Krishna

News April 18, 2025

కృష్ణా: విద్యార్థి మృతదేహం లభ్యం

image

ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామానికి చెందిన విద్యార్థి ప్రత్తిపాటి పవన్ సమిత్ (15) గురువారం సాయంత్రం కేఈబీ కెనాల్‌లో స్నానం చేస్తూ గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎస్ఐ కె.ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కెఈబీ కెనాల్ వెంబడి గాలింపు చర్యలు చేపట్టగా చల్లపల్లి మండలం వెలివోలు కుమ్మరిపాలెం వద్ద శుక్రవారం పవన్ మృతదేహం లభ్యమైనది. ఈ సంఘటనతో పాపవినాశనంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News April 18, 2025

బాపులపాడు: మార్కెట్‌కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరి మృతి

image

బాపులపాడు మండలం వేలేరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేలేరు వద్ద కారు ఢీ కొనడంతో బైక్‌పై వెళ్తున్న బాబు అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇతను తేలప్రోలులో పట్టుగూళ్ల రీలింగ్ యూనిట్‌ని నిర్వహిస్తుంటాడు. పట్టుగూళ్ల కోసం హనుమాన్ జంక్షన్ మార్కెట్‌కు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

News April 18, 2025

ఘంటసాల: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..!

image

 ఘంటసాల పరిధిలోని పాప వినాశనం వద్ద విషాదం చోటుచేసుకుంది. గురువారం KEB కాలువలో పదో తరగతి విద్యార్థి పవన్ గల్లంతయ్యాడు. దురదృష్టవశాత్తూ ఇదే స్థలంలో 11 ఏళ్ల క్రితం పవన్ తండ్రి కూడా మృతి చెందారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న కుమారుడు కాలువలో కొట్టుకుపోవడంతో తల్లి గుండెలు అవిసేలా రోధిస్తోంది. గ్రామస్థులు పవన్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

News April 18, 2025

హనుమాన్ జంక్షన్‌లో తనిఖీలు చేసిన ఎస్పీ

image

రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి జిల్లావ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెరికేడు అండర్ పాస్ వద్ద జరిగిన నాకాబందిలో పాల్గొన్న జిల్లా ఎస్పీ గంగాధరరావు స్వయంగా వాహన తనిఖీలు చేశారు. వాహన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వారు ఎక్కడ నుంచి వస్తున్నది అడిగి తెలుసుకున్నారు.

News April 18, 2025

మసులా బీచ్ వేదికగా మేలో నేషనల్ వాటర్ స్పోర్ట్స్ పోటీలు

image

నేషనల్ వాటర్ స్పోర్ట్స్‌కు మసులా బీచ్ వేదిక కాబోతుంది. మే 15 నుంచి నిర్వహించే బీచ్ ఫెస్టివల్‌లో ఈ పోటీలు మిలితం కానున్నాయి. బీచ్ కబడ్డీతో పాటు SEA KAYA KING పోటీలను మసులా బీచ్ (మంగినపూడి బీచ్) లో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పోటీలకు సుమారు 10 నుంచి 15 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు తరలి రానున్నారు. వీరికి ఆతిథ్యం ఇచ్చేందుకు మచిలీపట్నం సిద్ధమవుతోంది.

News April 18, 2025

VJA: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని ఇంద్రనాయక్ నగర్‌లో గురువారం సాయంత్రం వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ఇంటిపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. టాస్క్‌ఫోర్స్, సింగ్ నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడిలో ఇద్దరు విటులు, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

News April 18, 2025

కృష్ణా: ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ‌ను కలిసిన ఏఎంసీ నూతన ఛైర్మన్

image

రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావును అవనిగడ్డ ఏఎంసీ నూతన ఛైర్మన్‌గా నియమితులైన కొల్లూరి వెంకటేశ్వరరావు కలిశారు. గురువారం మచిలీపట్నంలో ఆయనను కలిసి దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపి, సత్కరించారు. పార్టీ అప్పగించిన బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహించి పదవికి వన్నె తేవాలని ఏఎంసీ ఛైర్మన్‌కు నారాయణరావు సూచించారు.

News April 17, 2025

కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి. గోపి బాధ్యతలు 

image

కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి. గోపి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న అరుణ సారెక చిత్తూరుకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో విశాఖపట్నం వ్యాట్ కోర్టు అప్పలెట్ జడ్జిగా ఉన్న గోపి నియమితులయ్యారు. నేడు ఆయన జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. 

News April 17, 2025

నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న మంత్రి మనోహర్

image

మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం పునాదిపాడులో పర్యటించనున్నారు. అనంతరం పెనమలూరు మండలం వణుకూరులోని దాన్యం సేకరణ కేంద్రాలను పరిశీలిస్తారు. ఈ పర్యటనలో మంత్రి వెంట సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, సంభందిత ఆధికారులు పాల్గొంటారు.

News April 17, 2025

నీటి తీరువా పన్నును వసూలు చేయాలి: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో నీటి తీరువా పన్నును అత్యధిక ప్రాధాన్యతతో వసూలు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలక్టరేట్‌లోని క్యాంపు కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి రెవెన్యూ అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో రూ.32కోట్ల నీటి తీరువా పన్ను వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.9కోట్లు వసూలు చేశారన్నారు.