Kurnool

News September 5, 2024

కర్నూలు జిల్లా YCP అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్ రెడ్డి

image

కర్నూలు జిల్లా వైసీపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీ అధిష్ఠానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలిగా కార్పొరేటర్ నారాయణమ్మ కొనసాగారు. కాగా, 2014 నుంచి 2019 వరకు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశారు.

News September 5, 2024

మీ ఎదుగుదలకు తోడ్పడిన గురువు ఎవరు?

image

ఈ ప్రపంచంలో గురువే సమస్తం. ఏ రంగంలో రాణించిన వారైనా, సమాజంలో ఉన్నతస్థాయికి చేరుకున్న వారైనా ఒక గురువు వద్ద పాఠాలు నేర్చుకున్న వారే. గురువు అందించిన విజ్ఞానం, ప్రోత్సాహం, స్ఫూర్తితో ఉన్నత స్థానాలను అధిరోహించిన వారే. మెరుగైన సమాజాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషించేది గురువులే. మరి మీ జీవితంలో మీ ఎదుగుదలకు తోడ్పడిన, మీకు ఎంతగానో నచ్చిన గురువు ఎవరు? కామెంట్ చేయండి..
#HappyTeachersDay

News September 5, 2024

KNL: మెయిడెన్ ప్రతినిధులతో మంత్రి భరత్ భేటీ

image

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమల ప్రతినిధులు ఆసక్తిగా ఉన్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీలో వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు భరత్ పేర్కొన్నారు. బుధవారం మెయిడెన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యి గ్రూప్ విస్తరణ ప్రణాళికల గురించి సంస్థ ఎండీ, ప్రతినిధులతో చర్చించినట్లు మంత్రి భరత్ వెల్లడించారు.

News September 5, 2024

వైఎస్ జగన్‌ను కలిసిన కర్నూలు జిల్లా నేతలు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాడేపల్లిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం కలిశారు. తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. జగన్‌ను కలిసిన వారిలో జిల్లా నేతలు మాజీ ఎంపీ బ్రహ్మానంద రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, రామిరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, రవి కిషోర్ రెడ్డి ఉన్నారు.

News September 5, 2024

కర్నూలు: ‘శవ రాజకీయాలు మానుకో జగన్’

image

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని ఆదోని మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు మాన్వి దేవేంద్రప్ప సూచించారు. విజయవాడ వరద బాధితుల కోసం కూటమి ప్రభుత్వం రాత్రింబవళ్లు శ్రమిస్తుంటే.. జగన్ మాత్రం శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అర్ధరాత్రి వరకు అధికారులతో సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహిస్తున్నారని, అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు.

News September 5, 2024

విద్యుత్ బిల్లును ఆదా చేసుకోండి: కలెక్టర్

image

ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద గృహ వినియోగదారులకు సబ్సిడీతో సోలార్ రూఫ్ టాప్‌లను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా విద్యుత్ బిల్లును ఆదా చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. బుధవారం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం అమలుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఒక కిలో వాట్ సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు 100 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుందన్నారు.

News September 4, 2024

సంగపట్నంలో వ్యక్తి ఆత్మహత్య

image

అవుకు మండలం సంగపట్నం గ్రామానికి చెందిన చాకలి చిన్న అంకాలు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై రాజారెడ్డి తెలిపారు. మద్యానికి బానిసై భార్య తాగడానికి డబ్బులు ఇవ్వలేదని మనస్థాపం చెంది పేడ రంగు నీటిలో కలుపుకుని తాగాడన్నారు. కుటుంబ సభ్యులు అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News September 4, 2024

పంట నష్టం అంచనా వేసి నివేదికను అందించండి: కలెక్టర్

image

వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టం అంచనా వేసి వాస్తవ నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. బుధవారం తుగ్గలి మండలం పగిడిరాయిలో దెబ్బతిన్న ఆముదం, సజ్జ, కంది, టమాటా పంట పొలాలను ఆయన పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడారు. ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేశారు? దిగుబడి ఎంత వచ్చింది? అని అడిగి తెలుసుకున్నారు.

News September 4, 2024

నంద్యాల: 196 మందికి ఉద్యోగాలు

image

నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాలో 196 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పీవీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. 586 మంది యువతీ, యువకులు పాల్గొనగా 196 మంది ఎంపికయ్యారన్నారు. 8 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో ఎన్ఎండీ ఫిరోజ్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

News September 4, 2024

కానిస్టేబుల్‌కు గోల్డ్ మెడల్.. నంద్యాల ఎస్పీ అభినందన

image

నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఫర్హతుల్లా రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించడం అభినందనీయమని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ను మంగళవారం ఎస్పీ కార్యాలయంలో అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పుదుచ్చేరిలో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.