India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

‘మొంథా’ తుపాన్ ప్రభావం వల్ల దివిసీమ ప్రజలు కలవరపడుతున్నారు. గతంలో కృష్ణా జిల్లాను కకావికలం చేసిన 1977 తుపానును గుర్తుచేసుకుంటున్నారు. దీంతో దివిసీమ చిగురుటాకులా వణుకుతోంది. ఆ సంవత్సరం నవంబర్ 19న తుపాను భారతదేశపు తూర్పు సముద్రతీరాన్ని తాకింది. అధికారికంగా 14,204, అనధికారికంగా సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. కొన్ని ఊర్లు సముద్రంలో కలిసిపోయాయి.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారనుందని APSDMA తెలిపింది. ఇది చెన్నైకి 640 కి.మీ, విశాఖపట్నానికి 740 కి.మీ, కాకినాడకు 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. నేడు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తుఫాన్ ప్రభావం కొనసాగుతుండడంతో ముందుగానే చేతికి వచ్చిన పంటను భద్రపరచుకునే పనుల్లో రైతులు జిల్లా వ్యాప్తంగా నిమగ్నమయ్యారు. వర్షం ఎప్పుడు మొదలవుతుందో అన్న ఆందోళనతో పంటను ఎండబెట్టి రాశులుగా చేసి భద్రపరుచుకుంటున్నారు. తుఫాన్ కారణంగా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం రాశులుగా వేసి తడవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్న దృష్ట్యా గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలన్నారు.

తుఫాన్ ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారిణి (డీపీఓ) జె.అరుణ సూచించారు. మట్టి మిద్దెలు, కల్వర్టులు, పూరి గుడిసెలు, రోడ్డు పక్కన గుడారాల్లో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, వీఆర్ఓలు, కార్యదర్శులు, ఇతర సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

మొంథా తుపాన్ పరిస్థితులను అంచనా వేసేందుకు గాను జిల్లాలోని 25 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని సజావుగా తుపాన్ ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ విభాగాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. తుఫాన్ సంబంధిత సమాచారం లేదా సహాయక చర్యల కోసం ప్రజలు ఈ కింది నంబర్లను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయం 08672-252572, MTM RDO 08672-252486, గుడివాడ 08674-243693, ఉయ్యూరు 08676-232589, ఈ కంట్రోల్ రూములు నిరంతరం పనిచేస్తాయని కలెక్టర్ చెప్పారు.

తుఫాన్ కారణంగా ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు ఆదివారం సాయంత్రంలోగా తిరిగి ఇంటికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్య శాఖాధికారులను కోరారు.

‘మోంతా’ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు శెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా విద్యా సంస్థలకు శెలవు ప్రకటిస్తున్నామన్నారు. సంక్షేమ హాస్టల్స్లో ఉండే విద్యార్థులందరినీ 26వ తేదీ సాయంత్రం లోపు వారి వారి ఇళ్లకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వంపై బురదజల్లే పనిలో పడ్డారని గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. విజయవాడ ఆర్అండ్బీ అతిథి గృహంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు కృష్ణా జిల్లాను అరాచకాల నిలయంగా మార్చారన్నారు.
Sorry, no posts matched your criteria.