India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కోసిగి మండలం కందుకూరు సమీపంలో తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లిన కర్ణాటక వాసుల నలుగురు మృతి చెందిన ఘటనపై ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారాన్ని అధికారుల నుంచి తెలుసుకున్న ఎంపీ.. మృతదేహాలను త్వరగా వారి స్వస్థలాలకు తరలించేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు(M) పి.రుద్రవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, పుండుకుర మధు, మధుసూదన్ తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు జిల్లా బహిష్కరణకు గురైన వారి సంఖ్య 8కి చేరింది.

వేసవికాలపు సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చిన్నపిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈత రాని పిల్లలు కాల్వలు, కుంటలు, చెరువులు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణ శివారు ప్రాంతాల్లో నీటి వనరుల వద్ద జారిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

జనగణన-2027 ప్రక్రియను నియమ నిబంధనల ప్రకారం పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గృహ జాబితా, గృహ జనగణన కార్యక్రమాలపై నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. హౌస్ మ్యాపింగ్‌ను పకడ్బందీగా చేసి, నమోదు చేసే ప్రతీ వివరంలో కచ్చితత్వం పాటించాలని సూచించారు. అధికారులు పూర్తి శ్రద్ధతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.

2026-27 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ టారిఫ్ పెంపు ఉండదని ఏపీఈఆర్సీ ఛైర్మన్ పీవీఆర్ రెడ్డి తెలిపారు. కర్నూలులో APERC విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పంపిణీ సంస్థలు సూచించిన లోటును తగ్గించి, భారం ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. గృహ, వ్యవసాయ వినియోగదారులకు ఎలాంటి అదనపు భారం లేదన్నారు. వాణిజ్య టారిఫ్‌ను కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు.

కర్నూలుకు చెందిన కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా. కోలా ప్రతాప్ కుమార్‌ను దక్షిణ భారత కరాటే సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈనెల 22న మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎల్ఎన్‌సీటీ యూనివర్సిటీలో నిర్వహించిన భారత కరాటే అసోసియేషన్ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఎన్నుకున్నట్లు బుధవారం భారత కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యోగేశ్ కలరా వెల్లడించారు. ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు అభినందించారు.

Sorry, no posts matched your criteria.