. శనివారం జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ కోచ్‌ల చేతుల మీదుగా ఆమె సర్టిఫికెట్, అవార్డు అందుకున్నారు. గాయత్రి ప్రతిభను గుర్తించిన గ్రామస్థులు, కోచ్‌లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.