Krishna

News August 8, 2024

కృష్ణా: TODAY TOP NEWS

image

* విజయవాడలో సీఎం చంద్రబాబు చీర కొన్నది.. ఎవరి దగ్గరంటే.?
* విజయవాడ: రేపు ITI కళాశాలలో జాబ్ మేళా
* విజయవాడ: ఎమ్మెల్యే సుజనా చౌదరితో వైసీపీ కార్పొరేటర్లు భేటీ
* ‘కృష్ణాకు భారీ వరద.. నదిలో ప్రయాణించొద్దు’
* విజయవాడలో ఘోర విషాదం.. ఇద్దరి మృతి
* గుడివాడలో రెస్టారెంట్ ప్రారంభించిన సినీ హీరో
* విజయవాడ: ఫ్యాషన్ షోలో మెరిసిన యువతులు

News August 8, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ మేరకు శుక్రవారం మచిలీపట్నం నుంచి తిరుపతికి(నం.07249) ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రేపు రాత్రి 11 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరి శనివారం ఉదయం 8 గంటలకు ఈ రైలు తిరుపతి చేరుతుందని తెలిపింది. ఈ రైలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ, విజయవాడలో ఆగుతుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.

News August 8, 2024

కృష్ణా: డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో మే-2024లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News August 8, 2024

ఆదివాసి దినోత్స‌వ వేడుక‌లకి చీఫ్ గెస్ట్‌గా చంద్రబాబు

image

విజ‌య‌వాడ త‌మ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో శుక్ర‌వారం నిర్వహించనున్న ప్ర‌పంచ ఆదివాసి దినోత్స‌వ వేడుక‌ ఏర్పాట్లను గిరిజ‌న కార్పొరేష‌న్ ఎండీ న‌వ్య గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సీఎం చంద్ర‌బాబు రానున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఆదివాసీలు హాజ‌రుకానున్న‌ట్లు టీడీపీ నేత మాదిగాని గురునాథం తెలిపారు.

News August 8, 2024

విజయవాడ: ఎమ్మెల్యే సుజనా చౌదరితో వైసీపీ కార్పొరేటర్లు భేటీ

image

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పలువురు వైసీపీ కార్పొరేటర్లు గురువారం ఎమ్మెల్యే సుజనా చౌదరిని కలిశారు. కార్పొరేటర్లు రాజేశ్, మహదేవ్ అప్పాజీ, అర్షద్, నరేంద్ర, రత్నకుమారి, లావణ్య, ఆదిలక్ష్మి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విజయవాడ వైసీపీ అగ్రనాయకత్వం తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

News August 8, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రహదారుల అభివృద్ధికి నిధులిచ్చిన కేంద్రం

image

2024- 25 కేంద్ర బడ్జెట్‌లో జిల్లాలోని రహదారుల అభివృద్ధికి నిధుల కేటాయింపుల వివరాలు:
*మచిలీపట్నం- అవనిగడ్డ రహదారి రూ.8.12 కోట్లు
*NH 216 పెడన బైపాస్ రహదారి రూ.12.35 కోట్లు
*పామర్రు- ఆకివీడు రహదారి రూ.140.55 కోట్లు
*గుడివాడ- మచిలీపట్నం మధ్య ROB నిర్మాణానికి రూ.100.22 కోట్లు
*విజయవాడ భవానీపురం- కనకదుర్గ పైవంతెన మధ్య పనులకు రూ.15.21 కోట్లు

News August 8, 2024

విద్యార్థులకు అలర్ట్: పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీపీఈడీ, ఎంపీఈడీ, డీపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఆగస్టు 19 నుంచి 22 తేదీల మధ్య ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News August 8, 2024

విజయవాడ: రేపు ITI కళాశాలలో జాబ్ మేళా

image

విజయవాడలోని ప్రభుత్వ ITI కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా జరగనుంది. ఈ మేళాలో SSC, ITI, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతతో పలు సంస్థలలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి విక్టర్ బాబు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 18- 30 సంవత్సరాలలోపు వయస్సున్న నిరుద్యోగులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

News August 8, 2024

కృష్ణా: ‘MA భగవద్గీత కోర్సుకు దరఖాస్తు చేసుకోండి’

image

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) రెండేళ్ల కాలవ్యవధితో ఓపెన్/డిస్టెన్స్ విధానంలో భగవద్గీతపై ఎంఏ కోర్సు అందిస్తోంది. డిగ్రీ పూర్తి చేసినవారు ఈ కోర్స్ చేసేందుకు అర్హులు కాగా, అడ్మిషన్ గడువు ఈ నెల 14తో ముగియనుంది. కోర్స్ అడ్మిషన్, పూర్తి వివరాలకు విజయవాడ కొత్తపేట హిందూ హైస్కూల్‌లోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు DR శర్మ తెలిపారు.

News August 8, 2024

విజయవాడలో సీఎం చంద్రబాబు చీర కొన్నది.. ఎవరి దగ్గరంటే.?

image

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బుధవారం విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా యు.కొత్తపల్లికి చెందిన చేనేత కార్మికుడు మల్లెల నాగేంద్ర ఉప్పాడ చేనేత చీరలతో విజయవాడలో స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నాగేంద్ర వద్ద రూ.20వేలకు ఉప్పాడ చీరను కొనుగోలు చేశారు.