Krishna

News April 22, 2025

కృష్ణా : ‘కోర్టు కేసుల్లో నిర్లక్ష్యం తగదు’

image

కోర్టు కేసులకు సంబంధించి వకాలత్, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమానికి ముందుగా జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై సమీక్షించారు.

News April 21, 2025

కృష్ణా: ట్రై సైకిల్ పంపిణీ చేసిన కలెక్టర్

image

సమాజంలో ఇతరుల మాదిరిగానే విభిన్న ప్రతిభావంతులు చాలా గర్వంగా బ్రతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్లో పాఠశాల విద్య – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో కలెక్టర్ దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు.

News April 21, 2025

కృష్ణా: 131 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందజేత

image

జిల్లాలో 131 మంది విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు సైకిళ్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అందించారు. మెడికల్ క్యాంప్‌ల ద్వారా గుర్తించిన వీరికి రూ.15లక్షలు విలువ చేసే ట్రై సైకిల్స్, ఇతర ఉపకరణాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరితోపాటు పాఠశాలల్లో సమానంగా చదువుకోవడానికి ఈ ఉపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

News April 21, 2025

VJA ఆటోనగర్‌ లాడ్జీల్లో తనిఖీలు

image

విజయవాడ ఆటోనగర్‌లోని లాడ్జీల్లో శనివారం అర్ధరాత్రి పటమట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా పేకాట ఆడుతున్న ఐదుగురిని, వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పటమట పోలీసులు తెలిపారు.

News April 21, 2025

కృష్ణా: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

image

కృష్ణా జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.

News April 21, 2025

కృష్ణా: ‘నేడు కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమం’

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు(సోమవారం) కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉంటుందన్నారు.

News April 20, 2025

కృష్ణా: LLB పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన LLB 3వ, 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం సూచించింది.

News April 20, 2025

పెనమలూరు: రూ. 22 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

image

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న తాడిగడపకు చెందిన నూకల విజయశ్రీని సైబర్ నేరగాళ్లు భారీ మోసం చేశారు. ఆన్‌లైన్ టాస్కుల పేరుతో గ్రూపుల్లో చేర్చి, పెట్టుబడికి అధిక లాభాలంటూ నమ్మబలికిన నేరస్తులు దశలవారీగా ఆమె నుంచి రూ.22 లక్షలు దోచుకున్నారు. స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 20, 2025

కోర్టుకెళ్లి నష్టపరిహారం వసూలు చేస్తా: ఎమ్మెల్యే

image

హైదరాబాద్‌ పరిధిలోని కొండాపూర్‌లో 39 ఎకరాల స్థల వివాదంలో హైడ్రా రంగంలోకి దిగింది. శనివారం పోలీసుల బందోబస్తుతో అక్కడికి చేరుకున్న అధికారులు, స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌తో పాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించారు. ఈ స్థలం ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌కు చెందినదని సమాచారం. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లి నష్టపరిహారం వసూలు చేస్తామని తెలిపారు.

News April 20, 2025

బంటుమిల్లి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

image

బంటుమిల్లి మండలం నారాయణపురం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మచిలీపట్నంకు చెందిన వాసాబత్తిన వీరాచారి (29) ,అనకాపల్లి ప్రసాద్ (28) రాజమండ్రి నుంచి బైక్ పై మచిలీపట్నం వస్తుండగా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ ఇరువురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.