Krishna

News April 23, 2025

స్పా సెంటర్‌పై పోలీసుల దాడి.. విజయవాడకు చెందిన ఇద్దరు అరెస్ట్

image

వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో రాజమండ్రిలోని ఓ స్పాట్ సెంటర్‌పై అక్కడి పోలీసులు మంగళవారం దాడి చేశారు. సీఐ మురళీకృష్ణ తెలిపిన సమాచారం ప్రకారం.. విజయవాడకు చెందిన మదన్, తేజస్విలు అన్నా చెల్లెలు. వీరు విజయవాడ నుంచి వెళ్లి రాజమండ్రిలో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని యువతులకు ఎరవేసి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఐదుగురు యువతులు, విటులను పట్టుకున్నారు.

News April 23, 2025

పెనమలూరు: ఉరి వేసుకుని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

image

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఉరివేసుకుని విద్యార్థిని మృతి చెందింది. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న యార్లగడ్డ ఖ్యాతి (20) హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పెనమలూరు పోలీసులు తెలిపారు.

News April 23, 2025

నేడే రిజల్ట్.. కృష్ణా జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. కృష్ణా జిల్లాలో మొత్తం 25,259మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రెగ్యులర్ విద్యార్థులు 21,009, ప్రైవేట్, ఒకేషనల్ విద్యార్థులు 4,250 మంది ఉన్నారు. నేడు విడుదలయ్యే పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 

News April 23, 2025

కృష్ణా: ధరిత్రిని కాపాడుకుందాం- కలెక్టర్

image

జిల్లా ప్రజలు ధరిత్రిని కాలుష్యం నుంచి కాపాడడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. మంగళవారం ధరిత్రి దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని తన చాంబర్లో కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడ పత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధరిత్రి దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక పర్యావరణ అవగాహన కార్యక్రమం అని పేర్కొన్నారు. 

News April 22, 2025

కృష్ణాజిల్లాలో ఉత్కంఠత

image

పదవ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో మొత్తం 25,259మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రెగ్యులర్ విద్యార్థులు 21,009, ప్రైవేట్, ఒకేషనల్ విద్యార్థులు 4,250 మంది ఉన్నారు. రేపు విడుదలయ్యే పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 

News April 22, 2025

కృష్ణా: ‘ఈ- కేవైసీ చేయకపోతే రేషన్ అందదు’

image

రేషన్ కార్డు లబ్ధిదారులు ఏప్రిల్ 30లోపు కేవైసీ పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సూచించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. జిల్లాలో 71,110 మంది ఇంకా చేయాల్సి ఉందని చెప్పారు. 5 ఏళ్లు లోపు, 80 ఏళ్లు పైబడినవారికి మినహాయింపు ఉందన్నారు. సంబంధిత వివరాలు డీలర్లు, తహసీల్దార్ల వద్ద ఉన్నాయని, గడువు మించినవారికి పథకాల లబ్ధి ఉండదని హెచ్చరించారు.

News April 22, 2025

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

image

పెనమలూరు మండలం పెద్దపులిపాకలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ రాజేష్ (29) విజయవాడ ఆటోనగర్లో వెల్డింగ్ పని చేసేవాడు. కొంతకాలం నుంచి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో పెదపులిపాకలోని తన ఇంట్లో సోమవారం సాయంత్రం రాజేశ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 22, 2025

కృష్ణా : పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు – DRO

image

కృష్ణా జిల్లాలో ఈ నెల 30వ తేదీన జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సోమవారం తన ఛాంబర్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు.10 పరీక్షా కేంద్రాల్లో 4546 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.

News April 22, 2025

కృష్ణా : ‘కోర్టు కేసుల్లో నిర్లక్ష్యం తగదు’

image

కోర్టు కేసులకు సంబంధించి వకాలత్, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమానికి ముందుగా జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై సమీక్షించారు.

News April 21, 2025

కృష్ణా: ట్రై సైకిల్ పంపిణీ చేసిన కలెక్టర్

image

సమాజంలో ఇతరుల మాదిరిగానే విభిన్న ప్రతిభావంతులు చాలా గర్వంగా బ్రతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్లో పాఠశాల విద్య – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో కలెక్టర్ దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు.