India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ-గుంటూరు మధ్య ప్రయాణించే 2 మెము ఎక్స్‌ప్రెస్‌లకు అదనంగా 2 జనరల్ కోచ్‌లు జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07783 విజయవాడ-గుంటూరు, నం.07788 గుంటూరు-విజయవాడ రైళ్లను ఈ నెల 23 నుంచి నవంబర్ 23 వరకు 2 అదనపు జనరల్ కోచ్‌లతో నడుపుతామన్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి ఏ.శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కస్టడీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. ముంబై నటి కాదంబరి జెత్వాని ఫిర్యాదు మేరకు అరెస్టైన విద్యాసాగర్ ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
నూజివీడులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఈ నెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎస్ఎస్డీసీ ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ వాడపల్లి కిషోర్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, పీజీ వంటి అర్హతలు ఉన్న యువత ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
విజయవాడ పున్నమి ఘాట్ వద్ద కృష్ణా నదీ తీరంలో మరికొన్ని గంటల్లో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో జరగనుంది. 5,500 డ్రోన్లతో సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8గంటల వరకు ప్రదర్శన ఉంటుంది. అర కిలోమీటరు ఎత్తులో ఏడు ఆకృతులను డ్రోన్లతో ఆవిష్కరించనున్నారు. ఈ షో చూసేందుకు నగరంలోని పలు చోట్ల డిజిటల్ తెరలను ఏర్పాటు చేశారు. మరి ఆలస్యమెందుకు.. 6.30కల్లా డ్రోన్ షో చూసేందుకు సిద్ధమవ్వండి.
జగ్గయ్యపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో అక్టోబర్ 23న జిల్లా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు దాసరి శ్రీనివాస్, ఎమ్ శ్రీనివాస్‌లు తెలిపారు. ఈ ఎంపికలు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14,17 బాల, బాలికలకు జరుగుతాయన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్జీఎఫ్ ఎంట్రీ ఫామ్‌తో హాజరుకావాలన్నారు
కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో BA.LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 9వ సెమిస్టర్(Y17 నుంచి Y20 బ్యాచ్‌లు) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను డిసెంబర్ 2 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 1 లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in వెబ్సైట్ చెక్ చేసుకోవాలని పరీక్షల కంట్రోలర్ వీరబ్రహ్మం సూచించారు.
డ్రోన్ సమ్మిట్‌లో నిర్వహిస్తోన్న హ్యాకథాన్ విజేతలకు మొత్తంగా రూ.24లక్షల ప్రైజ్ మనీని అమరావతి డ్రోన్ సమ్మిట్ ఇవ్వనుంది. మొత్తం 4 కేటగిరీలలో ఈ పోటీలు నిర్వహిస్తుండగా, ప్రతి కేటగిరిలో మొదటి బహుమతిగా రూ.3లక్షలు, సెకండ్, థర్డ్ ప్రైజ్‌గా రూ.2, రూ.1లక్షను ఇవ్వనున్నట్లు డ్రోన్ కార్పొరేషన్ ఛైర్మన్ దినేశ్ చెప్పారు. విజేతలను ఎంపిక చేసే జ్యూరీలో పలు ఐఐటీలు, కేంద్ర పౌర విమానశాఖ ప్రతినిధులు ఉంటారన్నారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో జూలై 2024లో నిర్వహించిన LLB కోర్సు 4వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 29లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్లైన్లో ఫీజు చెల్లింపు వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి టాలీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు తెలిపారు. కానూరులోని ఫెడరల్ స్కిల్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్లో అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ట్రైనింగ్ సెంటర్లో సంప్రదించాలన్నారు. ఈ శిక్షణకు బీకామ్, బీఎ, బీబీఏ, ఎమ్‌కామ్ పూర్తి చేసిన 18- 30 సంవత్సరాల అభ్యర్థులు అర్హులన్నారు.
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(D.El.Ed) విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఈ మేరకు టైంటేబుల్‌ను ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి.దేవానందరెడ్డి విజయవాడలోని తన కార్యాలయంలో విడుదల చేశారు. నవంబర్ 4,5,6,7 తేదీలలో ఉదయం 9- 11.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, 2023- 25 బ్యాచ్‌తో పాటు 2022- 24, 2021- 23లలో ఫెయిలైనవారు ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుందని దేవానందరెడ్డి తెలిపారు.
Sorry, no posts matched your criteria.