India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా జిల్లాలో శనివారం నిర్వహించిన 10వ తరగతి ఓరియంటల్ పరీక్షకు 99.82% మంది విద్యార్థులు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. 5,581 మంది విద్యార్థులకు గాను 5,571 మంది హాజరయ్యారని, 10 మంది గైర్హాజరైనట్టు డీఈఓ తెలిపారు. పలు పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ టీములు పరిశీలించగా ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.
మచిలీపట్నంలోని జడ్పీ స్కూల్ విద్యార్థులు టూర్‌కి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో శనివారం ఉదయం ఆగి ఉన్న లారీని వీరి బస్సు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది విద్యార్థులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మచిలీపట్నం చింత చెట్టు సెంటర్లో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. మృతుడు అదే ప్రాంతానికి చెందిన విర్నాల శ్రీను అలియాస్ టోపీ శ్రీనుగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీను నివాసంలోకి చొరబడి విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆయన ఘటన స్థలిలోనే మృతిచెందారు. పోలీసులు హత్యాస్థలానికి చేరుకొని మచిలీపట్నం డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైసీపీ నేతల అరెస్ట్‌లతో జగన్ పరపతి ఎక్కడా తగ్గదని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఏం చేయలేరని, 6 గ్యారంటీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పోసానిపై 18 కేసులు పెట్టేందుకు ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నించారు. అరెస్ట్‌లతో కూటమి నాయకులు మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు.
10వ తరగతి పరీక్షల్లో భాగంగా మూడవ రోజైన శుక్రవారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. 21,114 మంది విద్యార్థులకు గాను 20,840 మంది విద్యార్థులు హాజరయ్యారు. హాజరు శాతం 98.70% నమోదైంది. 33 పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ అధికారులు తనిఖీ చేయగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని డీఈఓ రామారావు తెలిపారు.
దేశ శాంతిభద్రతలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ప్రముఖ పాత్ర పోషిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ గురువారం సాయంత్రం మచిలీపట్నం చేరుకోగా శుక్రవారం ఉదయం జడ్పీ కన్వెన్షన్ నుంచి ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ సత్యనారాయణతో కలిసి కొంతదూరం సైకిల్ ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌ను కోర్టు వాయిదా వేసింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు విచారణను మార్చి 26కు వాయిదా వేసింది. కోర్టు దర్యాప్తు అధికారిణి హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణలో అధికారిపై వివరాలు కోరనుంది.
ర్యాలీలో పాల్గొన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందిని కలెక్టర్ డీకే బాలాజీ అభినందిస్తూ వారు చూపుతున్న దేశభక్తి, అంకితభావం ప్రశంసనీయమన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సీఐఎస్ఎఫ్ దేశం నలుమూలల అంతర్గత పరిరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. ప్రజల సహకారంతోనే ప్రభుత్వం ముందడుగు వేయడానికి వీలుందన్నారు. ప్రజలను భాగస్వామ్యులుగా చేయాలనే ఉద్దేశంతో సీఐఎస్ఎఫ్ బృహత్తర కార్యక్రమం చేపట్టిందన్నారు.
అర్హులకు ప్రభుత్వ లబ్ధిచేకూరేలా జిల్లా అధికార యంత్రాంగం కృషి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారిగా నియమితులైన సీనియర్ ఐఎఎస్ అధికారి డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ అన్నారు. జిల్లాల్లో పాలనా వ్యవహారాలు పరిశీలించేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్లను నియమించిన సంగతి తెలిసిందే. జిల్లాకు నియమితులైన మనజీర్ జిలానీ గురువారం కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు స్వాగతం పలికారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఉద్యోగులందరూ ఈ నెల 26వ తేదీలోగా కర్మయోగి భారత్ ఆన్ లైన్ శిక్షణ పూర్తి చేసుకుని ధృవీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అధికారులతో ఐ గాట్ కర్మయోగి భారత్ శిక్షణ కార్యక్రమంపై వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Sorry, no posts matched your criteria.